కౌపీన సంరక్షణార్ధం...
ప్రొద్దున్నే సెల్ఫోన్ అదేపనిగా రింగ్ అవుతోంది. నేను జప తపాలు ముగించుకుని, సంధ్యవార్చుకుని హాల్లోకి వచ్చేటప్పటికి అరచి పిలిచి అలసి సొలసి ఆగిపోయింది.
'ఎవరు చేశారు చెప్మా!' అని చూద్దును కదా మా తోడల్లుడు అవధానిగారు, ఈమధ్యనే... అంటే సంవత్సరం క్రితమే మా వదినగారు అంటే ఆయన అర్ధాంగి - బాల్చీ తన్నేసింది... అంటే కాలం చేసింది. ఆయనగారికి ఇద్దరు కూతుళ్ళు. పెద్ద కూతురుకు పెళ్ళి చేశాడు. రెండో ఆమె పెళ్ళి చేయాలి. సంబంధాలు చూడమని తరచు మిస్డ్ కాల్స్ చేస్తూంటాడు. పెద్దముండావాడు పదిసార్లు చేశాడు కాబట్టి తిరిగి మనం చెయ్యకపోతే ఆయన నిష్ఠూరాలాడతాడు, నేను మళ్ళీ ఫోన్ కొట్టాను.
ఆయన ఫోన్ ప్రక్కనే గోతికాడ నక్కలా కాచుక్కూర్చుని టక్కున ఆన్ చేశాడు.
హలో” అన్నాను సెల్ ఆన్ చేశాడే అని నీరసంగా. ఆయన సొమ్మేం పోయింది.
"హల్లో! హల్లో!” అన్నాడు 'ముత్యాలముగ్గు' లో రావుగోపాలరావులా.
"చెప్పండి అన్నయ్యగారూ! ఏమిటి విశేషం?” అన్నాను, రోట్లో తలదూర్చాక రోకలిపోటుకు వెరవదు అన్నట్లు.
“పెళ్ళి.... శోభనం లేకుండా విశేషమేమిటయ్యా?" అన్నాడు.
"అయ్యా! సంబంధాలు చూస్తూనే ఉన్నాను, ఫొటో, జాతకం, బయోడేటా చంకలో పెట్టుకు తిరుగుతున్నా” అన్నాను పెళ్ళిళ్ళ పేరయ్యలా.
“చమటకు తడిసి తగలడుతుంది. బ్యాగ్ లో పెట్టుకోండి” సలహా ఇచ్చాడాయన.
“దానికేం ఢాకా లేదు, తమ స్థాయికి తగ్గ సంబంధం కోసం పగలూ రేయీ తిరుగుతున్నా” అన్నాను, నాకు వేరే పనేం లేనట్టు.
“పగలు చాలు, రాత్రి తిరుగుళ్ళు మాని ఆరోగ్యం జాగ్రత్త. ఇకపోతే... స్థాయి కాదు, వయస్సు....వయస్సుకు తగ్గ సంబంధం...”
“అదే... పిల్లకు పాతికేళ్ళు దాటాయనుకుంటా” అన్నాను, ఆయన కూతురు వయస్సు గుర్తుచేస్తూ................
కౌపీన సంరక్షణార్ధం... ప్రొద్దున్నే సెల్ఫోన్ అదేపనిగా రింగ్ అవుతోంది. నేను జప తపాలు ముగించుకుని, సంధ్యవార్చుకుని హాల్లోకి వచ్చేటప్పటికి అరచి పిలిచి అలసి సొలసి ఆగిపోయింది. 'ఎవరు చేశారు చెప్మా!' అని చూద్దును కదా మా తోడల్లుడు అవధానిగారు, ఈమధ్యనే... అంటే సంవత్సరం క్రితమే మా వదినగారు అంటే ఆయన అర్ధాంగి - బాల్చీ తన్నేసింది... అంటే కాలం చేసింది. ఆయనగారికి ఇద్దరు కూతుళ్ళు. పెద్ద కూతురుకు పెళ్ళి చేశాడు. రెండో ఆమె పెళ్ళి చేయాలి. సంబంధాలు చూడమని తరచు మిస్డ్ కాల్స్ చేస్తూంటాడు. పెద్దముండావాడు పదిసార్లు చేశాడు కాబట్టి తిరిగి మనం చెయ్యకపోతే ఆయన నిష్ఠూరాలాడతాడు, నేను మళ్ళీ ఫోన్ కొట్టాను. ఆయన ఫోన్ ప్రక్కనే గోతికాడ నక్కలా కాచుక్కూర్చుని టక్కున ఆన్ చేశాడు. హలో” అన్నాను సెల్ ఆన్ చేశాడే అని నీరసంగా. ఆయన సొమ్మేం పోయింది."హల్లో! హల్లో!” అన్నాడు 'ముత్యాలముగ్గు' లో రావుగోపాలరావులా. "చెప్పండి అన్నయ్యగారూ! ఏమిటి విశేషం?” అన్నాను, రోట్లో తలదూర్చాక రోకలిపోటుకు వెరవదు అన్నట్లు. “పెళ్ళి.... శోభనం లేకుండా విశేషమేమిటయ్యా?" అన్నాడు. "అయ్యా! సంబంధాలు చూస్తూనే ఉన్నాను, ఫొటో, జాతకం, బయోడేటా చంకలో పెట్టుకు తిరుగుతున్నా” అన్నాను పెళ్ళిళ్ళ పేరయ్యలా. “చమటకు తడిసి తగలడుతుంది. బ్యాగ్ లో పెట్టుకోండి” సలహా ఇచ్చాడాయన. “దానికేం ఢాకా లేదు, తమ స్థాయికి తగ్గ సంబంధం కోసం పగలూ రేయీ తిరుగుతున్నా” అన్నాను, నాకు వేరే పనేం లేనట్టు. “పగలు చాలు, రాత్రి తిరుగుళ్ళు మాని ఆరోగ్యం జాగ్రత్త. ఇకపోతే... స్థాయి కాదు, వయస్సు....వయస్సుకు తగ్గ సంబంధం...” “అదే... పిల్లకు పాతికేళ్ళు దాటాయనుకుంటా” అన్నాను, ఆయన కూతురు వయస్సు గుర్తుచేస్తూ................© 2017,www.logili.com All Rights Reserved.