ఈ సంపుటిలోని కథలు, ఒక కథా రూపిక ఉన్నాయి. ఇవి చదివినప్పుడు ఇందిరా రచన వ్యూహం, శక్తీ ఎక్కడున్నాయి. అని మనం ఆలోచిస్తాం. ఇవి కథా వస్తువులోనా? పాత్ర చిత్రణలోనా? నేపథ్యంలోనా? దృష్టి కోణంలోనా? స్వరంలోనా? శైలులు వాడకంలోనా? విశ్వసనీయతలోనా? దృక్పథంలోనా? మొత్తం వ్యూహంలోనా? అని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాం.
ఈ కథలన్నీ మానవ సంబంధాల చుట్టూ అల్లినవే. కథల్లో కన్పించే స్త్రీ పురుషులు సమాజం లోని మారని, మారిన, మారిపోతున్నవాళ్ళు. వాళ్ళ సామజిక సంబంధాలును భౌతిక, మానసిక ఘర్షణలను వ్యక్తికరించడానికి ఇందిరా కథలను అనువైన సాధనాలుగా భావించింది. ప్రథమ పరుషలోని చీకటి తప్ప, మిగతావి అన్ని ఉత్తమ పరుషలో రచించినవే. ఉత్తమ పురుష దృష్టి కోణంలోని ఆత్మీయ కథన లక్షణాన్ని, హృదయ సంస్కారాన్ని, విశ్వసనీయత చెడకుండా సంయమనంతో చిత్రించింది. ఈ కథల్లో వృద్దులు, మధ్య వయస్కులు, తల్లులు, తండ్రులు, పిల్లలు, విద్యావంతులు, ఇబ్బందులతో చదువు ఆపిన యువకులు, ఆపేక్షలున్నస్నేహితులు, అన్నదమ్ములు కనిపిస్తారు. ఇది 22 అందమైన కథలున్న కథల సంపుటి.
-కేతు విశ్వనాథరెడ్డి.
ఈ సంపుటిలోని కథలు, ఒక కథా రూపిక ఉన్నాయి. ఇవి చదివినప్పుడు ఇందిరా రచన వ్యూహం, శక్తీ ఎక్కడున్నాయి. అని మనం ఆలోచిస్తాం. ఇవి కథా వస్తువులోనా? పాత్ర చిత్రణలోనా? నేపథ్యంలోనా? దృష్టి కోణంలోనా? స్వరంలోనా? శైలులు వాడకంలోనా? విశ్వసనీయతలోనా? దృక్పథంలోనా? మొత్తం వ్యూహంలోనా? అని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాం. ఈ కథలన్నీ మానవ సంబంధాల చుట్టూ అల్లినవే. కథల్లో కన్పించే స్త్రీ పురుషులు సమాజం లోని మారని, మారిన, మారిపోతున్నవాళ్ళు. వాళ్ళ సామజిక సంబంధాలును భౌతిక, మానసిక ఘర్షణలను వ్యక్తికరించడానికి ఇందిరా కథలను అనువైన సాధనాలుగా భావించింది. ప్రథమ పరుషలోని చీకటి తప్ప, మిగతావి అన్ని ఉత్తమ పరుషలో రచించినవే. ఉత్తమ పురుష దృష్టి కోణంలోని ఆత్మీయ కథన లక్షణాన్ని, హృదయ సంస్కారాన్ని, విశ్వసనీయత చెడకుండా సంయమనంతో చిత్రించింది. ఈ కథల్లో వృద్దులు, మధ్య వయస్కులు, తల్లులు, తండ్రులు, పిల్లలు, విద్యావంతులు, ఇబ్బందులతో చదువు ఆపిన యువకులు, ఆపేక్షలున్నస్నేహితులు, అన్నదమ్ములు కనిపిస్తారు. ఇది 22 అందమైన కథలున్న కథల సంపుటి. -కేతు విశ్వనాథరెడ్డి.© 2017,www.logili.com All Rights Reserved.