ఈ పుస్తకం మిమ్మల్ని యూరప్ లోని పది దేశాలలోని గొప్ప నగరాలకు తీసుకెళుతుంది. ఆయా ప్రాంతాల్లోని ప్రసిద్ధ కట్టడాలు, మ్యూజియంలను, వాటిలోని ప్రముఖ కళాఖండాలను, వాటి ఘనచరిత్రను కళ్ళకు కడుతుంది. తరతరాలుగా యూరపియన్లు ఎంతో పదిలంగా కాపాడుకుంటున్న సాంస్కృతిక వైభవంతో పాటు.. రెండు ప్రపంచ యుద్ధాల వెనుక దాగిన అమానవీయ చీకటి కోణాన్ని కూడా మీ ముందు ఆవిష్కరిస్తుంది. నా యూరప్ అనుభవాల్ని కేవలం ట్రావెల్ గా రాయాలనుకున్నాను. కానీ అది అంత ఆసక్తికరంగా ఉండక పోవచ్చునని అనిపించి ఇందులోకి కథని చేర్చాను. నవలలోని నీల్, నీహల సంభాషణలు చాలా భాగం నాకు ధీరజ్ కు మధ్య జరిగినవే. కథా సౌలభ్యం కోసం మరికొన్ని కల్పించి రాసినవి. నేను కలలుగనే భారతదేశాన్ని ఊహిస్తూ ముగింపును రాశాను.
ఈ పుస్తకం మిమ్మల్ని యూరప్ లోని పది దేశాలలోని గొప్ప నగరాలకు తీసుకెళుతుంది. ఆయా ప్రాంతాల్లోని ప్రసిద్ధ కట్టడాలు, మ్యూజియంలను, వాటిలోని ప్రముఖ కళాఖండాలను, వాటి ఘనచరిత్రను కళ్ళకు కడుతుంది. తరతరాలుగా యూరపియన్లు ఎంతో పదిలంగా కాపాడుకుంటున్న సాంస్కృతిక వైభవంతో పాటు.. రెండు ప్రపంచ యుద్ధాల వెనుక దాగిన అమానవీయ చీకటి కోణాన్ని కూడా మీ ముందు ఆవిష్కరిస్తుంది. నా యూరప్ అనుభవాల్ని కేవలం ట్రావెల్ గా రాయాలనుకున్నాను. కానీ అది అంత ఆసక్తికరంగా ఉండక పోవచ్చునని అనిపించి ఇందులోకి కథని చేర్చాను. నవలలోని నీల్, నీహల సంభాషణలు చాలా భాగం నాకు ధీరజ్ కు మధ్య జరిగినవే. కథా సౌలభ్యం కోసం మరికొన్ని కల్పించి రాసినవి. నేను కలలుగనే భారతదేశాన్ని ఊహిస్తూ ముగింపును రాశాను.© 2017,www.logili.com All Rights Reserved.