సైన్స్ ఎగ్జిబిషన్
మీను స్కూల్లో సైన్సు ఎగ్జిబిషన్ కి చాలా బాగా ఏర్పాటు చేస్తారు. మీను దాని కోసం ప్రత్యేకంగా ఏదో ఒకటి తయారుచేస్తుంది. మిట్టూ, మీను ఏం తయారుచేస్తుందా అని ఆసక్తిగా ఎదురు
చూడసాగాడు.
మీను రెండునెలల కిందటే అపార్ట్మెంట్ బాల్కనీలో ఓ ప్లాస్టిక్ సంచి తెచ్చి పెట్టింది. అందులో ఇంట్లోని చెత్తా, చెదారం, వంటింటి కూరగాయల తుక్కులు అన్నీ వేసి మూటకు ఉంచింది. అందులో అడుగున కొంచెం మట్టి పోసి తుక్కు మీద మట్టి పోసి మూతిలిగింది కట్టింది.
మిట్టూకి చెత్త ఎత్తాలంటే పరమబద్ధకం. అమ్మ చెత్త ఇచ్చి పడేయమంటే బాలనీలో ఓ మూల పెట్టి తప్పించుకుంటూంటాడు. మీను దాన్ని తీసి తన ప్లాస్టిక్ సంచిలో వేసి మూటకట్టేది. |
మిట్టూ ఎగ్జిబిషన్ కోసం శాస్త్రవేత్తల పేర్లు వాళ్ళ పరిశోధనల బొమ్మలు పెట్టి, కరెక్ట్ స్విచ్ నొక్కితే, బల్బులు వెలిగేలా బోర్డును తయారుచేసాడు.
టీచర్ కి అందరూ తమ అంశాల పేర్లు ఇచ్చారు. మీను పేరు అందులో లేదు. మీను ఏమీ తయారుచేయలేదు కాబోలు అనుకుని మిట్టూ ఎగ్జిబిషన్ రోజు మీను కోసం ఆగకుండా వెళ్ళిపోయాడు. తన క్విజ్ బోర్డ్ చూసి అందరూ ఆశ్చర్యపోతారనుకున్నాడు.
ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఒక్కొక్కరి వస్తువులు | చూస్తూ వెళ్ళిన కలెక్టర్ పక్కషెడ్ దగ్గర ఆగి ఫోటోగ్రాఫర్ ని పిలిచి ఫోటో తీయించుకున్నారు. అక్కడంతా ఒకటే హడావుడి, సందడి. ఎవరి ప్లేలో వాళ్ళుండాలి, కదలకూడదని టీచర్ చెప్పడం వలన మిట్టూకి అక్కడికి వెళ్ళడం కుదరలేదు.
బ్రేక్ ఇవ్వగానే మిట్టూ షెడ్ కి వెళ్ళి చూసాడు. మీను నెల్లాళ్ళ నుంచి చెత్త వేసినసంచికి అందమైన రంగు కాగితం అంటించి బోర్డు పెట్టింది. ఆ సంచిలోంచి ఆకుపచ్చని తోటకూర, | పాలకూర మొక్కలు ఎంతో అందంగా ఉండి, క్లీన్ అండ్ గ్రీన్ అని రాసిన అట్టముక్క పొద్దు పక్కన, మీను నిలబడి నవ్వుతోంది.
ఈసారి కూడా నీదే బెస్ట్ ఎగ్జిబిట్ మీనూ! నువు ఫిజికల్ సైన్సు టీచర్ కి పేరు ఇవ్వక ఏమీ చేయడం లేదనుకున్నారు మిస్. నీ ఎగ్జిబిట్ ని కలెక్టర్ గారు ఎంతో మెచ్చుకున్నారు. ఈ గిఫ్ట్ గా ఈ చెక్ ఇమ్మన్నారు.' అని ప్రిన్సిపాల్ మీనుని అభినందిస్తున్నారు. తన ఎగ్జిలు గర్వపడాలనుకున్న మిట్టూ అది చూసి సిగ్గుపడ్డాడు. మీను మిట్టూతో 'నీ బోర్డుకి రంగురం! బల్బులు పెడితే ఇంకా బావుంటుంది. ఇప్పుడు కూడా బావుందిలే' అంది. థాంక్యూ - కంగ్రాట్స్! అన్నాడు మిట్టూ మనస్ఫూర్తిగా..............
సైన్స్ ఎగ్జిబిషన్ మీను స్కూల్లో సైన్సు ఎగ్జిబిషన్ కి చాలా బాగా ఏర్పాటు చేస్తారు. మీను దాని కోసం ప్రత్యేకంగా ఏదో ఒకటి తయారుచేస్తుంది. మిట్టూ, మీను ఏం తయారుచేస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూడసాగాడు. మీను రెండునెలల కిందటే అపార్ట్మెంట్ బాల్కనీలో ఓ ప్లాస్టిక్ సంచి తెచ్చి పెట్టింది. అందులో ఇంట్లోని చెత్తా, చెదారం, వంటింటి కూరగాయల తుక్కులు అన్నీ వేసి మూటకు ఉంచింది. అందులో అడుగున కొంచెం మట్టి పోసి తుక్కు మీద మట్టి పోసి మూతిలిగింది కట్టింది. మిట్టూకి చెత్త ఎత్తాలంటే పరమబద్ధకం. అమ్మ చెత్త ఇచ్చి పడేయమంటే బాలనీలో ఓ మూల పెట్టి తప్పించుకుంటూంటాడు. మీను దాన్ని తీసి తన ప్లాస్టిక్ సంచిలో వేసి మూటకట్టేది. | మిట్టూ ఎగ్జిబిషన్ కోసం శాస్త్రవేత్తల పేర్లు వాళ్ళ పరిశోధనల బొమ్మలు పెట్టి, కరెక్ట్ స్విచ్ నొక్కితే, బల్బులు వెలిగేలా బోర్డును తయారుచేసాడు. టీచర్ కి అందరూ తమ అంశాల పేర్లు ఇచ్చారు. మీను పేరు అందులో లేదు. మీను ఏమీ తయారుచేయలేదు కాబోలు అనుకుని మిట్టూ ఎగ్జిబిషన్ రోజు మీను కోసం ఆగకుండా వెళ్ళిపోయాడు. తన క్విజ్ బోర్డ్ చూసి అందరూ ఆశ్చర్యపోతారనుకున్నాడు. ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఒక్కొక్కరి వస్తువులు | చూస్తూ వెళ్ళిన కలెక్టర్ పక్కషెడ్ దగ్గర ఆగి ఫోటోగ్రాఫర్ ని పిలిచి ఫోటో తీయించుకున్నారు. అక్కడంతా ఒకటే హడావుడి, సందడి. ఎవరి ప్లేలో వాళ్ళుండాలి, కదలకూడదని టీచర్ చెప్పడం వలన మిట్టూకి అక్కడికి వెళ్ళడం కుదరలేదు. బ్రేక్ ఇవ్వగానే మిట్టూ షెడ్ కి వెళ్ళి చూసాడు. మీను నెల్లాళ్ళ నుంచి చెత్త వేసినసంచికి అందమైన రంగు కాగితం అంటించి బోర్డు పెట్టింది. ఆ సంచిలోంచి ఆకుపచ్చని తోటకూర, | పాలకూర మొక్కలు ఎంతో అందంగా ఉండి, క్లీన్ అండ్ గ్రీన్ అని రాసిన అట్టముక్క పొద్దు పక్కన, మీను నిలబడి నవ్వుతోంది. ఈసారి కూడా నీదే బెస్ట్ ఎగ్జిబిట్ మీనూ! నువు ఫిజికల్ సైన్సు టీచర్ కి పేరు ఇవ్వక ఏమీ చేయడం లేదనుకున్నారు మిస్. నీ ఎగ్జిబిట్ ని కలెక్టర్ గారు ఎంతో మెచ్చుకున్నారు. ఈ గిఫ్ట్ గా ఈ చెక్ ఇమ్మన్నారు.' అని ప్రిన్సిపాల్ మీనుని అభినందిస్తున్నారు. తన ఎగ్జిలు గర్వపడాలనుకున్న మిట్టూ అది చూసి సిగ్గుపడ్డాడు. మీను మిట్టూతో 'నీ బోర్డుకి రంగురం! బల్బులు పెడితే ఇంకా బావుంటుంది. ఇప్పుడు కూడా బావుందిలే' అంది. థాంక్యూ - కంగ్రాట్స్! అన్నాడు మిట్టూ మనస్ఫూర్తిగా..............© 2017,www.logili.com All Rights Reserved.