న్యాయం అనే కధలో పొట్లపల్లి, వెట్టి చాకిరీ చేసే మాదిగ జీవితం ఎంత దైన్యంగా వుండేదో చాల సహజంగా చిత్రించాడు. ప్రభుత్యోద్యోగి వస్తున్నాడంటే ఊరి ప్రజల దగ్గర నుంచి కోడిని తెచ్చి వండి పెట్టాలి. ఒక్కొక్కసారి, అయన రాకపోతే మద్యస్తులు తినేసేవారు. మళ్ళి తెల్లవారి ఆఫీసరు వస్తున్నాడని మళ్ళీ వంట మొదలు పెట్టడం - ఇట్లా సాగేది ఊరి ప్రజల జీవితం. వాళ్ళ పనులు, వ్యవసాయాలు చేసుకునేందుకు అవకాశమే వుండేది కాదు. ఆఫీసరు ఇంట్లో పెండ్లి అన్నా, దొరల, జమిందారుల ఇండ్లలో పెండ్లి అన్నా ఊరి ప్రజలు అన్ని వస్తువులు సమకూర్చి, తమకు తినేందుకు తిండి లేకున్నా ఇయ్యవలసివచ్చేది. పొట్లపల్లి రామారావు కాంగ్రేసు స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకు పోయాడు. అందుకే జైలు జీవితాన్ని, అమాయకుల మీద నేరాలు మోసే విధానాన్ని జైలు అనే కధలో అద్బుతంగా చిత్రించాడు.
'జైలు' సంపుటంలో వున్న ఎనిమిది కధలు కాక, పొట్లపల్లి రామారావు మీద పరిశోదన చేసిన భూపాల్ కు మరో పద్నాలుగు కధల వరకు దొరికాయి. మొత్తం 22 కధలు ఈ గ్రంధంలో చేర్చబడినాయి.
కధల్లో పొట్లపల్లి రామారావు శైలి చాల సరళంగా, వాడుక భాషకు దగ్గరగా వుంది. కదన శిల్పం బాగుంది. చిన్న కధ లేక 'కధానిక' లో ఇతివృత్తం చిన్నదిగా ఉండాలనే సూత్రాన్ని పొట్లపల్లి అక్షరాలా పాటించాడు. చిన్న కధతోనే తాను చెప్పదలుచుకున్న విషయాన్ని, అనవసరమైన వర్ణనలు, అంశాలు లేకుండా వ్రాసాడు. భాషలో తెలంగాణా యాస, నుడి కారాలున్నాయి. ఒక ఫోటో గ్రాఫరు ఎట్లా ఫోటోలు తీస్తాడో, రచయిత ఆ విధంగా వివిధ దృశ్యాలను ఫోటోలుగా చూపిస్తాడు. ప్రతి దృశ్యాన్ని కమనీయంగా పాటకుల చేత దర్శింప జేస్తాడు.
.... డా.ముదిగంటి సుజాతా రెడ్డి
ఈ సంపుటిలో
* 'జైలు' మరికొన్ని కధలు
* నాటికలు
* నవల
* సైనికుని జాబులు
* గ్రామ చిత్రాలు
న్యాయం అనే కధలో పొట్లపల్లి, వెట్టి చాకిరీ చేసే మాదిగ జీవితం ఎంత దైన్యంగా వుండేదో చాల సహజంగా చిత్రించాడు. ప్రభుత్యోద్యోగి వస్తున్నాడంటే ఊరి ప్రజల దగ్గర నుంచి కోడిని తెచ్చి వండి పెట్టాలి. ఒక్కొక్కసారి, అయన రాకపోతే మద్యస్తులు తినేసేవారు. మళ్ళి తెల్లవారి ఆఫీసరు వస్తున్నాడని మళ్ళీ వంట మొదలు పెట్టడం - ఇట్లా సాగేది ఊరి ప్రజల జీవితం. వాళ్ళ పనులు, వ్యవసాయాలు చేసుకునేందుకు అవకాశమే వుండేది కాదు. ఆఫీసరు ఇంట్లో పెండ్లి అన్నా, దొరల, జమిందారుల ఇండ్లలో పెండ్లి అన్నా ఊరి ప్రజలు అన్ని వస్తువులు సమకూర్చి, తమకు తినేందుకు తిండి లేకున్నా ఇయ్యవలసివచ్చేది. పొట్లపల్లి రామారావు కాంగ్రేసు స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకు పోయాడు. అందుకే జైలు జీవితాన్ని, అమాయకుల మీద నేరాలు మోసే విధానాన్ని జైలు అనే కధలో అద్బుతంగా చిత్రించాడు. 'జైలు' సంపుటంలో వున్న ఎనిమిది కధలు కాక, పొట్లపల్లి రామారావు మీద పరిశోదన చేసిన భూపాల్ కు మరో పద్నాలుగు కధల వరకు దొరికాయి. మొత్తం 22 కధలు ఈ గ్రంధంలో చేర్చబడినాయి. కధల్లో పొట్లపల్లి రామారావు శైలి చాల సరళంగా, వాడుక భాషకు దగ్గరగా వుంది. కదన శిల్పం బాగుంది. చిన్న కధ లేక 'కధానిక' లో ఇతివృత్తం చిన్నదిగా ఉండాలనే సూత్రాన్ని పొట్లపల్లి అక్షరాలా పాటించాడు. చిన్న కధతోనే తాను చెప్పదలుచుకున్న విషయాన్ని, అనవసరమైన వర్ణనలు, అంశాలు లేకుండా వ్రాసాడు. భాషలో తెలంగాణా యాస, నుడి కారాలున్నాయి. ఒక ఫోటో గ్రాఫరు ఎట్లా ఫోటోలు తీస్తాడో, రచయిత ఆ విధంగా వివిధ దృశ్యాలను ఫోటోలుగా చూపిస్తాడు. ప్రతి దృశ్యాన్ని కమనీయంగా పాటకుల చేత దర్శింప జేస్తాడు. .... డా.ముదిగంటి సుజాతా రెడ్డి ఈ సంపుటిలో * 'జైలు' మరికొన్ని కధలు * నాటికలు * నవల * సైనికుని జాబులు * గ్రామ చిత్రాలు
© 2017,www.logili.com All Rights Reserved.