ఈ పుస్తక రచయిత డి.పాపారావు(బి.ఎస్.సి, బి.ఎల్, ఎమ్.బి.ఎ, ఎమ్.ఎ(పొలిటికల్ సైన్సు), ఫై.జి.డి.జె). తొలుత జర్నలిష్టుగానూ, అనంతరం మేనేజ్మెంట్ విభాగంలో ఆచార్యునిగానూ పనిచేసారు.కాగా 1995 -2001 నడుమ సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేసి, తరువాత నుంచీ నేటివరకు ఫ్రీలాన్స్ జర్నలిష్టుగా వున్నారు. ఈయన వామపక్ష దృక్పథంలో మన దేశ ఆర్ధికవ్యవస్థను విశ్లేషిస్తూ రాసిన వ్యాసాల సమాహారమే ఈ చిన్న పుస్తకం.
ఈ పుస్తకంలో అనేక ఆర్ధిక అంశాలు, సమస్యలు, వాటి మూలాలను గురించి విశ్లేషించడం జరిగింది. ఆర్ధిక అంశాలతోపాటు రాజకీయ, సామజిక అంశాలను కూడా ప్రతి వ్యాసంలోను అంతర్లీనంగా పొందుపరచారు. ప్రతి వ్యాసం కూడా సమకాలీన సమాజంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. రచయిత విశ్లేషించిన కొన్ని అంశాలు ప్రత్యేకంగా పేర్కొనదగ్గవి ఏవంటే : దేశ దేశాల ప్రజల్ని పీడనకు , దోపిడీకి గురిచేస్తున ప్రపంచీకరణ, రూపాయి మారకవిలువ పెరుగుదల వచ్చే లాభనష్టాలు, స్వేచ్చా మార్కెట్, రక్షిత ఆర్ధిక విధానాలు, పారిశ్రామిక దేశాల ద్వంధ్వనీతి, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, సంక్షోభం-ఉద్దీపన ప్యాకేజీలు, సగటు మనిషి జీవితాలతో ఆడుకుంటున్న ఇంధన విధానాలు, రిటైల్ మార్కెట్లో విదేశీ పెట్టుబడులు; పేదరిక నిర్మూలన, మైక్రో ఫైనాన్స్, నల్లధనం, ఆర్ధికరంగాన్ని ఆదుకోవాల్సిన వ్యవసాయ రంగం మొదలైనవి.
ఈ పుస్తక రచయిత డి.పాపారావు(బి.ఎస్.సి, బి.ఎల్, ఎమ్.బి.ఎ, ఎమ్.ఎ(పొలిటికల్ సైన్సు), ఫై.జి.డి.జె). తొలుత జర్నలిష్టుగానూ, అనంతరం మేనేజ్మెంట్ విభాగంలో ఆచార్యునిగానూ పనిచేసారు.కాగా 1995 -2001 నడుమ సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేసి, తరువాత నుంచీ నేటివరకు ఫ్రీలాన్స్ జర్నలిష్టుగా వున్నారు. ఈయన వామపక్ష దృక్పథంలో మన దేశ ఆర్ధికవ్యవస్థను విశ్లేషిస్తూ రాసిన వ్యాసాల సమాహారమే ఈ చిన్న పుస్తకం. ఈ పుస్తకంలో అనేక ఆర్ధిక అంశాలు, సమస్యలు, వాటి మూలాలను గురించి విశ్లేషించడం జరిగింది. ఆర్ధిక అంశాలతోపాటు రాజకీయ, సామజిక అంశాలను కూడా ప్రతి వ్యాసంలోను అంతర్లీనంగా పొందుపరచారు. ప్రతి వ్యాసం కూడా సమకాలీన సమాజంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. రచయిత విశ్లేషించిన కొన్ని అంశాలు ప్రత్యేకంగా పేర్కొనదగ్గవి ఏవంటే : దేశ దేశాల ప్రజల్ని పీడనకు , దోపిడీకి గురిచేస్తున ప్రపంచీకరణ, రూపాయి మారకవిలువ పెరుగుదల వచ్చే లాభనష్టాలు, స్వేచ్చా మార్కెట్, రక్షిత ఆర్ధిక విధానాలు, పారిశ్రామిక దేశాల ద్వంధ్వనీతి, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, సంక్షోభం-ఉద్దీపన ప్యాకేజీలు, సగటు మనిషి జీవితాలతో ఆడుకుంటున్న ఇంధన విధానాలు, రిటైల్ మార్కెట్లో విదేశీ పెట్టుబడులు; పేదరిక నిర్మూలన, మైక్రో ఫైనాన్స్, నల్లధనం, ఆర్ధికరంగాన్ని ఆదుకోవాల్సిన వ్యవసాయ రంగం మొదలైనవి.© 2017,www.logili.com All Rights Reserved.