"శ్రీపాదవారి కధలు విని వుండకపొతే తెలుగుల వునికి అయోమయం. చదువరులకు చదువు చెప్పగలిగినది ఆయన రచన. తీయందనపు తీయందనము చవులిచ్చినదాయన శైలి. ఆయన రచనలు మరో భాషకు లొంగవు. జాను తెనుగు నేర్చినవారికే, తెలుగు వారైన వారికే శ్రీ శాస్త్రిగారి కధలు చదివి ఆనందించే అదృష్టం."
- మల్లాది రామకృష్ణ శాస్త్రి.
"అచ్చమైన వ్యావహారికాంద్రం వ్రాసిన వారిలో ప్రధమ గణ్యులు శ్రీపాద వారు"
- పిలకా గణపతి శాస్త్రి.
"సర్వదా తమరీనాటి యాంధ్ర వ్యావహారిక భాషా నిర్మాత్రుగణ ప్రధమ గణనీయులు"
- విశ్వనాధ సత్యనారాయణ.
"ఫ్యూడల్ సంస్కృతి నుంచి వచ్చిన శాస్త్రిగారు, ఆ సంస్కృతి పాత్రల చేత ఫ్యూడల్ సంస్కృతి భాషను మాట్లాడించినట్లు మరెవరూ మాట్లాడించలేరు."
- కొడవటిగంటి కుటుంబరావు.
"శ్రీపాదవారు యదార్ధముగా ఆయన చూపులకు కనిపించిన వస్తువు, ఆయన చెవులకు వినిపించిన మాటలు మాటగట్టుకొని కధలలో బెట్టి కళ కట్టించును."
- మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి.
"భాషా విషయకంగా ఎంత వ్యవహార వాదియో, భావవిషయంలో అంత తెలుగువాడు - సుబ్రహ్మణ్యశాస్త్రి. ఏ సహ్రుదయున్నైనా తెలుగు బాషలో తెలుగు కధ రాసిన ఖ్యాతి ఎవరికీ దక్కుతుందని అడిగితే నిర్మొహమాటంగా 'వడ్లగింజలు' రాసిన సుబ్రహ్మణ్యశాస్త్రి గారిదే ఆ ఖ్యాతి అని చెప్పి తీరుతారు."
- ఉషశ్రీ.
వీరు తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురం తాలూకా పొలమూరులో జన్మించారు. వేదం, జ్యోతిషం, ధర్మశాస్త్రాలను అభ్యసించారు.
శ్రీపాదవారు తమ కధలను వారు చిన్న కధలని పిలిచినా అవన్నీ ఓరకంగా నవలికలనే అనవచ్చు. వస్తువు రీత్యా ప్రణయం, సంఘసంస్కారం, ప్రబోధం, కుటుంబ జీవితం, అపరాధ పరిశోధనం, భాషా వివాదాత్మకం, చరిత్రాత్మకం, అవహేళనాత్మకం అంటూ స్థూలంగా విభజించుకోవచ్చు. శ్రీపాదవారు ఇవే కాక పద్యరచనలు, నాటకాలు, రూపికలు, రేడియో నాటికలు, నవలలు, అనేక వచన - రచనలు, అనువాదాలు, వైద్యగ్రంధాలు కూడా రాశారు.
వీరు వాచస్పతి, తార్కికుడు, వసంతుడు, కుమార కవి సింహుడు, భటాచార్యుడు, కౌశికుడు అనే మారు పేర్లతో శతాధిక వ్యాసాలు రాశారు. 'ప్రబుద్దాంద్ర పత్రిక'ను చాలాకాలం నిర్వహించారు.
వ్యావహారిక భాషావాదిగా గిడుగు ఉద్యమానికి అండదండలందించారు. గాంధీ - ఖద్దరు - హిందీ ఈ మూడింటిని వ్యతిరేకించిన వ్యక్తీ.
తెలుగు కధకులలో కనకాభిషేక గౌరవం (1956)లో అందుకున్న ప్రధములు.
"శ్రీపాదవారి కధలు విని వుండకపొతే తెలుగుల వునికి అయోమయం. చదువరులకు చదువు చెప్పగలిగినది ఆయన రచన. తీయందనపు తీయందనము చవులిచ్చినదాయన శైలి. ఆయన రచనలు మరో భాషకు లొంగవు. జాను తెనుగు నేర్చినవారికే, తెలుగు వారైన వారికే శ్రీ శాస్త్రిగారి కధలు చదివి ఆనందించే అదృష్టం." - మల్లాది రామకృష్ణ శాస్త్రి. "అచ్చమైన వ్యావహారికాంద్రం వ్రాసిన వారిలో ప్రధమ గణ్యులు శ్రీపాద వారు" - పిలకా గణపతి శాస్త్రి. "సర్వదా తమరీనాటి యాంధ్ర వ్యావహారిక భాషా నిర్మాత్రుగణ ప్రధమ గణనీయులు" - విశ్వనాధ సత్యనారాయణ. "ఫ్యూడల్ సంస్కృతి నుంచి వచ్చిన శాస్త్రిగారు, ఆ సంస్కృతి పాత్రల చేత ఫ్యూడల్ సంస్కృతి భాషను మాట్లాడించినట్లు మరెవరూ మాట్లాడించలేరు." - కొడవటిగంటి కుటుంబరావు. "శ్రీపాదవారు యదార్ధముగా ఆయన చూపులకు కనిపించిన వస్తువు, ఆయన చెవులకు వినిపించిన మాటలు మాటగట్టుకొని కధలలో బెట్టి కళ కట్టించును." - మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి. "భాషా విషయకంగా ఎంత వ్యవహార వాదియో, భావవిషయంలో అంత తెలుగువాడు - సుబ్రహ్మణ్యశాస్త్రి. ఏ సహ్రుదయున్నైనా తెలుగు బాషలో తెలుగు కధ రాసిన ఖ్యాతి ఎవరికీ దక్కుతుందని అడిగితే నిర్మొహమాటంగా 'వడ్లగింజలు' రాసిన సుబ్రహ్మణ్యశాస్త్రి గారిదే ఆ ఖ్యాతి అని చెప్పి తీరుతారు." - ఉషశ్రీ. వీరు తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురం తాలూకా పొలమూరులో జన్మించారు. వేదం, జ్యోతిషం, ధర్మశాస్త్రాలను అభ్యసించారు. శ్రీపాదవారు తమ కధలను వారు చిన్న కధలని పిలిచినా అవన్నీ ఓరకంగా నవలికలనే అనవచ్చు. వస్తువు రీత్యా ప్రణయం, సంఘసంస్కారం, ప్రబోధం, కుటుంబ జీవితం, అపరాధ పరిశోధనం, భాషా వివాదాత్మకం, చరిత్రాత్మకం, అవహేళనాత్మకం అంటూ స్థూలంగా విభజించుకోవచ్చు. శ్రీపాదవారు ఇవే కాక పద్యరచనలు, నాటకాలు, రూపికలు, రేడియో నాటికలు, నవలలు, అనేక వచన - రచనలు, అనువాదాలు, వైద్యగ్రంధాలు కూడా రాశారు. వీరు వాచస్పతి, తార్కికుడు, వసంతుడు, కుమార కవి సింహుడు, భటాచార్యుడు, కౌశికుడు అనే మారు పేర్లతో శతాధిక వ్యాసాలు రాశారు. 'ప్రబుద్దాంద్ర పత్రిక'ను చాలాకాలం నిర్వహించారు. వ్యావహారిక భాషావాదిగా గిడుగు ఉద్యమానికి అండదండలందించారు. గాంధీ - ఖద్దరు - హిందీ ఈ మూడింటిని వ్యతిరేకించిన వ్యక్తీ. తెలుగు కధకులలో కనకాభిషేక గౌరవం (1956)లో అందుకున్న ప్రధములు.© 2017,www.logili.com All Rights Reserved.