ఆకాశవాణితో నా అనుబంధానికి యాభై ఏళ్ళు - స్వర్ణోత్సవ సంవత్సరం.
అది 1964. నేను బి.ఏ. రెండో సంవత్సరం విద్యార్థిని.
విజయవాడ కేంద్రం సరస వినోదిని - సమస్యాపూరణ కార్యక్రమాన్ని నేనొక రాత్రి విన్నాను. ఆ సమస్యను మా గురువుగారు పిశుపాటి విశ్వేశ్వర శాస్త్రి గారితో చర్చించాను. సమస్య - "శ్రీ లక్ష్మీమాధవ సింహవాహనాలవాల్లభ్యంబు సంభావ్యమౌ!" దానిని పూరించి పంపాను. నా పేరు రేడియోలో తొలిసారిగా వినిపించింది. అప్పుడు నాకు 17 ఏళ్ళు. అది మొదలు పది సంవత్సరాలు వరసగా సమస్యాపూరణలు పంపాను.
"నది" మాస పత్రికాధిపతి జలదంకి ప్రభాకర్ తో ఓ రోజు ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు నేను వారి పత్రికకు ధారావాహిక వ్యాసాలు వ్రాస్తే బాగుండుననే సూచన చేశారు. అది "అలనాటి ఆకాశవాణి" రూపంలో దాదాపు ఒకటిన్నర సంవత్సరం 2013 ఏప్రిల్ తో మొదలై ప్రచురింపబడింది. పాఠకులు, నా సన్నిహిత మిత్రులు, కొందరు రేడియో అధికారులు అందులో విషయాలు చాలామందికి తెలియవనీ, వాటిని గ్రంథస్థంచేస్తే భావితరాలకు ఉపయోగపడుతుందనీ, చారిత్రక దృష్టితో ఆలోచిస్తే దిశానిర్దేశం చేసినట్లు౦టు౦దనీ సూచించారు. 1975 - 2005 మధ్యకాలంలో దేశంలోనూ, రాష్ట్రంలోనూ, ఆకాశవాణిలోనూ జరిగిన చారిత్రాత్మక సంఘటనలకు నేను ప్రత్యక్ష సాక్షిని. వాటిని పరిశోధకులకు సంఘటనలుగా అందించవలసిన బాధ్యత నా మీద ఉంది. ఈ ఉద్దేశంతోనే ఈ వ్యాసపరంపర.
- డా. ఆర్.అనంతపద్మనాభరావు
ఆకాశవాణితో నా అనుబంధానికి యాభై ఏళ్ళు - స్వర్ణోత్సవ సంవత్సరం. అది 1964. నేను బి.ఏ. రెండో సంవత్సరం విద్యార్థిని. విజయవాడ కేంద్రం సరస వినోదిని - సమస్యాపూరణ కార్యక్రమాన్ని నేనొక రాత్రి విన్నాను. ఆ సమస్యను మా గురువుగారు పిశుపాటి విశ్వేశ్వర శాస్త్రి గారితో చర్చించాను. సమస్య - "శ్రీ లక్ష్మీమాధవ సింహవాహనాలవాల్లభ్యంబు సంభావ్యమౌ!" దానిని పూరించి పంపాను. నా పేరు రేడియోలో తొలిసారిగా వినిపించింది. అప్పుడు నాకు 17 ఏళ్ళు. అది మొదలు పది సంవత్సరాలు వరసగా సమస్యాపూరణలు పంపాను. "నది" మాస పత్రికాధిపతి జలదంకి ప్రభాకర్ తో ఓ రోజు ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు నేను వారి పత్రికకు ధారావాహిక వ్యాసాలు వ్రాస్తే బాగుండుననే సూచన చేశారు. అది "అలనాటి ఆకాశవాణి" రూపంలో దాదాపు ఒకటిన్నర సంవత్సరం 2013 ఏప్రిల్ తో మొదలై ప్రచురింపబడింది. పాఠకులు, నా సన్నిహిత మిత్రులు, కొందరు రేడియో అధికారులు అందులో విషయాలు చాలామందికి తెలియవనీ, వాటిని గ్రంథస్థంచేస్తే భావితరాలకు ఉపయోగపడుతుందనీ, చారిత్రక దృష్టితో ఆలోచిస్తే దిశానిర్దేశం చేసినట్లు౦టు౦దనీ సూచించారు. 1975 - 2005 మధ్యకాలంలో దేశంలోనూ, రాష్ట్రంలోనూ, ఆకాశవాణిలోనూ జరిగిన చారిత్రాత్మక సంఘటనలకు నేను ప్రత్యక్ష సాక్షిని. వాటిని పరిశోధకులకు సంఘటనలుగా అందించవలసిన బాధ్యత నా మీద ఉంది. ఈ ఉద్దేశంతోనే ఈ వ్యాసపరంపర. - డా. ఆర్.అనంతపద్మనాభరావు
© 2017,www.logili.com All Rights Reserved.