ప్రస్తుతం వ్యవహరిస్తున్న 'కాకినాడ' పేరు వెనుక నాలుగైదు పేర్లు కాలక్రమంలో రూపాంతరం చెందాయన్న విషయం ఇప్పటివారికి ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇతిహాస గాధ ప్రకారం త్రేతాయుగంలో కాకాసురుడు సీతాదేవిని వేధిస్తుండగా శ్రీరాముడు అస్త్రాన్ని సంధించినప్పుడు రాక్షసుడి కన్ను పోయింది. కాకాసురుడి స్థావరం 'కాకనందివాడ'గా పిలవబడేది. ఇక్ష్వాకు రాజు 'కాక' ఈ పట్టణాన్ని నిర్మించినందువల్ల ఈ పేరు సంక్రమించిందన్నది మరొక కధనం. ఇంకో కధనం ప్రకారం ఈ ప్రాంతంలో కాకులు బహుళ సంఖ్యలో ఉండడం వల్ల కోకనాడముగాను, వాయస (కాకి)పురి గాను, కాకులవాడగాను వ్యవహరించేవారు. మరో కధనం ప్రకారం యూరోపియన్లు రాక మునుపు 'నందులు' రాజ్యమేలేవారు. అందువల్ల 'కాకినందివాడ'గా పిలిచేవారు. అలాగే ఇక్కడి నుంచి కోక (చీర)లు విదేశాలకు ఎగుమతి చేస్తున్నందువల్ల 'కోక నాడు' పేరు వచ్చిందని మరికొందరి అభిప్రాయం. క్రీ.పూ. 260 వరకు ఈ ప్రాంతాన్ని శాతవాహన
రాజులు పాలించేవారు. ఆ తర్వాత అశోక చక్రవర్తి అధీనంలోకి వెళ్ళింది. తదుపరి కాలంలో పల్లవులు, చాళుక్యులు, చోళులు, కోరుకొండ రెడ్లు, కొండవీటి గజపతిరాజులు పరిపాలించారు. కాలక్రమంలో రాజ్యాధికారం అనేకమంది చేజిక్కించుకున్న తర్వాత 1687లో ఔరంగజేబు, 1724లో నిజాం పాలనలో జమిందారీ వ్యవస్థ అమలులోకి వచ్చింది. పిఠాపురం రాజావారికి ఈ సంస్థానాన్ని నిజాం నవాబు అప్పగించారు. కాకినాడ సహా పరిసర ప్రాంతాలన్నీ రాజావారి పాలనలో ఉండేవి.....................
ప్రస్తుతం వ్యవహరిస్తున్న 'కాకినాడ' పేరు వెనుక నాలుగైదు పేర్లు కాలక్రమంలో రూపాంతరం చెందాయన్న విషయం ఇప్పటివారికి ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇతిహాస గాధ ప్రకారం త్రేతాయుగంలో కాకాసురుడు సీతాదేవిని వేధిస్తుండగా శ్రీరాముడు అస్త్రాన్ని సంధించినప్పుడు రాక్షసుడి కన్ను పోయింది. కాకాసురుడి స్థావరం 'కాకనందివాడ'గా పిలవబడేది. ఇక్ష్వాకు రాజు 'కాక' ఈ పట్టణాన్ని నిర్మించినందువల్ల ఈ పేరు సంక్రమించిందన్నది మరొక కధనం. ఇంకో కధనం ప్రకారం ఈ ప్రాంతంలో కాకులు బహుళ సంఖ్యలో ఉండడం వల్ల కోకనాడముగాను, వాయస (కాకి)పురి గాను, కాకులవాడగాను వ్యవహరించేవారు. మరో కధనం ప్రకారం యూరోపియన్లు రాక మునుపు 'నందులు' రాజ్యమేలేవారు. అందువల్ల 'కాకినందివాడ'గా పిలిచేవారు. అలాగే ఇక్కడి నుంచి కోక (చీర)లు విదేశాలకు ఎగుమతి చేస్తున్నందువల్ల 'కోక నాడు' పేరు వచ్చిందని మరికొందరి అభిప్రాయం. క్రీ.పూ. 260 వరకు ఈ ప్రాంతాన్ని శాతవాహన రాజులు పాలించేవారు. ఆ తర్వాత అశోక చక్రవర్తి అధీనంలోకి వెళ్ళింది. తదుపరి కాలంలో పల్లవులు, చాళుక్యులు, చోళులు, కోరుకొండ రెడ్లు, కొండవీటి గజపతిరాజులు పరిపాలించారు. కాలక్రమంలో రాజ్యాధికారం అనేకమంది చేజిక్కించుకున్న తర్వాత 1687లో ఔరంగజేబు, 1724లో నిజాం పాలనలో జమిందారీ వ్యవస్థ అమలులోకి వచ్చింది. పిఠాపురం రాజావారికి ఈ సంస్థానాన్ని నిజాం నవాబు అప్పగించారు. కాకినాడ సహా పరిసర ప్రాంతాలన్నీ రాజావారి పాలనలో ఉండేవి.....................© 2017,www.logili.com All Rights Reserved.