Anubhandalu

By R R Sudarshanam (Author)
Rs.200
Rs.200

Anubhandalu
INR
MANIMN4123
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

అనుబంధాలు

బసవన్న కొండ మెట్లెక్కుతూ ఉన్న వేదమూర్తికి బాల్యం నుండి గత జీవితమంతా తెరలు తెరలుగా స్ఫురణకు వచ్చింది. కన్నులకు కట్టినట్లవుతూన్న కొన్ని జ్ఞాపకాలతో, తాను మళ్లీ ఆ క్షణాల్లో జీవిస్తూ ఉన్నట్లే కలిగిన హృదయావేగంతో, వెంటవస్తున్న రామయ్యనుకూడా మరచిపొయ్యాడు.

బస్సులో ఆ ఊరివైపు ప్రయాణంచేసేవాళ్లకు అయిదారు మైళ్ల దూరంనుండే, ఒక పెద్దకొండ నందీశ్వర రూపంలో సాక్షాత్కరిస్తుంది. అదే బసవన్నకొండ. శివాలయంలో కనుపించే బసవయ్య రూపంలో ఉండటంవల్ల పోలికనుబట్టి కొండకూ, కొండప్రక్కనున్న గ్రామానికీ ఆ పేరు వచ్చింది. ఆ బసవయ్య మూపురము మీదే వెలసి ఉంది పూర్వమెప్పుడో నిర్మింపబడిన మల్లికార్జునుని దేవాలయం. గ్రామస్థులు ఆ దేవాలయాన్ని శ్రద్దతో రక్షిస్తూ వచ్చారు. శివరాత్రికి ఏటేటా పెద్ద ఉత్సవం జరుగుతుంది. గ్రామంలోని వారందరూ, స్త్రీలు, పిల్లలు కూడా ఆ సమయంలో తప్పకుండా కొండ పైకెక్కి వెళ్లుతారు. ఎక్కవలసిన దూరం సుమారు రెండు మైళ్లుంటుంది...

"ఏటేటా వందరూపాయలిచ్చే ఈశ్వరరెడ్డి ఈసారి జరిగిన ఉత్సవానికి యాభై మాత్రమే ఇచ్చేడు. కారణం తను కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆ పార్టీకి విరాళమిచ్చేడు. అందుకని” అన్నాడు రామయ్య, గ్రామంలో విషయాలేవో చెప్పుతూ.

వేదమూర్తి పరధ్యానంలో వినిపించుకోలేదు. రామయ్య కూడా మరి తర్వాత మాట్లాడ లేదు.............

అనుబంధాలు బసవన్న కొండ మెట్లెక్కుతూ ఉన్న వేదమూర్తికి బాల్యం నుండి గత జీవితమంతా తెరలు తెరలుగా స్ఫురణకు వచ్చింది. కన్నులకు కట్టినట్లవుతూన్న కొన్ని జ్ఞాపకాలతో, తాను మళ్లీ ఆ క్షణాల్లో జీవిస్తూ ఉన్నట్లే కలిగిన హృదయావేగంతో, వెంటవస్తున్న రామయ్యనుకూడా మరచిపొయ్యాడు. బస్సులో ఆ ఊరివైపు ప్రయాణంచేసేవాళ్లకు అయిదారు మైళ్ల దూరంనుండే, ఒక పెద్దకొండ నందీశ్వర రూపంలో సాక్షాత్కరిస్తుంది. అదే బసవన్నకొండ. శివాలయంలో కనుపించే బసవయ్య రూపంలో ఉండటంవల్ల పోలికనుబట్టి కొండకూ, కొండప్రక్కనున్న గ్రామానికీ ఆ పేరు వచ్చింది. ఆ బసవయ్య మూపురము మీదే వెలసి ఉంది పూర్వమెప్పుడో నిర్మింపబడిన మల్లికార్జునుని దేవాలయం. గ్రామస్థులు ఆ దేవాలయాన్ని శ్రద్దతో రక్షిస్తూ వచ్చారు. శివరాత్రికి ఏటేటా పెద్ద ఉత్సవం జరుగుతుంది. గ్రామంలోని వారందరూ, స్త్రీలు, పిల్లలు కూడా ఆ సమయంలో తప్పకుండా కొండ పైకెక్కి వెళ్లుతారు. ఎక్కవలసిన దూరం సుమారు రెండు మైళ్లుంటుంది... "ఏటేటా వందరూపాయలిచ్చే ఈశ్వరరెడ్డి ఈసారి జరిగిన ఉత్సవానికి యాభై మాత్రమే ఇచ్చేడు. కారణం తను కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆ పార్టీకి విరాళమిచ్చేడు. అందుకని” అన్నాడు రామయ్య, గ్రామంలో విషయాలేవో చెప్పుతూ. వేదమూర్తి పరధ్యానంలో వినిపించుకోలేదు. రామయ్య కూడా మరి తర్వాత మాట్లాడ లేదు.............

Features

  • : Anubhandalu
  • : R R Sudarshanam
  • : Rata Konda Prachuranalu
  • : MANIMN4123
  • : paparback
  • : Dec, 2022
  • : 199
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Anubhandalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam