రామాయణాన్ని ఒక కావ్యంగాను మత గ్రంధంగాను కాకుండా సామాజిక దృష్టితో పరిశీలిస్తే ఎన్నెన్నో కొత్త అంశాలు ప్రకటితమవుతూ ఉంటాయి. రాముని కధలో అనేక కధలున్నాయి.మునుల కథలు, అసురుల కథలు - శాపాల కథలు - వీటితోబాటు శాస్త్ర చర్చలు - ధర్మాధర్మ నిరూపణ యత్నాలు చాలా కనిపిస్తాయి. మునుల కథల ఆధారంగా అప్పటి వర్ణధర్మాన్ని విద్యావ్యవస్థను పరిశీలించటం ఈ గ్రంథం లక్ష్యం. ఈ కోణంలో పరిశీలనకు మతంగ, విశ్వామిత్ర, శంబూకుల కథలు ప్రధానంగా గ్రహించటం జరిగింది.
రామాయణకాలంలో ప్రజలకూ మునులకూ మధ్య ఉన్న ధార్మిక సంబంధాల గురించి యోగాభ్యాస నిరతి గురించీ ప్రస్తావిస్తున్న ఈ పుస్తకం కొన్ని కొత్త కోణాలను కూడా ఆవిష్కరిస్తున్నది.
శ్రమ విలువను ఎంతో గొప్పగా విశ్లేషించిన మార్క్స్ మహాశయుని కంటే శతాబ్దాల ముందరే "శ్రమ నుండి ఎదిగినది నశించదు" అంటూ, రాక్షసుడుగా చెప్పబడుతున్న కబంధుడు, రామునికి చెప్పాడనటం మతంగ సంస్కృతిని గురించి ఆలోచనలను రేకెత్తిస్తుంది.
రామాయణాన్ని ఒక కావ్యంగాను మత గ్రంధంగాను కాకుండా సామాజిక దృష్టితో పరిశీలిస్తే ఎన్నెన్నో కొత్త అంశాలు ప్రకటితమవుతూ ఉంటాయి. రాముని కధలో అనేక కధలున్నాయి.మునుల కథలు, అసురుల కథలు - శాపాల కథలు - వీటితోబాటు శాస్త్ర చర్చలు - ధర్మాధర్మ నిరూపణ యత్నాలు చాలా కనిపిస్తాయి. మునుల కథల ఆధారంగా అప్పటి వర్ణధర్మాన్ని విద్యావ్యవస్థను పరిశీలించటం ఈ గ్రంథం లక్ష్యం. ఈ కోణంలో పరిశీలనకు మతంగ, విశ్వామిత్ర, శంబూకుల కథలు ప్రధానంగా గ్రహించటం జరిగింది. రామాయణకాలంలో ప్రజలకూ మునులకూ మధ్య ఉన్న ధార్మిక సంబంధాల గురించి యోగాభ్యాస నిరతి గురించీ ప్రస్తావిస్తున్న ఈ పుస్తకం కొన్ని కొత్త కోణాలను కూడా ఆవిష్కరిస్తున్నది. శ్రమ విలువను ఎంతో గొప్పగా విశ్లేషించిన మార్క్స్ మహాశయుని కంటే శతాబ్దాల ముందరే "శ్రమ నుండి ఎదిగినది నశించదు" అంటూ, రాక్షసుడుగా చెప్పబడుతున్న కబంధుడు, రామునికి చెప్పాడనటం మతంగ సంస్కృతిని గురించి ఆలోచనలను రేకెత్తిస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.