Title | Price | |
Ramayana Viseshamulu | Rs.200 | In Stock |
'వాల్మీకే ర్మునిసింహ్య కవితావనచారిణః
శ్రుణ్వన్ రామకథానాదం కో నయాతి పరాంగతిమ్?”
శ్రీ మద్రామాయణ మహాకావ్యమును గురించి నావంటివాడు వ్రాయుట మహా సాహసమే! ఎందరో ప్రాచ్యపాశ్చాత్య పండితులు వాల్మీకి రచిత రామాయణ మహా కావ్యమును గురించి విపులముగా చర్చించియున్నారు. హిందువులందరికిని శ్రీమద్రా మాయణముపై నుండునంతటి భక్తి ప్రేమాదరములు ప్రపంచములోని మరే గ్రంథముపైనను లేవు. వాల్మీకి రచితమగు గ్రంథము ఆది కావ్యము. రాముడన్ననో, సాక్షాద్వివతార పురుషుడుగా హిందువులచే పూజింపబడునట్టి దేవుడు. హిందూ పండితులు నేటివరకును రామాయణములో అవతార తత్త్వమును, ఆధ్యాత్మిక విషయమును విశేషముగా చర్చించిరి. కాని యితరాంశములు కూడ తెలుసుకొనదగినవై యున్నవి.
రామాయణమును గురించి యాధ్యాత్మికపరముగాను, చారిత్రికముగాను రెండు విధములగు విమర్శన పద్దతులు కనబడుచున్నవి. ఆధ్యాత్మికముగా పరిశీలించు మొదటి వర్గము వారికి రాముడు అవతార పురుషుడు, పురుషోత్తముడు. అతనిలో ఏ లోపమును లేదు. అతడు సాక్షాద్విష్టు భగవానుడే. సీతాదేవి అపరలక్ష్మీదేవియే. రాముని బంటు అయిన హనుమంతుడును దేవుడే. అతనినెందరో కులదైవతముగా పూజించుచున్నారు. రామాయణము భక్తి ప్రధానగ్రంథము. అందు వేదాంత రహస్యములున్నవని పండితులు పెద్ద పెద్ద వ్యాఖ్యలు వ్రాసినారు. ఇట్టి భావపరంపరలచే హిందువులు, అందు ముఖ్యముగా వైష్ణవులు, శ్రీమద్రామాయణమును పూజించువారైయున్నారు. రెండవ వర్గమువారు శ్రీరామ చంద్రుని ఆదర్శ మహాపురుషునిగా స్వీకరించుచున్నారు. కేవలము చారిత్రిక దృష్టితోనే విమర్శించుచున్నారు. ఈ దృష్టితో చూచువారు ఒక్కొక్కప్పుడు ఆస్తినాస్తి విచికిత్సలో తటపటాయించుచున్నారు. యథార్థముగా శ్రీరాముడు చారిత్రిక పురుషుడేనాయని సంవయించుచున్నారు. రామాయణమును ఒక ఆదర్శనీతిదాయకమగు కథగా కల్పించి.................
రామాయణము ఇలియడ్ పురాణము 'వాల్మీకే ర్మునిసింహ్య కవితావనచారిణః శ్రుణ్వన్ రామకథానాదం కో నయాతి పరాంగతిమ్?” శ్రీ మద్రామాయణ మహాకావ్యమును గురించి నావంటివాడు వ్రాయుట మహా సాహసమే! ఎందరో ప్రాచ్యపాశ్చాత్య పండితులు వాల్మీకి రచిత రామాయణ మహా కావ్యమును గురించి విపులముగా చర్చించియున్నారు. హిందువులందరికిని శ్రీమద్రా మాయణముపై నుండునంతటి భక్తి ప్రేమాదరములు ప్రపంచములోని మరే గ్రంథముపైనను లేవు. వాల్మీకి రచితమగు గ్రంథము ఆది కావ్యము. రాముడన్ననో, సాక్షాద్వివతార పురుషుడుగా హిందువులచే పూజింపబడునట్టి దేవుడు. హిందూ పండితులు నేటివరకును రామాయణములో అవతార తత్త్వమును, ఆధ్యాత్మిక విషయమును విశేషముగా చర్చించిరి. కాని యితరాంశములు కూడ తెలుసుకొనదగినవై యున్నవి. రామాయణమును గురించి యాధ్యాత్మికపరముగాను, చారిత్రికముగాను రెండు విధములగు విమర్శన పద్దతులు కనబడుచున్నవి. ఆధ్యాత్మికముగా పరిశీలించు మొదటి వర్గము వారికి రాముడు అవతార పురుషుడు, పురుషోత్తముడు. అతనిలో ఏ లోపమును లేదు. అతడు సాక్షాద్విష్టు భగవానుడే. సీతాదేవి అపరలక్ష్మీదేవియే. రాముని బంటు అయిన హనుమంతుడును దేవుడే. అతనినెందరో కులదైవతముగా పూజించుచున్నారు. రామాయణము భక్తి ప్రధానగ్రంథము. అందు వేదాంత రహస్యములున్నవని పండితులు పెద్ద పెద్ద వ్యాఖ్యలు వ్రాసినారు. ఇట్టి భావపరంపరలచే హిందువులు, అందు ముఖ్యముగా వైష్ణవులు, శ్రీమద్రామాయణమును పూజించువారైయున్నారు. రెండవ వర్గమువారు శ్రీరామ చంద్రుని ఆదర్శ మహాపురుషునిగా స్వీకరించుచున్నారు. కేవలము చారిత్రిక దృష్టితోనే విమర్శించుచున్నారు. ఈ దృష్టితో చూచువారు ఒక్కొక్కప్పుడు ఆస్తినాస్తి విచికిత్సలో తటపటాయించుచున్నారు. యథార్థముగా శ్రీరాముడు చారిత్రిక పురుషుడేనాయని సంవయించుచున్నారు. రామాయణమును ఒక ఆదర్శనీతిదాయకమగు కథగా కల్పించి.................© 2017,www.logili.com All Rights Reserved.