రాముడుండాడు రాజ్జిముండాది
కేశవరెడ్డి గారు ఈ నవలలో ఇంత విశాల దేశంలో పనేక్కడైనా దొరకకపోతుందా అని గ్రామాలనుంచి వలసపోతున్న కుల వృత్తులవారి జీవితాలు,మనోప్రవృత్తులు చిత్రించారు. చిత్తూరు ప్రాంతంలో వలసపోయే ప్రజలు ‘రాముడుండాడు రాజ్జిముండాది’ అనే భరోసాతో యలబారిన వైనాన్ని చిత్రించారు.
‘రాముడుండాడు రాజ్జిముండాది’ అని వలసల విషయంలో ప్రజలకేర్పడిన భారోసలోనే ఈ పరిణామం లోని రహస్యం ఇమిదిఉన్నది. దేశం గోద్దుబోయిందా, ఇంత సువిశాల దేశం ఇది –బతకకపోతామా అని బయల్దేరలేదు వారలు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి యంత్రాలు, మార్కెట్ వచ్చాక రాజ్యం (ప్రజల దృష్టిలో ప్రభుత్వానికి పర్యాయపదం) జీవనోపాధి కలిగిస్తుందనే ఒక ఎండమావి ఏర్పడింది. పుట్టిచినవాడు రాతి కింద కప్పకు కూడ బతుకు దెరువు చూపకపోడనే విశ్వాసం మత శాస్త్రాలన్నీ ఉగ్గుపాలతో రంగరించి పోసినదే. కనక రాముడూ రాజ్జీవూ కలసి పోయాయి. బ్రాహ్మణీయ హిందూ మత విశ్వాసం కలిగించిన మాయకు మార్కెట్ మాయతోడైంది.
రాముడుండాడు రాజ్జిముండాది కేశవరెడ్డి గారు ఈ నవలలో ఇంత విశాల దేశంలో పనేక్కడైనా దొరకకపోతుందా అని గ్రామాలనుంచి వలసపోతున్న కుల వృత్తులవారి జీవితాలు,మనోప్రవృత్తులు చిత్రించారు. చిత్తూరు ప్రాంతంలో వలసపోయే ప్రజలు ‘రాముడుండాడు రాజ్జిముండాది’ అనే భరోసాతో యలబారిన వైనాన్ని చిత్రించారు. ‘రాముడుండాడు రాజ్జిముండాది’ అని వలసల విషయంలో ప్రజలకేర్పడిన భారోసలోనే ఈ పరిణామం లోని రహస్యం ఇమిదిఉన్నది. దేశం గోద్దుబోయిందా, ఇంత సువిశాల దేశం ఇది –బతకకపోతామా అని బయల్దేరలేదు వారలు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి యంత్రాలు, మార్కెట్ వచ్చాక రాజ్యం (ప్రజల దృష్టిలో ప్రభుత్వానికి పర్యాయపదం) జీవనోపాధి కలిగిస్తుందనే ఒక ఎండమావి ఏర్పడింది. పుట్టిచినవాడు రాతి కింద కప్పకు కూడ బతుకు దెరువు చూపకపోడనే విశ్వాసం మత శాస్త్రాలన్నీ ఉగ్గుపాలతో రంగరించి పోసినదే. కనక రాముడూ రాజ్జీవూ కలసి పోయాయి. బ్రాహ్మణీయ హిందూ మత విశ్వాసం కలిగించిన మాయకు మార్కెట్ మాయతోడైంది.© 2017,www.logili.com All Rights Reserved.