'మాలపల్లినీ అగ్రహారాన్నీ కలుపుతూ ఒక రోడ్డువేస్తే ఎంత బావుండును' అన్నాడు సుబ్బారాయుడు. అతడలా అనగానే పొగడచెట్టు మీదనున్న కాకి ఎర్రని నోరు తెరచి కాకా అని అరచింది.
***
'అదుగో పోస్టుమాస్టరుగారు వస్తున్నారు' అన్నాడు తపాలాఫీసు ముందు పొగడ చెట్టు నీడన కూర్చుని ఉన్న కరణం. వీధి చివరన పోస్టుమాస్టరు గారు గొడుగువేసుకుని వస్తూ ఉండడం కనిపించగానే అతనికి సంతోషమయింది. పొగడచెట్టు నీడన ఉన్న అరుగుమీద కూర్చుని అతడు పోస్టుమాస్టరుగారి కోసం అరగంట నుండి ఎదురు చూస్తున్నాడు. పట్నంలో కాలేజి చదువు వెలిగిస్తున్న కుమారుడి నుండి ఈ రోజు ఉత్తరం వస్తుందని అతడు ఆశలు పెట్టుకుని ఉన్నాడు.
పోస్టుమాస్టరుగారు పరుగే నడకగా వచ్చి తపాలాఫీసు ముందాగాడు. గుమ్మం వద్ద చెప్పులు విడిచి గొడుగును ముడిచాడు.
'ఈ రోజు ఇంత ఆలస్యమయిందేం మాస్టారూ! స్కూలులో ఏదైనా విశేషమా?' అనడిగాడు పొగడచెట్టుబోదె నానుకుని, దాని వేళ్లపైన కూర్చుని ఉన్న సుబ్బారాయుడు. అతడు గూడ కరణంతో బాటు అర గంట నుండి పోస్టాఫీసు ముందు పడిగాపులు పడి ఉన్నాడు. కాని అతడు ఉత్తరాలను అందుకోవడానికి పుచ్చుకోవడానికీ రాలేదు. పోస్టులో పంచాయితీబోర్డు ప్రెసిడెంటుగారి పేర వచ్చే వార్తాపత్రిక కోసం వచ్చాడు. పేపరు చదవనిదే అతనికి దిక్కు తోచదు. పంచాయితీ బోర్డు ఏర్పడిననాటి నుండి ఈ ఊరికి.................
'మాలపల్లినీ అగ్రహారాన్నీ కలుపుతూ ఒక రోడ్డువేస్తే ఎంత బావుండును' అన్నాడు సుబ్బారాయుడు. అతడలా అనగానే పొగడచెట్టు మీదనున్న కాకి ఎర్రని నోరు తెరచి కాకా అని అరచింది. *** 'అదుగో పోస్టుమాస్టరుగారు వస్తున్నారు' అన్నాడు తపాలాఫీసు ముందు పొగడ చెట్టు నీడన కూర్చుని ఉన్న కరణం. వీధి చివరన పోస్టుమాస్టరు గారు గొడుగువేసుకుని వస్తూ ఉండడం కనిపించగానే అతనికి సంతోషమయింది. పొగడచెట్టు నీడన ఉన్న అరుగుమీద కూర్చుని అతడు పోస్టుమాస్టరుగారి కోసం అరగంట నుండి ఎదురు చూస్తున్నాడు. పట్నంలో కాలేజి చదువు వెలిగిస్తున్న కుమారుడి నుండి ఈ రోజు ఉత్తరం వస్తుందని అతడు ఆశలు పెట్టుకుని ఉన్నాడు. పోస్టుమాస్టరుగారు పరుగే నడకగా వచ్చి తపాలాఫీసు ముందాగాడు. గుమ్మం వద్ద చెప్పులు విడిచి గొడుగును ముడిచాడు. 'ఈ రోజు ఇంత ఆలస్యమయిందేం మాస్టారూ! స్కూలులో ఏదైనా విశేషమా?' అనడిగాడు పొగడచెట్టుబోదె నానుకుని, దాని వేళ్లపైన కూర్చుని ఉన్న సుబ్బారాయుడు. అతడు గూడ కరణంతో బాటు అర గంట నుండి పోస్టాఫీసు ముందు పడిగాపులు పడి ఉన్నాడు. కాని అతడు ఉత్తరాలను అందుకోవడానికి పుచ్చుకోవడానికీ రాలేదు. పోస్టులో పంచాయితీబోర్డు ప్రెసిడెంటుగారి పేర వచ్చే వార్తాపత్రిక కోసం వచ్చాడు. పేపరు చదవనిదే అతనికి దిక్కు తోచదు. పంచాయితీ బోర్డు ఏర్పడిననాటి నుండి ఈ ఊరికి.................© 2017,www.logili.com All Rights Reserved.