ఇది మూడు రెడ్డి రాజ్యాల - కొండవీడు, రాజమహేంద్రవరం, కందుకూరు రెడ్డి రాజ్యాల - చరిత్ర. ఇది విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం, నెల్లూరు జిల్లాలోని కందుకూరు మధ్య సముద్రతీర ప్రాంతాల ఆంధ్ర ప్రజల భవితవ్యాలను తీర్చిదిద్దినటువంటిది. క్రీ.శ. 1325-1448 మధ్య నూట పాతికేళ్ళ కాలానికి సంబంధించినది. మూడింటిలో కొండవీడు మొదటిదీ, ముఖ్యమైనది. మిగిలిన రెండు దీని శాఖలే. రేకపల్లి,వరంగల్లుల ముసునూరి నాయకులకు సామంతులుగా కొండవీడు రెడ్డిరాజులు జీవితాన్ని ప్రారంబించి, అనతికాలంలో స్వతంత్రులై, కాకతీయానంతర కాలంలో హిందూ ప్రభుత్వ పునరుద్దరణలో ప్రముఖ పాత్ర వహించారు.
కొండవీడు చరిత్ర కొట్టిన పిండి. ఎంతోమంది పండితులు దాన్ని గురించి భిన్నకోణాల్లో అధ్యనం చేశారు. ఈ గ్రంధాన్ని మూడు ఆధారాల -శాసనాలు, సాహిత్యం, సంప్రదాయ కధనాల - సాయంతో ఆ చరిత్రను పునర్నిర్మించే ప్రయత్నం జరిగింది. చరిత్ర పట్ల ఇష్టమున్న వారు తప్పక చదవవలసిన, మంచి ఆదరణ పొంది ఎన్నో పునర్ముద్రణలు పొందిన పుస్తకం.
ఇది మూడు రెడ్డి రాజ్యాల - కొండవీడు, రాజమహేంద్రవరం, కందుకూరు రెడ్డి రాజ్యాల - చరిత్ర. ఇది విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం, నెల్లూరు జిల్లాలోని కందుకూరు మధ్య సముద్రతీర ప్రాంతాల ఆంధ్ర ప్రజల భవితవ్యాలను తీర్చిదిద్దినటువంటిది. క్రీ.శ. 1325-1448 మధ్య నూట పాతికేళ్ళ కాలానికి సంబంధించినది. మూడింటిలో కొండవీడు మొదటిదీ, ముఖ్యమైనది. మిగిలిన రెండు దీని శాఖలే. రేకపల్లి,వరంగల్లుల ముసునూరి నాయకులకు సామంతులుగా కొండవీడు రెడ్డిరాజులు జీవితాన్ని ప్రారంబించి, అనతికాలంలో స్వతంత్రులై, కాకతీయానంతర కాలంలో హిందూ ప్రభుత్వ పునరుద్దరణలో ప్రముఖ పాత్ర వహించారు. కొండవీడు చరిత్ర కొట్టిన పిండి. ఎంతోమంది పండితులు దాన్ని గురించి భిన్నకోణాల్లో అధ్యనం చేశారు. ఈ గ్రంధాన్ని మూడు ఆధారాల -శాసనాలు, సాహిత్యం, సంప్రదాయ కధనాల - సాయంతో ఆ చరిత్రను పునర్నిర్మించే ప్రయత్నం జరిగింది. చరిత్ర పట్ల ఇష్టమున్న వారు తప్పక చదవవలసిన, మంచి ఆదరణ పొంది ఎన్నో పునర్ముద్రణలు పొందిన పుస్తకం.© 2017,www.logili.com All Rights Reserved.