జ్ఞానేంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచం నుంచి నిరంతరం అందుతూ ఉండే అసంఖ్యాక సంకేతాలను ఒకదానితో మరొకదాన్ని సమన్వయం చేసుకుంటూ మెదడు ఆయా విషయాలను అర్ధం చేసుకుంటుంది. దృశ్యం, శబ్దం తదితర సమాచార సంకేతాలు అందినప్పుడు, వాటిని సమన్వయపరచు కోలేకపోవడం వల్ల ఆటిజం పిల్లలు తగిన విధంగా స్పందించలేరు.
భారత్ లో 20లక్షల కంటే ఎక్కువ మంది పిల్లలు ఆటిజం బాధితులుగా ఉన్నారని ఒకప్పడు చెప్పేవారు. 2013 తాజా అంచనాల ప్రకారం దేశంలో ప్రతి 88మంది పిల్లల్లో ఒకరు ఆటిజంతో బాధపడుతున్నారు.
చిన్నారుల్లో ఆటిజం లోపాన్ని ముందే గుర్తించడం ద్వారానూ, వారికి సరియైన అలవాట్లు నేర్పడం ద్వారానూ మంచి అభివృద్ధి సాధించవచ్చు. ఒక్కొక్క సందర్భంలో పూర్తిగా వారిని సామాన్య బాలలుగా కూడా తీర్చిదిద్దుకోవచ్చు. ఆటిజానికి గురైన పిల్లలను నిర్లక్ష్యం చేయకుండా ప్రేమిద్దాం. వారు కూడా అందరిలా సహజమైన జీవితం గడిపేందుకు సహకరిద్దాం.
- ఎస్. బాలభారతి
జ్ఞానేంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచం నుంచి నిరంతరం అందుతూ ఉండే అసంఖ్యాక సంకేతాలను ఒకదానితో మరొకదాన్ని సమన్వయం చేసుకుంటూ మెదడు ఆయా విషయాలను అర్ధం చేసుకుంటుంది. దృశ్యం, శబ్దం తదితర సమాచార సంకేతాలు అందినప్పుడు, వాటిని సమన్వయపరచు కోలేకపోవడం వల్ల ఆటిజం పిల్లలు తగిన విధంగా స్పందించలేరు. భారత్ లో 20లక్షల కంటే ఎక్కువ మంది పిల్లలు ఆటిజం బాధితులుగా ఉన్నారని ఒకప్పడు చెప్పేవారు. 2013 తాజా అంచనాల ప్రకారం దేశంలో ప్రతి 88మంది పిల్లల్లో ఒకరు ఆటిజంతో బాధపడుతున్నారు. చిన్నారుల్లో ఆటిజం లోపాన్ని ముందే గుర్తించడం ద్వారానూ, వారికి సరియైన అలవాట్లు నేర్పడం ద్వారానూ మంచి అభివృద్ధి సాధించవచ్చు. ఒక్కొక్క సందర్భంలో పూర్తిగా వారిని సామాన్య బాలలుగా కూడా తీర్చిదిద్దుకోవచ్చు. ఆటిజానికి గురైన పిల్లలను నిర్లక్ష్యం చేయకుండా ప్రేమిద్దాం. వారు కూడా అందరిలా సహజమైన జీవితం గడిపేందుకు సహకరిద్దాం. - ఎస్. బాలభారతి© 2017,www.logili.com All Rights Reserved.