కోరిక తీవ్రతరమైనదైతే కోరిందాన్ని పొందగలమా లేదా
అనే ఆలోచన ఎందుకు?
ఒక కోరిక నిన్న తీరలేదంటే, ఇక నెరవేరనే నెరవేరదని ఏ ఆధారంతో చెప్పగలరు?
మీకేది కావాలన్న విషయంలో, మీకు మీరు సరైన నిర్ణయం తీసుకొంటే, మంచి పట్టుదల ఉంటే కోరిందాన్ని పొందడం సులభం.
కోరిక తీవ్రతరమైనదేతే కోరిందాన్ని పొందగలమా లేదా అనే ఆలోచన ఎందుకు? ”మీరు లేచి నడవగలరా?” అంటే ‘నడవగలన’నే అంటారు. ”మీరు గాల్లోకి లేచి ఎగరగలరా?” అంటే ”కుదరదు” అనే కదా అంటారు!
మీ ఈ రెండు సమాధానాల్ని ఇచ్చింది మీ అనుభవాలే కదా! ఒక కోరిక నిన్న తీరలేదంటే, ఇక నెరవేరనే నెరవేరదని ఏ ఆధారంతో చెప్పగలరు? వందేళ్లకు ముందు అమెరికాలో జరుగుతున్నది ఆ క్షణానికాక్షణం తెలుసుకోవాలని కోరుకుంటే జరిగేది కాదు. కానీ, ఎవరో ఒకళ్లు అలా తీవ్రంగా కోరుకోబట్టే కదా మనకు టెలివిజన్ వచ్చింది.