జీవితాన్ని గురించి చిత్రమైన అభిప్రాయాలూ, సిద్ధాంతీకరణలు నిర్వచనాలూ ఉండే వయస్సు నుంచీ - బరువు బాధ్యతలను యోచించని మెదడు నుంచి - నిజ జీవితాన్నెరుగని ఆలోచనల నుంచి - ఈ నవల వచ్చింది. 1960 లో మల్టిపర్ పస్ పరీక్ష ఆఖరి తర్వాత ఇది రాశాను. అప్పటి వాస్తవ జీవితం మీద పరిశీలనా దృష్టి కలగలేదు. హైస్కూలు విద్యార్థిగా నేను చేసిన ఆలోచనలకూ, ఊహించిన కమనీయ ద్రుశ్యాలకి ఇది దర్పణం. ఆ నాటికీ నేను హైదెరాబాద్ కూడా సరిగా చూసి ఎరుగను. అయినా ప్రయత్నించాను. అది సఫలమైందా, విఫలమైందా అంటే నేను చెప్పలేను. ఎందుకంటే, నేను సర్వజ్ఞుడిని కాను గనుక!. అప్పటి జీవితం మీద పరిశీలన తద్వార కలిగిన ఆలోచనలు, ఊహలకు రూపకల్పనే ఈ నవలలోని పాత్రలు.
- పసుపులేటి మల్లికార్జున రావు
జీవితాన్ని గురించి చిత్రమైన అభిప్రాయాలూ, సిద్ధాంతీకరణలు నిర్వచనాలూ ఉండే వయస్సు నుంచీ - బరువు బాధ్యతలను యోచించని మెదడు నుంచి - నిజ జీవితాన్నెరుగని ఆలోచనల నుంచి - ఈ నవల వచ్చింది. 1960 లో మల్టిపర్ పస్ పరీక్ష ఆఖరి తర్వాత ఇది రాశాను. అప్పటి వాస్తవ జీవితం మీద పరిశీలనా దృష్టి కలగలేదు. హైస్కూలు విద్యార్థిగా నేను చేసిన ఆలోచనలకూ, ఊహించిన కమనీయ ద్రుశ్యాలకి ఇది దర్పణం. ఆ నాటికీ నేను హైదెరాబాద్ కూడా సరిగా చూసి ఎరుగను. అయినా ప్రయత్నించాను. అది సఫలమైందా, విఫలమైందా అంటే నేను చెప్పలేను. ఎందుకంటే, నేను సర్వజ్ఞుడిని కాను గనుక!. అప్పటి జీవితం మీద పరిశీలన తద్వార కలిగిన ఆలోచనలు, ఊహలకు రూపకల్పనే ఈ నవలలోని పాత్రలు. - పసుపులేటి మల్లికార్జున రావు© 2017,www.logili.com All Rights Reserved.