ఏ రోగమునకైన ఔషధ నిర్ణయము చేయుట పూర్వము వైద్యుడు కొన్ని ముఖ్య విషయములను గ్రహించవలెను. బయటకు కనిపించే రోగ లక్షణములలో మాత్రమే తెలిసికొని వైద్యమెన్నడును చేయరాదు. ప్రతిరోగికి ప్రత్యేకించి యుండు కొన్ని విశేష లక్షణములు కలవు. అట్టి లక్షణములు రోగివద్దనుండి తెలిసికొని లేక వైద్యుడు పరీక్షించి తాను స్వయంగా గ్రహించియో వైద్యము చేయవలేనేగాని కేవలము పైకి కనిపించే లక్షణముల బట్టి ఔషధ నిర్ణయము చేయరాదు. ఇట్టి లక్షణ సముదాయమే హోమియోపతి వైద్యమునకు ప్రధానమైనది.
రోగి లక్షణములు ఒక్కొక్క రోగికి ఒక్కొక్క విధముగా ఉండును. కావున ఈ లక్షణములన్నియు బాగుగ గ్రహించిన పిమ్మట ఔషధ నిర్ణయము చెయవలయును. అంతే కాని జ్వరమున్నది కదా అని 'ఎకోనైట్' ఇచ్చినను దగ్గునుబట్టి 'ఇపెకాక్' వాడినను ప్రయోజనము లేదు. బయటకు కనిపించే అధిక శరీర ఉష్ణము బట్టి జ్వరరోగులకు అందరకు ఒకే ఔషధం పనిచేయదు.
సాద్యమైనంతవరకు గుణములకన్నింటికి సరిపడు ఔషధమొక్కటియే నిర్ణయించవలెను. ఇతర వైద్య విధానములవలె గుణమునకు ఒక మందు నిర్ణయించి అన్నియు కలిపివాడరాదు. ఏక మూలికా సిద్ధాంతమే యీ వైద్య విధానమండలి ముఖ్య లక్షణము. అనేక మూలికల మిశ్రమము చేయుట దీనికి విరుద్ధము.
ఈ వైద్య విధానములో వ్యాధి లక్షణాల గురించి, ఔషధ మందులు వాడే సమయములు, మందుల పేర్లు వాటి ఉపయోగాలు, రోగములకు నివారణలు గురించి తెలిపారు. ఈ గ్రంధము వ్రాయుటలో కె.శ్రీనివాసరావు గారు ప్రోప్రయిటర్ గోదావరి హోమియో స్టోర్స్ వారు తమ అమూల్యమైన సలహాలను ఇచ్చి నన్ను ప్రోత్సహించారు.
- యస్. ప్రబాకర్ రావు
ఏ రోగమునకైన ఔషధ నిర్ణయము చేయుట పూర్వము వైద్యుడు కొన్ని ముఖ్య విషయములను గ్రహించవలెను. బయటకు కనిపించే రోగ లక్షణములలో మాత్రమే తెలిసికొని వైద్యమెన్నడును చేయరాదు. ప్రతిరోగికి ప్రత్యేకించి యుండు కొన్ని విశేష లక్షణములు కలవు. అట్టి లక్షణములు రోగివద్దనుండి తెలిసికొని లేక వైద్యుడు పరీక్షించి తాను స్వయంగా గ్రహించియో వైద్యము చేయవలేనేగాని కేవలము పైకి కనిపించే లక్షణముల బట్టి ఔషధ నిర్ణయము చేయరాదు. ఇట్టి లక్షణ సముదాయమే హోమియోపతి వైద్యమునకు ప్రధానమైనది. రోగి లక్షణములు ఒక్కొక్క రోగికి ఒక్కొక్క విధముగా ఉండును. కావున ఈ లక్షణములన్నియు బాగుగ గ్రహించిన పిమ్మట ఔషధ నిర్ణయము చెయవలయును. అంతే కాని జ్వరమున్నది కదా అని 'ఎకోనైట్' ఇచ్చినను దగ్గునుబట్టి 'ఇపెకాక్' వాడినను ప్రయోజనము లేదు. బయటకు కనిపించే అధిక శరీర ఉష్ణము బట్టి జ్వరరోగులకు అందరకు ఒకే ఔషధం పనిచేయదు. సాద్యమైనంతవరకు గుణములకన్నింటికి సరిపడు ఔషధమొక్కటియే నిర్ణయించవలెను. ఇతర వైద్య విధానములవలె గుణమునకు ఒక మందు నిర్ణయించి అన్నియు కలిపివాడరాదు. ఏక మూలికా సిద్ధాంతమే యీ వైద్య విధానమండలి ముఖ్య లక్షణము. అనేక మూలికల మిశ్రమము చేయుట దీనికి విరుద్ధము. ఈ వైద్య విధానములో వ్యాధి లక్షణాల గురించి, ఔషధ మందులు వాడే సమయములు, మందుల పేర్లు వాటి ఉపయోగాలు, రోగములకు నివారణలు గురించి తెలిపారు. ఈ గ్రంధము వ్రాయుటలో కె.శ్రీనివాసరావు గారు ప్రోప్రయిటర్ గోదావరి హోమియో స్టోర్స్ వారు తమ అమూల్యమైన సలహాలను ఇచ్చి నన్ను ప్రోత్సహించారు. - యస్. ప్రబాకర్ రావు
© 2017,www.logili.com All Rights Reserved.