పీఠిక
ఒక అస్పృశ్యుని యుద్ధగాధ మొదటి భాగం ఆంధ్రప్రదేశ్ లో ఒక సామాజిక చరిత్రకు అద్దంగా నిలబడింది. నా జీవితమే అయినా నేను ఒక సామాజిక కార్యకర్తగానే ఆ గ్రంధం వ్రాశాను. ముఖ్యంగా ఒక దళితుడిగా ఆ గ్రంధం రాశాను. దళితులకు అడుగడుగులో అవమానాలు, అప్రశంసలు దళితులను అణగదొక్కాలనే భావనలు సమాజంలో ఎక్కువగా ఉన్నాయి. వాటిని ఎదుర్కోవడమే ఒక చాలెంజ్. అస్పృశ్యుని యుద్ధగాధ అంటే ఏమిటో ఒకసారి చూద్దాం .
నా కథకు 'ఒక అస్పృశ్యుని యుద్ధగాధ' అని నేను పేరు ఎందుకు పెట్టానంటే భారతదేశంలో అప్పట్లో కులాల్లో పుట్టాక నిరంతరం కులాధిపత్యాన్ని ఎదిరించాల్సి వస్తుంది. ఆ కోణం నుండి చూస్తే జీవితం బాగా అర్థం అవుతుందనే అలా పేరు పెట్టాను. నేను సంస్కృత వాజ్మయాన్ని వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, ఆరణ్యకాలు, పురాణాలు కావ్యాలు, ప్రబంధాలు అన్ని చదివాను. అయితే ఇవన్నీ అస్పృశ్యుల పట్ల ఎలా రాయబడ్డాయనే దృష్టితోనే చదివాను. ప్రత్యామ్నాయ దృక్పధాన్ని అంబేడ్కర్, పూలే అధ్యయనం నుండి ఏర్పరచుకొన్నాను. ఆ తరువాత పెరియార్‌ను కూడా అధ్యయనం చేశాను. నా అధ్యయన క్రమాన్నంతా నేను ఈ గ్రంధంలో రాశాను. నేను కులాన్ని నమ్మను, నా జీవితంలో కుల జీవన విధానం లేదు. కుల నిర్మూలన వాదిగానే నేను జీవిస్తున్నాను. ఈ క్రమంలో నా తల్లిదండ్రులు, నా భార్య స్వర్ణకుమారి, నా కుటుంబం నాకెంతో సహకారం అందించారు. ఈ..................
పీఠిక ఒక అస్పృశ్యుని యుద్ధగాధ మొదటి భాగం ఆంధ్రప్రదేశ్ లో ఒక సామాజిక చరిత్రకు అద్దంగా నిలబడింది. నా జీవితమే అయినా నేను ఒక సామాజిక కార్యకర్తగానే ఆ గ్రంధం వ్రాశాను. ముఖ్యంగా ఒక దళితుడిగా ఆ గ్రంధం రాశాను. దళితులకు అడుగడుగులో అవమానాలు, అప్రశంసలు దళితులను అణగదొక్కాలనే భావనలు సమాజంలో ఎక్కువగా ఉన్నాయి. వాటిని ఎదుర్కోవడమే ఒక చాలెంజ్. అస్పృశ్యుని యుద్ధగాధ అంటే ఏమిటో ఒకసారి చూద్దాం . నా కథకు 'ఒక అస్పృశ్యుని యుద్ధగాధ' అని నేను పేరు ఎందుకు పెట్టానంటే భారతదేశంలో అప్పట్లో కులాల్లో పుట్టాక నిరంతరం కులాధిపత్యాన్ని ఎదిరించాల్సి వస్తుంది. ఆ కోణం నుండి చూస్తే జీవితం బాగా అర్థం అవుతుందనే అలా పేరు పెట్టాను. నేను సంస్కృత వాజ్మయాన్ని వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, ఆరణ్యకాలు, పురాణాలు కావ్యాలు, ప్రబంధాలు అన్ని చదివాను. అయితే ఇవన్నీ అస్పృశ్యుల పట్ల ఎలా రాయబడ్డాయనే దృష్టితోనే చదివాను. ప్రత్యామ్నాయ దృక్పధాన్ని అంబేడ్కర్, పూలే అధ్యయనం నుండి ఏర్పరచుకొన్నాను. ఆ తరువాత పెరియార్‌ను కూడా అధ్యయనం చేశాను. నా అధ్యయన క్రమాన్నంతా నేను ఈ గ్రంధంలో రాశాను. నేను కులాన్ని నమ్మను, నా జీవితంలో కుల జీవన విధానం లేదు. కుల నిర్మూలన వాదిగానే నేను జీవిస్తున్నాను. ఈ క్రమంలో నా తల్లిదండ్రులు, నా భార్య స్వర్ణకుమారి, నా కుటుంబం నాకెంతో సహకారం అందించారు. ఈ..................© 2017,www.logili.com All Rights Reserved.