సాంఘిక ధర్మములకంటే మానవ ధర్మములు ఉత్తమమైనవి. సంఘము తన స్థితికోసమై తాత్కాలికముగా ఏదో నియమవాగురను అల్లుకుంటోంది. సంఘము హెచ్చా వ్యక్తులు హెచ్చా అనే ప్రశ్న భాదిస్తూనే ఉంటుంది. సామాన్యబుద్ధులకు సంఘమే హెచ్చానీ, అవసరమైతే వ్యక్తులను సంఘము కోసము బలి ఇయ్యవలిసి ఉంటుందనీ చెప్పుతారు. ఉన్నత దృష్టితో చూచినయెడల స్థితప్రజ్ఞులను కనడమే మానవసంఘమునకు లక్ష్యము. అట్టి సందర్భములో సాంఘిక నియమాలను నిజౌన్నత్యము కోసము అతిక్రమించే వ్యక్తులను ధర్మేతరులని కాని విప్లవకారులని కాని అనడము సమంజసముకాదు.
సాహిసికుడైన ఈ గ్రంథకర్త నిజప్రజ్ఞానుసారముగా ప్రేమతత్వాన్ని నిరూపించడానికి ప్రయత్నించినాడు. ప్రపంచములో శాశ్వతమైనది ప్రేమ ఒకటే అని భావికులు అభిప్రాయము. ప్రేమకోసము సమస్తమూ త్యజిస్తాము, ఎన్ని కష్టాలైన పడతాము. స్వార్థము వదిలివేస్తాము, ప్రేమ అంది లేకపోతే లోకానికి నాగరికత అలవడేదేకాదు. ప్రేమవల్లనే మానవులు దేవతలకు సన్నిహితులవుతారు. ఈ నవలను శాంతముగా చదువుట యుక్తము.
- శ్రీ శివశంకరశాస్త్రి
సాంఘిక ధర్మములకంటే మానవ ధర్మములు ఉత్తమమైనవి. సంఘము తన స్థితికోసమై తాత్కాలికముగా ఏదో నియమవాగురను అల్లుకుంటోంది. సంఘము హెచ్చా వ్యక్తులు హెచ్చా అనే ప్రశ్న భాదిస్తూనే ఉంటుంది. సామాన్యబుద్ధులకు సంఘమే హెచ్చానీ, అవసరమైతే వ్యక్తులను సంఘము కోసము బలి ఇయ్యవలిసి ఉంటుందనీ చెప్పుతారు. ఉన్నత దృష్టితో చూచినయెడల స్థితప్రజ్ఞులను కనడమే మానవసంఘమునకు లక్ష్యము. అట్టి సందర్భములో సాంఘిక నియమాలను నిజౌన్నత్యము కోసము అతిక్రమించే వ్యక్తులను ధర్మేతరులని కాని విప్లవకారులని కాని అనడము సమంజసముకాదు. సాహిసికుడైన ఈ గ్రంథకర్త నిజప్రజ్ఞానుసారముగా ప్రేమతత్వాన్ని నిరూపించడానికి ప్రయత్నించినాడు. ప్రపంచములో శాశ్వతమైనది ప్రేమ ఒకటే అని భావికులు అభిప్రాయము. ప్రేమకోసము సమస్తమూ త్యజిస్తాము, ఎన్ని కష్టాలైన పడతాము. స్వార్థము వదిలివేస్తాము, ప్రేమ అంది లేకపోతే లోకానికి నాగరికత అలవడేదేకాదు. ప్రేమవల్లనే మానవులు దేవతలకు సన్నిహితులవుతారు. ఈ నవలను శాంతముగా చదువుట యుక్తము. - శ్రీ శివశంకరశాస్త్రి© 2017,www.logili.com All Rights Reserved.