భారతదేశ చరిత్ర రచనపై బ్రాహ్మణీయ భావజాల ప్రభావం అధికంగా వుంది. దాని ఫలితంగా అట్టడుగు కులాలకూ, వర్గాలకూ చెందిన ఎందరో సామాజిక విప్లవకారుల కృషి మరుగున పడిపోయింది. ఆలస్యంగానైనా మనకు అందుబాటులోకి వచ్చిన ఉద్యమకారుల జీవిత చరిత్రల్లో సావిత్రీబాయి ఫూలే జీవితానికి గొప్ప ప్రాధాన్యత ఉన్నది.
ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి సారిగా బ్రాహ్మణీయ కులతత్వ సంస్కృతి, మత వ్యవస్థలపై యుద్ధాన్ని ప్రకటించిన వ్యక్తులు జ్యోతిరావు ఫూలే, ఆయన భార్య సావిత్రీబాయి. విద్యకు వెలియైన ప్రజలకోసం వారు విద్యాలయాలను నిర్మించారు. విద్యను పీడితుల చేతి ఆయుధంగా మలిచారు. ఆ విశేషాలన్నిటినీ ఈ పుస్తకంలో పలువురు వ్యాస రచయితలు హృద్యంగా వివరించారు.
జ్యోతిబా ఫూలే సహచరిగా ఆయన ఉద్యమ జీవితంలో తోడుగా నిలవటమేగాక తనదైన స్వతంత్ర వ్యక్తిత్వాన్నీ, సాహితీ ప్రతిభనూ రూపొందించుకున్న వ్యక్తి సావిత్రీబాయి. నిబద్ధతతో ఉద్యమించిన మహిళల తొలిగురువు సావిత్రీబాయిని స్మరించుకోవడం సముచితంగా ఉంటుంది. ఈ పుస్తకానికి తెలుగు అనువాదం చేసిన కాత్యాయని ''చూపు'' పత్రిక నిర్వాహకురాలిగా తెలుగు పాఠకులకు సుపరిచితులు. ఇప్పటికే అనేక నవలలనూ, పుస్తకాలనూ తెలుగులోకి అనువదించారు.
ఇందులో...
1. పరిచయం - బ్రజ్ రంజన్ మణి
2. సామాజిక విప్లవకారులు - సింథియా స్టీఫెన్
3. ఉత్తమ ఉపాధ్యాయిని , నాయకురాలు - గేల్ ఆంవెట్
4. ఫూలే దంపతులకు స్ఫూర్తి ప్రదాత : సగుణాబాయి - పమేలా సర్తార్
5. జోతిబాకు సావిత్రి రాసిన సాటిలేని ప్రేమ లేఖలు - సునీల్ సర్దార్
6. ఉద్యమ కవితా వైతాళికురాలు సావిత్రీబాయి ఫూలే కవితలు
7. ఒక దళిత బాలిక తిరుగుబాటు స్వరం
8. సత్యాన్వేషి సావిత్రీబాయి - విక్టర్ పాల్
9. సావిత్రీబాయి జీవిత విశేషాలు
© 2017,www.logili.com All Rights Reserved.