మహాభారతంలో ఉటంకించబడిన సావిత్రి-సత్యవంతుల ప్రణయగాథ, మృత్యువును జయంచిన విజయగాథ. మర్త్య
ప్రవృత్తులకు, అమర్త్య స్థితికి, మర్త్యుల ఆకాంక్షలకు, అద్దం పడుతూ వేద విహితంగా ఉన్న ఇతివృత్తం ఇది.
అజ్ఞానములోనికి, మృత్యువులోనికి జారుకున్న సత్యవంతుడు, ఆత్మగతవైున పరమోన్నత సత్యమునకు ప్రతీక.
సావిత్రి, పరమోన్నత పదము, ఆదిత్య పుత్రిక, పరమోన్నత సత్యమున కధిష్ఠాన దేవత. మర్త్యుల రక్షించుటకై
భూతలమున జన్మించినది. మర్త్య భూతలమున ఆమె జనకుడగు అశ్వపతి తపస్సిద్ధి సంపన్నుడు. మర్త్యులను అమర్త్య
స్థితికి గొనిపోగల ఆధ్యాత్మిక ఔన్నత్యముల కెదిగినవాడు. సత్యవంతుని జనకుడగు ద్యుమత్సేనుడు, పేరెన్నికగన్న
అతిరథుడు. కాని, పతనవైున దైవాంశ సంభూతమగు మర్త్య మానసమునకు ప్రతీక. దైవదత్తమగు దృష్టిని, దాని
మూలమున వైభవోపేతమగు రాజ్యమును కోల్పోయనవాడు. అయనను ఇతివృత్తము కేవలము ప్రతీకాత్మకము కాదు.
పాత్రలు సజీవములు, మర్త్యరూపమున నడయాడు చేతన గలిగిన శక్తులు, దర్శనీయములు. మానవుని అధిచేతన వైపు
ఉత్థానమునకు, వారి దివ్య జీవన సిద్ధికి, పథగాములు.
మహాభారతంలో ఉటంకించబడిన సావిత్రి-సత్యవంతుల ప్రణయగాథ, మృత్యువును జయంచిన విజయగాథ. మర్త్య ప్రవృత్తులకు, అమర్త్య స్థితికి, మర్త్యుల ఆకాంక్షలకు, అద్దం పడుతూ వేద విహితంగా ఉన్న ఇతివృత్తం ఇది. అజ్ఞానములోనికి, మృత్యువులోనికి జారుకున్న సత్యవంతుడు, ఆత్మగతవైున పరమోన్నత సత్యమునకు ప్రతీక. సావిత్రి, పరమోన్నత పదము, ఆదిత్య పుత్రిక, పరమోన్నత సత్యమున కధిష్ఠాన దేవత. మర్త్యుల రక్షించుటకై భూతలమున జన్మించినది. మర్త్య భూతలమున ఆమె జనకుడగు అశ్వపతి తపస్సిద్ధి సంపన్నుడు. మర్త్యులను అమర్త్య స్థితికి గొనిపోగల ఆధ్యాత్మిక ఔన్నత్యముల కెదిగినవాడు. సత్యవంతుని జనకుడగు ద్యుమత్సేనుడు, పేరెన్నికగన్న అతిరథుడు. కాని, పతనవైున దైవాంశ సంభూతమగు మర్త్య మానసమునకు ప్రతీక. దైవదత్తమగు దృష్టిని, దాని మూలమున వైభవోపేతమగు రాజ్యమును కోల్పోయనవాడు. అయనను ఇతివృత్తము కేవలము ప్రతీకాత్మకము కాదు. పాత్రలు సజీవములు, మర్త్యరూపమున నడయాడు చేతన గలిగిన శక్తులు, దర్శనీయములు. మానవుని అధిచేతన వైపు ఉత్థానమునకు, వారి దివ్య జీవన సిద్ధికి, పథగాములు.© 2017,www.logili.com All Rights Reserved.