జీవితంలో ఒక స్త్రీ ఒకే ఒక పురుషుణ్ణి ప్రేమించ గలుగుతుంది కాని పది మందిని ప్రేమించజాలదు. అలాగే ఒక పురుషుడు ఒకే ఒక స్త్రీని ప్రేమించగలడు కాని పది మందిని ప్రేమించలేడు. అలాంటి ప్రేమ ప్రేమ కాదు, కానేరదు.
సావిత్రిది ప్రేమే కాని మోహం కాదనడానికి కారణం జెమినీ గణేశన్ ను పెళ్ళాడినాక ఆమెకు అతనినుండి తాను ఆశించినంత ప్రేమ అబ్బకపోయినా, ఎంతమంది విడాకులివ్వమని నచ్చజెప్పినా అతనికి విడాకులివ్వడానికి ఆమె ససేమిరా ఒప్పుకోకపోవడమే. జెమినీ గణేశన్ది ప్రేమ కాదు మోహం అని అనడానికి కారణం అతడు సావిత్రిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా యధావిధిగా ఆకతాయి తిరుగుళ్లు తిరగడం, 70 ఏళ్ళకు కూడా మరొక పెళ్ళి చేసికోవడం.
సావిత్రి అందాన్నే ప్రేమించింది. మరి దేనినీ కాదు, మరెవరినీ కాదు. అందం కొరకే ఇతరాలను, ఇతరులను ప్రేమించింది. కనుకనే అంత అందంగా నటించింది. సావిత్రి ప్రేమనే ప్రేమించింది కనుక అలా ప్రేమించ గలిగింది. ఆమెకు అందం ద్రవ్యం కొరకు, నగల కొరకు కాదు అందం కొరకు, ఎంతో అందంగా బొట్టు పెట్టుకునేది, ఎంతో అందంగా చీర కట్టుకునేది, ఎంతో అందంగా నడిచేది, నవ్వేది, ఎంతో నటించేది, ప్రేమించేది, అందమే ఆమె జీవ లక్షణం, జీవిత లక్ష్యం, మరేదీ కాదు. ఆమెకు అందంకన్నా, ప్రేమకన్నా భర్త కాదు, సంతానము కాదు, సహచరులూ కాదు, సహకళాకారులూ కారు, సంపద కూడా. ఆమె ప్రేమించింది అమలిన ప్రేమ కొరకు, అమలిన అందం కొరకు.
సావిత్రి అంతా ఇంతా అందగత్తె కాదు. ఆమెది వర్ణనాతీతమయిన అందం. ఆ అందం ప్రత్యేకంగా ఆమె కళ్ళల్లో, ఆమె చూపుల్లో ఉండేది, పెదవుల్లో, అధరాల్లో, నవ్వుల్లో, ఠీవిలో, శైలిలో ఉండేది. Style is the man అని అంటారే అలాంటి 'స్టైల్' కలది సావిత్రి. ఆమె అందం గ్లామర్ లాంటిది కాదు. Grace లాంటి, dignity, decency లాంటిది. ఆమె బహు ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం కలది. ఆమె మొండిదని కొందరు, అహంభావియని కొందరు అనడం జరిగింది కాని, అది వాస్తవానికి ఆమె గాంభీర్యానికి, వ్యక్తిత్వానికి చెందింది. ఆ వ్యక్తిత్వం ఆమెనే కాదు వ్యక్తిత్వమున్నవారినందరినీ అహంభావకులు, గర్విష్టులు, మొండివారు అనిపించేట్లు, కనిపించేట్లు చేస్తుంది. ప్రతి వ్యక్తిత్వమున్నవాడు భిన్నంగా, విభిన్నంగా, ప్రత్యేకంగా కనిపిస్తాడు, వినిపిస్తాడు. అది వారి భావమూ కాదు, స్వభావమూ కాదు. అది వారి సహజత, ప్రత్యేకత, వారి భిన్న విభిన్నతకు చెందింది.
ఆమె నటనాకళను అంత అమితంగా ప్రేమించకపోతే ఆమె అంతపాటి నటి, మహానటి అయ్యేదే కాదు. ఆమెను మహానటి అన్నపుడు, ఆమె అలా ఎలా కాగలిగిందను విషయాన్ని కూడా మనం గ్రహించాలి.....................
జీవితంలో ఒక స్త్రీ ఒకే ఒక పురుషుణ్ణి ప్రేమించ గలుగుతుంది కాని పది మందిని ప్రేమించజాలదు. అలాగే ఒక పురుషుడు ఒకే ఒక స్త్రీని ప్రేమించగలడు కాని పది మందిని ప్రేమించలేడు. అలాంటి ప్రేమ ప్రేమ కాదు, కానేరదు. సావిత్రిది ప్రేమే కాని మోహం కాదనడానికి కారణం జెమినీ గణేశన్ ను పెళ్ళాడినాక ఆమెకు అతనినుండి తాను ఆశించినంత ప్రేమ అబ్బకపోయినా, ఎంతమంది విడాకులివ్వమని నచ్చజెప్పినా అతనికి విడాకులివ్వడానికి ఆమె ససేమిరా ఒప్పుకోకపోవడమే. జెమినీ గణేశన్ది ప్రేమ కాదు మోహం అని అనడానికి కారణం అతడు సావిత్రిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా యధావిధిగా ఆకతాయి తిరుగుళ్లు తిరగడం, 70 ఏళ్ళకు కూడా మరొక పెళ్ళి చేసికోవడం. సావిత్రి అందాన్నే ప్రేమించింది. మరి దేనినీ కాదు, మరెవరినీ కాదు. అందం కొరకే ఇతరాలను, ఇతరులను ప్రేమించింది. కనుకనే అంత అందంగా నటించింది. సావిత్రి ప్రేమనే ప్రేమించింది కనుక అలా ప్రేమించ గలిగింది. ఆమెకు అందం ద్రవ్యం కొరకు, నగల కొరకు కాదు అందం కొరకు, ఎంతో అందంగా బొట్టు పెట్టుకునేది, ఎంతో అందంగా చీర కట్టుకునేది, ఎంతో అందంగా నడిచేది, నవ్వేది, ఎంతో నటించేది, ప్రేమించేది, అందమే ఆమె జీవ లక్షణం, జీవిత లక్ష్యం, మరేదీ కాదు. ఆమెకు అందంకన్నా, ప్రేమకన్నా భర్త కాదు, సంతానము కాదు, సహచరులూ కాదు, సహకళాకారులూ కారు, సంపద కూడా. ఆమె ప్రేమించింది అమలిన ప్రేమ కొరకు, అమలిన అందం కొరకు. సావిత్రి అంతా ఇంతా అందగత్తె కాదు. ఆమెది వర్ణనాతీతమయిన అందం. ఆ అందం ప్రత్యేకంగా ఆమె కళ్ళల్లో, ఆమె చూపుల్లో ఉండేది, పెదవుల్లో, అధరాల్లో, నవ్వుల్లో, ఠీవిలో, శైలిలో ఉండేది. Style is the man అని అంటారే అలాంటి 'స్టైల్' కలది సావిత్రి. ఆమె అందం గ్లామర్ లాంటిది కాదు. Grace లాంటి, dignity, decency లాంటిది. ఆమె బహు ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం కలది. ఆమె మొండిదని కొందరు, అహంభావియని కొందరు అనడం జరిగింది కాని, అది వాస్తవానికి ఆమె గాంభీర్యానికి, వ్యక్తిత్వానికి చెందింది. ఆ వ్యక్తిత్వం ఆమెనే కాదు వ్యక్తిత్వమున్నవారినందరినీ అహంభావకులు, గర్విష్టులు, మొండివారు అనిపించేట్లు, కనిపించేట్లు చేస్తుంది. ప్రతి వ్యక్తిత్వమున్నవాడు భిన్నంగా, విభిన్నంగా, ప్రత్యేకంగా కనిపిస్తాడు, వినిపిస్తాడు. అది వారి భావమూ కాదు, స్వభావమూ కాదు. అది వారి సహజత, ప్రత్యేకత, వారి భిన్న విభిన్నతకు చెందింది. ఆమె నటనాకళను అంత అమితంగా ప్రేమించకపోతే ఆమె అంతపాటి నటి, మహానటి అయ్యేదే కాదు. ఆమెను మహానటి అన్నపుడు, ఆమె అలా ఎలా కాగలిగిందను విషయాన్ని కూడా మనం గ్రహించాలి.....................© 2017,www.logili.com All Rights Reserved.