Shodasi Ramayana Rahasyamulu

Rs.375
Rs.375

Shodasi Ramayana Rahasyamulu
INR
NAVOPH0270
Out Of Stock
375.0
Rs.375
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

తంత్రశాస్త్రం చదివిన కవి శేషేంద్ర, వాల్మీకి రామాయణాన్ని కుండలినీ యోగ గ్రంధంగా చూపారు. 'త్రిజటా స్వప్నము గాయత్రీ మంత్రమే ' అని వివరించారు. 'మొదటి భాగమదికారులకు గూడ నుపయోగించునది. చివరి భాగము మందాది కారులకునుపయోగించినది. వారీ గ్రంధము రాసినందుకు తెలుగు వారే కాదు, భారతీయులందరును కృతజ్ఞలుగా నుండవలసిన  విషయము ' అని విశ్వనాధ సత్యనారాయణ పుస్తకానికి ఏకవాక్య తీర్మానం చేసారు.

-డా. వైజయంతి

పారాయణకైనా, పరిశీలకనైనా 'షోడశి'
             వాల్మీకి కవితా లక్షణాలు ఎందరి రచనలకు మార్గదర్శకాలయ్యాయి? వ్యాసుడు కూడా వాల్మీకి రచనావైభవాన్ని వాడుకున్నాడా? రామాయణంలో ఎన్ని రహస్యాలున్నాయి? అశోకవనంలో రాక్షసి త్రిజటకు వచ్చిన కల గాయత్రీ మంత్ర అర్థమా? సుందరకాండకు వాల్మీకి ఆ పేరెందుకు పెట్టినట్టు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన 'షోడశి' పుస్తకం. ఇదివరకు వచ్చిన పుస్తకమే అయినా ఇప్పుడు మళ్లీ కొత్తగా విడుదలైంది.

              వాల్మీకి మంత్ర శాస్త్ర రహస్యాలను పొదిగి రామాయణ రచన చేశారని అడుగడుగునా నిరూపిస్తూ సాగుతుందీ రచన. సీతాదేవిని కుండలినీ శక్తికి, పరావిద్యకు ప్రతీకగా తీసుకున్న వాల్మీకి రామాయణం ద్వారా బైటికి రాముడి కథను చెబుతూ, నిగూఢంగా శ్రీవిద్యను బోధించాడని నిరూపిస్తారు శేషేంద్రశర్మ. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలనుకున్నవారికి రామాయణం ఎన్ని రహస్యాలను తెలియజేస్తుందో ఉదాహరణల ద్వారా వివరిస్తుందీ రచన. 'ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది నాకు' అనగలిగిన సాహసి శేషేంద్రశర్మ. జన కవిగా పేరుపొందిన ఆయన తన ఉపాసనాబలానికి సూక్ష్మ పరిశీలనా దృష్టిని జోడించి రాసిన పుస్తకం ఇది. భక్తిగా పారాయణం చేసేవారయినా, శ్రద్ధగా పరిశోధన చేసేవారయినా - రామాయణం గురించి, అందులోని రహస్యాల గురించి మరింత కూలంకషంగాతెలుసుకోవడానికి 'షోడశి'ని క్షుణ్ణంగా చదవాలి.

-ఆదివారం ఆంధ్రజ్యోతి 

తంత్రశాస్త్రం చదివిన కవి శేషేంద్ర, వాల్మీకి రామాయణాన్ని కుండలినీ యోగ గ్రంధంగా చూపారు. 'త్రిజటా స్వప్నము గాయత్రీ మంత్రమే ' అని వివరించారు. 'మొదటి భాగమదికారులకు గూడ నుపయోగించునది. చివరి భాగము మందాది కారులకునుపయోగించినది. వారీ గ్రంధము రాసినందుకు తెలుగు వారే కాదు, భారతీయులందరును కృతజ్ఞలుగా నుండవలసిన  విషయము ' అని విశ్వనాధ సత్యనారాయణ పుస్తకానికి ఏకవాక్య తీర్మానం చేసారు. -డా. వైజయంతి పారాయణకైనా, పరిశీలకనైనా 'షోడశి'             వాల్మీకి కవితా లక్షణాలు ఎందరి రచనలకు మార్గదర్శకాలయ్యాయి? వ్యాసుడు కూడా వాల్మీకి రచనావైభవాన్ని వాడుకున్నాడా? రామాయణంలో ఎన్ని రహస్యాలున్నాయి? అశోకవనంలో రాక్షసి త్రిజటకు వచ్చిన కల గాయత్రీ మంత్ర అర్థమా? సుందరకాండకు వాల్మీకి ఆ పేరెందుకు పెట్టినట్టు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన 'షోడశి' పుస్తకం. ఇదివరకు వచ్చిన పుస్తకమే అయినా ఇప్పుడు మళ్లీ కొత్తగా విడుదలైంది.              వాల్మీకి మంత్ర శాస్త్ర రహస్యాలను పొదిగి రామాయణ రచన చేశారని అడుగడుగునా నిరూపిస్తూ సాగుతుందీ రచన. సీతాదేవిని కుండలినీ శక్తికి, పరావిద్యకు ప్రతీకగా తీసుకున్న వాల్మీకి రామాయణం ద్వారా బైటికి రాముడి కథను చెబుతూ, నిగూఢంగా శ్రీవిద్యను బోధించాడని నిరూపిస్తారు శేషేంద్రశర్మ. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలనుకున్నవారికి రామాయణం ఎన్ని రహస్యాలను తెలియజేస్తుందో ఉదాహరణల ద్వారా వివరిస్తుందీ రచన. 'ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది నాకు' అనగలిగిన సాహసి శేషేంద్రశర్మ. జన కవిగా పేరుపొందిన ఆయన తన ఉపాసనాబలానికి సూక్ష్మ పరిశీలనా దృష్టిని జోడించి రాసిన పుస్తకం ఇది. భక్తిగా పారాయణం చేసేవారయినా, శ్రద్ధగా పరిశోధన చేసేవారయినా - రామాయణం గురించి, అందులోని రహస్యాల గురించి మరింత కూలంకషంగాతెలుసుకోవడానికి 'షోడశి'ని క్షుణ్ణంగా చదవాలి. -ఆదివారం ఆంధ్రజ్యోతి 

Features

  • : Shodasi Ramayana Rahasyamulu
  • : Gunturu Seshendra Sarma
  • : Guntur Seshendra Sarma Momorial Trust
  • : NAVOPH0270
  • : Paperback
  • : 249
  • : Telugu

Reviews

Average Customer review    :       (2 customer reviews)    Read all 2 reviews

on 08.07.2013 4 0

Good Book



on 08.09.2015 0 0

సుమారు 45 ఏళ్ళ క్రితం అచ్చయిన ఈ మహా కావ్యం అంతగా జన బాహుళ్యంలో ప్రాచుర్యానికి నోచుకోలేదు. శేషేంద్ర దానికి పూనుకోకపోవడమే ప్రధాన కారణం. ఆ తర్వాత 2000 సంవత్సరంలో వచ్చిన 3వ ప్రచురణతో కొంత వెలుగులోకి వచ్చింది. కొన్ని సమీక్షలు వెలువడ్డాయి. మళ్ళీ 2013లో వెలువడ్డ ప్రచురణతో కాస్త ప్రజల్లోకి వెళ్ళింది. ఈ 45 ఏళ్ళలో వచ్చిన విభిన్న సమీక్షలతో సమగ్రంగా సర్వాంగ సుందరంగా షోడశి ఈ-బుక్ మన ముందుకు వస్తోంది. ఈ డిజిటల్ శకంలో, నేటి ఈ-యుగంలో శ్రీ జయ విజయదశమి పర్వదిన కానుకగా "షోడశి"ని జగన్మాత ఆశీస్సులుగా అందిస్తున్నారు కవికుమారుడు సాత్యకి. * * * మానవాళికో పరమౌషధం... వాల్మీకీ ‘రామాయణం’ రామాయణం కథ ఒక పాఠ్యాంశంగా పిల్లల చేత చదివిస్తారు. సీతారాముల్ని ఆదిదంపతులుగా పెద్దలు కొలుస్తారు. ఇక పారాయణం సంగతి చెప్పనక్కర్లేదు. వాల్మీకి రామాయణాన్ని ఒక సులభమైన కథగా చెప్పి ఊరుకున్నాడా? కాదంటున్నారు శేషేంద్రశర్మ. వాల్మీకి రామాయణం అంతరాత్మ అవగతం అవడానికి శాస్త్ర పరిజ్ఞానం అవసరమని, అందులో రహస్యంగా దాగి వున్న రుషి హృదయం. శాస్త్ర పరిజ్ఞానం ద్వారానే ఆకళింపునకు లొంగుతుందని విశ్లేషించారు. మరి శాస్త్ర పరిజ్ఞానం అందరికీ అందేది కాదు కదా! ‘‘శాస్త్రములు పండితుల కొరకే’’ అన్న వాదం ‘‘కొందరు స్వార్థపరులైన పండితులు, కొందరు సోమరులైన పామరులు కలిసి చేసిన కుట్ర, కల్పించిన భ్రాంతి’’ అన్నది శేషేంద్రగారి నిశ్చితాభిప్రాయం. సాహిత్యం, శాస్త్రం పట్ల ఇలాంటి నిజాయితీ యుతమైన ప్రజాస్వామిక దృక్పథం ఉన్న శేషేంద్ర రామాయణంలో వాల్మీకి దాచిన రహస్యాల్ని ప్రజానీకానికి విడమరిచి చెబుతున్నారు. వాల్మీకి మహర్షి కుండలినీ యోగమనే పరమౌషధాన్ని మానవాళికి బహూకరించాడని, అనుష్టుప్‌ ఛందస్సులో ఉన్న వాల్మీకి కవిత ఆ ఔషధానికి తేనెపూత అనీ అనన్య అంతర్మథనంతో, అసాధారణ విద్వత్తుతో వ్యాఖ్యానించారు. రామాయణంలో వాల్మీకి ధ్యాన పద్ధతిని ప్రతిపాదించాడని, రామాయణం భారతంకంటే పూర్వ గ్రంథమనీ, వేదానికి రూపాంతరమనీ తేల్చి చెప్పారు. శేషేంద్రలోని అంతర్ముఖత్వం, పరిశీలాన్వేషణా చాతుర్యం రెండు పాయలుగా గ్రంథమంతటా విస్తరించాయి. ప్రతిభా పాండిత్యాల పారవశ్య పరిమళం గ్రంథమంతటా గుబాళిస్తుంది. ఋతుఘోష వంటి అరుదైన పద్యకావ్యం, మండే సూర్యుడు వంటి సంచలనాత్మక వచన కవితా సంకలనం వెలువరించిన శేషేంద్రలోని మంత్ర శాస్త్రం, వేదవాంగ్మయంలో విద్వాంసుడన్న కోణం ఈ గ్రంథం ద్వారా నేటితరం వాళ్ళు తెలుసుకోవచ్చు. - వై.వసంత , ఆంధ్రప్రభ, ఆదివారం 24 ఆగస్టు 2014 * * * సర్వకళా సంశోభితం భారతీయ విమర్శనా సాహిత్యాన్ని ప్రపంచ వాజ్ఞ్మయంలో నిలువెత్తు నిలబెట్టిన అత్యుత్తమ గ్రంథమిది. ‘షోడశి’ అనేది మహామంత్రానికి సంబంధించిన నామం. ఈ పేరును బట్టే ఇదో అధ్యాత్మ ప్రబోధగ్రంథమని గ్రహించవచ్చు. వాల్మీకి శ్రీమద్రామాయణాన్ని అర్థం చేసుకోవడానికి ఎంత శాస్త్రపరిజ్ఞానం అవసరమో ఈ గ్రంథం చదివితే తెలుస్తుంది. అంతేకాదు, వైదికవాజ్ఞ్మయం మీద అధికారం ఉండాలి. శేషేంద్రశర్శగారి లోతైన పరిశీలనా దృష్టిని, పాండిత్యాన్ని సాక్షాత్తు...... కథాసందర్భం, పాత్రల మనోగతం, ఆనాటి కాలం, విశేషమైన శాస్త్ర పాండిత్యం, శబ్దాధికారం, వీటికి తోడు లౌకిక వ్యవహారాలు ఇన్ని తెలిస్తే కాని వాల్మీకి పదప్రయోగాలను అవగతం చేసుకోలేమని శర్మగారు తేటతెల్లం చేశారు. దీనికి మకుటాయమానం ‘నేత్రాతుర:’ అనే శబ్దం మీద నిర్వహించిన చర్చ. సుందరకాండ పేరులో విశేషం, కుండలినీ యోగం, త్రిజటా స్వప్న వృత్తాంతంలో గాయత్రీ మంత్ర రహస్యం, భారతాన్ని రామాయణానికి ప్రతిబింబంగా భావించడం ` ఇలా ఎన్నో విమర్శనా వ్యాసాలు.. ఇతరుల ఊహకు కూడా అందనివి ఇందులో ఉన్నాయి. తెలుగు సాహితీ లోకం చేసుకున్న పుణ్యఫలం ఈ గ్రంథరాజం. - విపుల , విశ్వకథా వేదిక, మే, 2014 ప్రప్రంచ సాహిత్య విమర్శలో, పరిశోధనలో రెండు మహోన్నత శిఖరాలు మహాకవి శేషేంద్ర విరచిత షోడశి రామాయణ రహస్యములు, స్వర్ణహంస హర్షనైషద కావ్య పరిశీలన ప్రపంచ సాహితీ విమర్శలో రెండు మహోన్నత శిఖరాలు. సమకాలీన తెలుగు సాహిత్య ప్రజానీకానికి ముఖ్యంగా నేటి తరానికి తెలియని సత్యమిది. వాల్మీకి రామాయణంలో కుండలినీ యోగం, గాయత్రీమంత్రం తదితరాలు సాక్ష్యాత్కరించినట్లే శేషేంద్రకు హర్షుడి నైషధంలో మంత్రయోగ తంత్ర సంపుటి, శ్రీ మహాత్రిపుర సుందరి, చింతామణి తిరస్కరిణి మంత్రాలు సాక్ష్యాత్కరించాయి. డిగ్రీల ఉత్పత్తి కేంద్రాలయిన మన విశ్వవిద్యాలయాలు రీసెర్చ్‌ పేరుతో టన్నుల కొద్దీ ‘‘సాలిడ్‌ వేస్ట్‌’’ కుమ్మరిస్తుండగా శేషేంద్ర మున్సిపల్‌ కమీషనర్‌ నౌకరీ చేస్తూనే ఋషిగా దార్శినిక పరిశోధనాత్మకత విమర్శ గ్రంథాలు సృజించారు. ప్రచురణ రీత్యా షోడశి (1967) స్వర్ణహంస (1968) వెలువడ్డా రచనాకాలం దృష్ట్యా స్వర్ణహంస తొలికావ్యం. నన్నయ్య, శ్రీనాథ, మల్లినాథులకు దొరకని రహస్యాలు శేషేంద్రకు సాక్ష్యాత్కరించాయి. ఈ మహనీయత్రయం నైషథంలోని రహస్యాలను తనకు విడిచిపెట్టి వెళ్లడం తన పూర్వజన్మ పుణ్యఫలమని అంటారు శేషేంద్ర వినమ్రంగా. "ఈ రెండు మహా కావ్యాలు, ఆనాడు కీ.శే. నీలంరాజు వెంకటశేషయ్య గారి సంపాదకత్వంలోని ఆంధ్రప్రభ దినపత్రికలో 1963 నుంచి 1966 వరకూ ధారావాహికంగా, ఆదివారం సాహిత్యనుబంధంలో వెలువడ్డాయి. శేషేంద్ర పద్య, గద్య కావ్యాలన్నీ కూడా (సుమారు 6 పుస్తకాలు) ప్రభలో వెలువడ్డ తరువాతే పుస్తక రూపంలో ప్రచురితమయ్యాయి".


Discussion:Shodasi Ramayana Rahasyamulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam