నేనిదివరకే వెలువరించిన రెండు పుస్తకాలు 'ది గ్రేట్ బిట్రేయల్' మరియు 'కమ్యూనిటి మెధడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ వెల్త్ అండ్ క్యాపిటలిస్టిక్ మెధడ్ ఆఫ్ ప్రొడక్షన్ అఫ్ వెల్త్' లకు కేవలం కొనసాగింపుగానే ఈ పుస్తకం రాశాను. డబ్బు, మార్కెట్, మార్కెట్ శక్తులు, డిమాండ్, సప్లైల పైన గల అర్ధశాస్త్ర సిద్ధాంతాలు నేటి పరిస్థితులలో ఏమాత్రం వర్తించవనే నా భావనలను ఈ పుస్తకంలో నేను వ్యక్తపరిచాను.
దేశపు సంపద ఉత్పత్తి, సంపద చలామణి వాటితోపాటు ద్రవ్యనియంత్రణ అనేవి అతికొద్ది మంది చేతుల్లో చిక్కుకుపోయాయి. 110 కోట్ల భారతీయ జనాభాలో 90 శాతం భారతీయ సంపదను, గరిష్టంగా 1 లక్ష మంది పారిశ్రామికవేత్తలు నియంత్రిస్తుండవచ్చు. అలానే 90 శాతం ద్రవ్యాన్ని 40 నుండి 50 బ్యాంకులు నియంత్రిస్తుండవచ్చు. సంపద ఉత్పత్తిపై పారిశ్రామికవేత్తల గుత్తాధిపత్యాన్ని ఇది సృష్టపరుస్తుంది. అలాగే ద్రవ్య సంబంధ విషయాల్లో, అతికొద్ది బ్యాంకుల గుత్తాధిపత్యాన్ని ఇది ఎత్తి చూపుతుంది. ఇలాంటి పరిస్థితులలో ఆచరణలో అర్ధశాస్త్ర సిద్ధాంతాలు పనిచేయవు.
ఈ విషయంలో నా ఆలోచనలు ప్రజలకు చేరాలని, దీనిపై విస్తృత చర్చ జరగాలని నా తపన. దీన్ని స్వీకరించడం, నిరాకరించడం అనేది పాఠకుల విజ్ఞతకే వదిలివేస్తున్నాను.
- సిర్గాపూర్ విద్యాసాగర్ రెడ్డి
నేనిదివరకే వెలువరించిన రెండు పుస్తకాలు 'ది గ్రేట్ బిట్రేయల్' మరియు 'కమ్యూనిటి మెధడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ వెల్త్ అండ్ క్యాపిటలిస్టిక్ మెధడ్ ఆఫ్ ప్రొడక్షన్ అఫ్ వెల్త్' లకు కేవలం కొనసాగింపుగానే ఈ పుస్తకం రాశాను. డబ్బు, మార్కెట్, మార్కెట్ శక్తులు, డిమాండ్, సప్లైల పైన గల అర్ధశాస్త్ర సిద్ధాంతాలు నేటి పరిస్థితులలో ఏమాత్రం వర్తించవనే నా భావనలను ఈ పుస్తకంలో నేను వ్యక్తపరిచాను. దేశపు సంపద ఉత్పత్తి, సంపద చలామణి వాటితోపాటు ద్రవ్యనియంత్రణ అనేవి అతికొద్ది మంది చేతుల్లో చిక్కుకుపోయాయి. 110 కోట్ల భారతీయ జనాభాలో 90 శాతం భారతీయ సంపదను, గరిష్టంగా 1 లక్ష మంది పారిశ్రామికవేత్తలు నియంత్రిస్తుండవచ్చు. అలానే 90 శాతం ద్రవ్యాన్ని 40 నుండి 50 బ్యాంకులు నియంత్రిస్తుండవచ్చు. సంపద ఉత్పత్తిపై పారిశ్రామికవేత్తల గుత్తాధిపత్యాన్ని ఇది సృష్టపరుస్తుంది. అలాగే ద్రవ్య సంబంధ విషయాల్లో, అతికొద్ది బ్యాంకుల గుత్తాధిపత్యాన్ని ఇది ఎత్తి చూపుతుంది. ఇలాంటి పరిస్థితులలో ఆచరణలో అర్ధశాస్త్ర సిద్ధాంతాలు పనిచేయవు. ఈ విషయంలో నా ఆలోచనలు ప్రజలకు చేరాలని, దీనిపై విస్తృత చర్చ జరగాలని నా తపన. దీన్ని స్వీకరించడం, నిరాకరించడం అనేది పాఠకుల విజ్ఞతకే వదిలివేస్తున్నాను. - సిర్గాపూర్ విద్యాసాగర్ రెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.