ఈ కావ్యం వెనుక సంవత్సరాల పరిశోధన ఉంది. మేధామథనముంది. మనిషి కథనముంది. అనిర్వచనీయ ప్రకృతి ఆరాధన దాగుంది. విద్యాసాగర్ గొప్ప భావకుడు. ఇతడిది వసుధైక దృష్టి. మనిషికీ, మట్టికీ ఉన్న ప్రకృతి బంధాన్ని అనితర సాధ్యంగా కవిత్వీకరించాడు. సాగర్ కవిత్వం అత్యంత ఆధునికమూ, అంతే జానపదమూ, ఈయన వస్తు రూపాలు ఎంత ప్రాచీనమో అంతే నవీనమూ, సాగర్ వయక్తిక కవి కాదు. సామూహిక కవి.
సాగర్ ఆధునిక తెలుగు కవిత్వంలోకి కాలు మోపడంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇతడి అక్షరాల వెనుక బలమైన దళిత స్పృహ ఉంది. బహుజన దృక్పథమూ ఉంది. విశ్వశ్రేయ కవ్యాశయమూ ఉంది. ఇవాళ భారతీయ దళిత, బహుజన సాహిత్యం అంతగా పట్టించుకోని ప్రథానమైన పర్యావరణ కోణాన్ని సాగర్ మెలకువగా పట్టుకున్నాడు.
- ఎండ్లూరి సుధాకర్
వేదం అంటే 'జ్ఞానం'. భారత ఇతిహాసంలో భారతాన్ని పంచమవేదం అన్నారు. పరిసరవేదం వీటన్నిటికన్నా ప్రత్యేకమైనది. ఆ పరిసరవేదాన్ని ఆవిష్కరిస్తున్న 'మనిషోకడే విడిగా మానలేడు' అనేది ప్రేత్యేకమైన పుస్తకం. విచిత్రమైన సంగతేంటంటే మన చుట్టూతా ఉన్న ప్రపంచాన్ని ఒక్క నిమిషమైనా గమనించి, పరిసీలించలేనంత వేగంలో, తపస్సులో ఉండడం ఎంత అకృత్యం.
"పగటికి పగలు భోధ చేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. తెలియ శఖ్యమైనదేదో అది వారి మధ్య విశదమై యున్నది" అన్నట్లుగా వెలుగు ముఖం చూడనిష్టపడే వారికెవరికైనా ఈ ప్రకృతిలో పరిసరాల్లో ఎంత జీవశక్తి దాగి వుందో తెలుస్తుంది. కానీ చూడరు, చూసినా స్పందించారు, స్పందించినా ఆచరించరు, ఆచరించినా నమ్మరు. ఈ స్థితికి కారణం ఏమిటి? కేవలం మానవజాతికి మానవజాతి మీదనే కక్షా. దీని ముగింపు మానవజాతి అంతమేనా? మరోదేదైనా సరే అవుతే ఆశ్చర్యపోవాల్సిందేముంది?
అలాంటి పరిస్థితి రాకూడదని రచయిత అంగలారుస్తున్నాడు. ప్రకృతి తల్లి కన్న సుందరుడు, మేధావి అయిన మానవుడు కన్న తల్లిని ఎలా మట్టుపెడుతున్నాడో గమనించండి.
- డా.అంగళకుర్తి క్షామరేడు
ఈ కావ్యం వెనుక సంవత్సరాల పరిశోధన ఉంది. మేధామథనముంది. మనిషి కథనముంది. అనిర్వచనీయ ప్రకృతి ఆరాధన దాగుంది. విద్యాసాగర్ గొప్ప భావకుడు. ఇతడిది వసుధైక దృష్టి. మనిషికీ, మట్టికీ ఉన్న ప్రకృతి బంధాన్ని అనితర సాధ్యంగా కవిత్వీకరించాడు. సాగర్ కవిత్వం అత్యంత ఆధునికమూ, అంతే జానపదమూ, ఈయన వస్తు రూపాలు ఎంత ప్రాచీనమో అంతే నవీనమూ, సాగర్ వయక్తిక కవి కాదు. సామూహిక కవి. సాగర్ ఆధునిక తెలుగు కవిత్వంలోకి కాలు మోపడంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇతడి అక్షరాల వెనుక బలమైన దళిత స్పృహ ఉంది. బహుజన దృక్పథమూ ఉంది. విశ్వశ్రేయ కవ్యాశయమూ ఉంది. ఇవాళ భారతీయ దళిత, బహుజన సాహిత్యం అంతగా పట్టించుకోని ప్రథానమైన పర్యావరణ కోణాన్ని సాగర్ మెలకువగా పట్టుకున్నాడు. - ఎండ్లూరి సుధాకర్ వేదం అంటే 'జ్ఞానం'. భారత ఇతిహాసంలో భారతాన్ని పంచమవేదం అన్నారు. పరిసరవేదం వీటన్నిటికన్నా ప్రత్యేకమైనది. ఆ పరిసరవేదాన్ని ఆవిష్కరిస్తున్న 'మనిషోకడే విడిగా మానలేడు' అనేది ప్రేత్యేకమైన పుస్తకం. విచిత్రమైన సంగతేంటంటే మన చుట్టూతా ఉన్న ప్రపంచాన్ని ఒక్క నిమిషమైనా గమనించి, పరిసీలించలేనంత వేగంలో, తపస్సులో ఉండడం ఎంత అకృత్యం. "పగటికి పగలు భోధ చేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. తెలియ శఖ్యమైనదేదో అది వారి మధ్య విశదమై యున్నది" అన్నట్లుగా వెలుగు ముఖం చూడనిష్టపడే వారికెవరికైనా ఈ ప్రకృతిలో పరిసరాల్లో ఎంత జీవశక్తి దాగి వుందో తెలుస్తుంది. కానీ చూడరు, చూసినా స్పందించారు, స్పందించినా ఆచరించరు, ఆచరించినా నమ్మరు. ఈ స్థితికి కారణం ఏమిటి? కేవలం మానవజాతికి మానవజాతి మీదనే కక్షా. దీని ముగింపు మానవజాతి అంతమేనా? మరోదేదైనా సరే అవుతే ఆశ్చర్యపోవాల్సిందేముంది? అలాంటి పరిస్థితి రాకూడదని రచయిత అంగలారుస్తున్నాడు. ప్రకృతి తల్లి కన్న సుందరుడు, మేధావి అయిన మానవుడు కన్న తల్లిని ఎలా మట్టుపెడుతున్నాడో గమనించండి. - డా.అంగళకుర్తి క్షామరేడు© 2017,www.logili.com All Rights Reserved.