భారతీయ తత్త్వశాస్త్రాలగురించి తెలుగులో చాలా గ్రంధాలు అనాదిగా వస్తూనే ఉన్నాయి. డా. సర్వేపల్లి రాధాకృష్ణ గారి దగ్గరనుంచి నేటి వరకూ తెలుగులో ఎన్నో తత్త్వశాస్త్ర గ్రంధాలు వచ్చాయి. ఆ పరంపరలోదే శ్రీ అంబటిపూడి వెంకటరత్నం గారి షడ్దర్శనములు గ్రంథం. ఇది ఆంగ్ల గ్రంధానికి తెలుగు అనువాదం. పేరుకు అనువాద గ్రంథమైనా తెలుగుదనానికి ఎక్కడా లోటురాకుండా జాగ్రత్త పడ్డారు రచయిత. ఇది సాధారణ పాఠకులకన్నా తత్త్వశాస్త్రాన్ని ఒక ప్రత్యేక అధ్యయనాంశంగా ఎంపిక చేసుకున్న విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్ధులకు, పరిశోధకులకు బాగా ఉపయోగపడే గ్రంథం.
అంబటిపూడి వెంకటరత్నంగారు బహుగ్రంథ రచయిత. జగమెరిగిన బ్రాహ్మణుడు. స్వాతంత్య్ర పూర్వ, అనంతర సాహిత్యంలో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తుండేది. నేటి తరానికి వారి గ్రంధాలను తిరిగి అందుబాటులోకీ తేవాలని మేము సంకల్పించి ఈ బృహద్గ్రందాన్ని వెలువరిస్తున్నాము. ఇది తప్పక పాఠకుల ఆదరణ చూరగొంటుందని ఆశిస్తున్నాము.
అంబటిపూడి వెంతరత్నం (రచయిత గురించి) :
ప్రకాశం జిల్లా ఏదుబాడులో శ్రీమతి సుబ్బమ్మ శ్రీ సుబ్రహ్మణ్యం దంపతులకు జన్మించి చిన్నప్పటి నుండి సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల సాహిత్యాలను, వేదాంతశాస్త్రాన్ని చెళ్ళపిళ్ళవారు, వేలూరివారి సాన్నిధ్యంలో అభ్యసించిన ప్రతిభావంతుడు. ఎందరో శిష్యులను తీర్చిదిద్దిన వాత్సల్యమూర్తి.
1934వ సంవత్సరంలో నల్లగొండ జిల్లా చండూరు గ్రామంలో 'సాహితీమేఖల' ను స్థాపించారు. సాహిత్య వ్యాప్తికి దోహదం చేసే ఎందరో కవిపండితులకు ప్రేరకశక్తిగా నిలిచారు.
మహాకవి దాశరథి 'అగ్నిధార' చండూరులోనే ఆవిష్కరింపబడింది. నిరంతర సాహిత్య కృషివలుడిగా పేరుపొందిన వెంకటరత్నంగారు కొంతకాలం నల్లగొండలోని గీతావిజ్ఞానాంధ్ర కళాశాల ప్రిన్సిపాల్ గా పని చేశారు.
భారతీయ తత్త్వశాస్త్రాలగురించి తెలుగులో చాలా గ్రంధాలు అనాదిగా వస్తూనే ఉన్నాయి. డా. సర్వేపల్లి రాధాకృష్ణ గారి దగ్గరనుంచి నేటి వరకూ తెలుగులో ఎన్నో తత్త్వశాస్త్ర గ్రంధాలు వచ్చాయి. ఆ పరంపరలోదే శ్రీ అంబటిపూడి వెంకటరత్నం గారి షడ్దర్శనములు గ్రంథం. ఇది ఆంగ్ల గ్రంధానికి తెలుగు అనువాదం. పేరుకు అనువాద గ్రంథమైనా తెలుగుదనానికి ఎక్కడా లోటురాకుండా జాగ్రత్త పడ్డారు రచయిత. ఇది సాధారణ పాఠకులకన్నా తత్త్వశాస్త్రాన్ని ఒక ప్రత్యేక అధ్యయనాంశంగా ఎంపిక చేసుకున్న విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్ధులకు, పరిశోధకులకు బాగా ఉపయోగపడే గ్రంథం. అంబటిపూడి వెంకటరత్నంగారు బహుగ్రంథ రచయిత. జగమెరిగిన బ్రాహ్మణుడు. స్వాతంత్య్ర పూర్వ, అనంతర సాహిత్యంలో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తుండేది. నేటి తరానికి వారి గ్రంధాలను తిరిగి అందుబాటులోకీ తేవాలని మేము సంకల్పించి ఈ బృహద్గ్రందాన్ని వెలువరిస్తున్నాము. ఇది తప్పక పాఠకుల ఆదరణ చూరగొంటుందని ఆశిస్తున్నాము. అంబటిపూడి వెంతరత్నం (రచయిత గురించి) : ప్రకాశం జిల్లా ఏదుబాడులో శ్రీమతి సుబ్బమ్మ శ్రీ సుబ్రహ్మణ్యం దంపతులకు జన్మించి చిన్నప్పటి నుండి సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల సాహిత్యాలను, వేదాంతశాస్త్రాన్ని చెళ్ళపిళ్ళవారు, వేలూరివారి సాన్నిధ్యంలో అభ్యసించిన ప్రతిభావంతుడు. ఎందరో శిష్యులను తీర్చిదిద్దిన వాత్సల్యమూర్తి. 1934వ సంవత్సరంలో నల్లగొండ జిల్లా చండూరు గ్రామంలో 'సాహితీమేఖల' ను స్థాపించారు. సాహిత్య వ్యాప్తికి దోహదం చేసే ఎందరో కవిపండితులకు ప్రేరకశక్తిగా నిలిచారు. మహాకవి దాశరథి 'అగ్నిధార' చండూరులోనే ఆవిష్కరింపబడింది. నిరంతర సాహిత్య కృషివలుడిగా పేరుపొందిన వెంకటరత్నంగారు కొంతకాలం నల్లగొండలోని గీతావిజ్ఞానాంధ్ర కళాశాల ప్రిన్సిపాల్ గా పని చేశారు.© 2017,www.logili.com All Rights Reserved.