-ఆచార్య బి. తిరుపతిరావు
ద్రావిడ యూనివర్సిటి
అడిగోపుల వెంకటరత్నంగారు నాలుగు దశాబ్దాలు పైగా తెలుగు సాహిత్యంలో నిరంతరాయంగా కవిత్వం రాస్తున్నారు. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో ఆయనతో పాటు మనం కూడా కవిత్వ లోకంలో మెరిసి మాయం కావటం చూశాం. తాను మాత్రం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ప్రతి సామాజిక సందర్భాన్ని, సంక్షోభాన్ని తన కవిత్వంలో రికార్డు చేస్తూ వస్తున్నారు. గత నాలుగు దశాబ్దాల కాలంలో జరిగిన ఈ కీలక సందర్భం ఆయన కవిత్వం నుంచి తప్పించుకోలేక పోయింది. వర్తమాన సమాజంలో జరుగుతున్న దారుణాలను, సునాయాసంగా వ్యక్తులు, వ్యవస్థలు సృష్టిస్తున్న భీభత్సాలను ఎటువంటి సంకోచాలు లేకుండా ఆయన తన కవిత్వంలో ప్రతిఘటిస్తూ ఉన్నారు. సగటు వ్యక్తి బాధితుడు అవుతున్న ప్రతి సందర్భాన్ని ఆయన తన కవిత్వంలో నిరసించారు.
అత్యంత వైయక్తిక అనిపించే అంశాలను కూడా ఆయన సామాజిక నేపథ్యంలో విశ్లేషించుకుని మాత్రమే కవిత్వం రాస్తారు. అందుకనే ఆయన కవిత్వాన్ని ఒకానొక సామాజిక స్పృహ రికార్డు చేసిన సమగ్ర కవిత్వ డాక్యుమెంటుగా చూడాలి. కవిత్వం విశ్లేషణాత్మక పాత్ర చేయటం వల్ల ఆ కవిత్వంలో తర్కం పెరిగి కవిత్వం తగ్గుతుంది. ఈ స్పృహని వెంకటరత్నం గారు నిరంతరం నిలుపుకుంటూ వచ్చారు. ఆ విషయంలో సీమస్ హీనే అనే ఐర్లాండ్ కు చెందిన కవి లాగా వెంకటరత్నం గారూ ఆలోచిస్తారు హీనే ఇలా అంటాడు. “విశ్లేషణాత్మక క్రమంలో మనం ఆలోచించటం కాక భావుకత సానుభూతి పూర్వకంగా వుండాలి.”
వెంకటరత్నం గారి కవిత్వం ఉద్రేక పడాల్సిన సందర్భాల్లో కూడా సంయమనం కోల్పోకుండా ఉంటుంది. అయితే అంతర్లీనంగా కవిత్వంలో ఆవేశం నడుస్తూ ఉంటుంది. అసమ్మతి ప్రకటన అనివార్యంగా ఉంటుంది.
-ఆచార్య బి. తిరుపతిరావు ద్రావిడ యూనివర్సిటి అడిగోపుల వెంకటరత్నంగారు నాలుగు దశాబ్దాలు పైగా తెలుగు సాహిత్యంలో నిరంతరాయంగా కవిత్వం రాస్తున్నారు. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో ఆయనతో పాటు మనం కూడా కవిత్వ లోకంలో మెరిసి మాయం కావటం చూశాం. తాను మాత్రం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ప్రతి సామాజిక సందర్భాన్ని, సంక్షోభాన్ని తన కవిత్వంలో రికార్డు చేస్తూ వస్తున్నారు. గత నాలుగు దశాబ్దాల కాలంలో జరిగిన ఈ కీలక సందర్భం ఆయన కవిత్వం నుంచి తప్పించుకోలేక పోయింది. వర్తమాన సమాజంలో జరుగుతున్న దారుణాలను, సునాయాసంగా వ్యక్తులు, వ్యవస్థలు సృష్టిస్తున్న భీభత్సాలను ఎటువంటి సంకోచాలు లేకుండా ఆయన తన కవిత్వంలో ప్రతిఘటిస్తూ ఉన్నారు. సగటు వ్యక్తి బాధితుడు అవుతున్న ప్రతి సందర్భాన్ని ఆయన తన కవిత్వంలో నిరసించారు. అత్యంత వైయక్తిక అనిపించే అంశాలను కూడా ఆయన సామాజిక నేపథ్యంలో విశ్లేషించుకుని మాత్రమే కవిత్వం రాస్తారు. అందుకనే ఆయన కవిత్వాన్ని ఒకానొక సామాజిక స్పృహ రికార్డు చేసిన సమగ్ర కవిత్వ డాక్యుమెంటుగా చూడాలి. కవిత్వం విశ్లేషణాత్మక పాత్ర చేయటం వల్ల ఆ కవిత్వంలో తర్కం పెరిగి కవిత్వం తగ్గుతుంది. ఈ స్పృహని వెంకటరత్నం గారు నిరంతరం నిలుపుకుంటూ వచ్చారు. ఆ విషయంలో సీమస్ హీనే అనే ఐర్లాండ్ కు చెందిన కవి లాగా వెంకటరత్నం గారూ ఆలోచిస్తారు హీనే ఇలా అంటాడు. “విశ్లేషణాత్మక క్రమంలో మనం ఆలోచించటం కాక భావుకత సానుభూతి పూర్వకంగా వుండాలి.” వెంకటరత్నం గారి కవిత్వం ఉద్రేక పడాల్సిన సందర్భాల్లో కూడా సంయమనం కోల్పోకుండా ఉంటుంది. అయితే అంతర్లీనంగా కవిత్వంలో ఆవేశం నడుస్తూ ఉంటుంది. అసమ్మతి ప్రకటన అనివార్యంగా ఉంటుంది.© 2017,www.logili.com All Rights Reserved.