1993 లో వెలువడిన సూఫీ చెప్పిన కధ అనే ఈ నవల మలయాళ సాహిత్యంలో గొప్ప సంచలనం రేపింది. వస్తుపరంగానూ, భాషాపరంగానూ కొత్త పోకడలతో కూడిన ఈ నవల పాటకుల హృదయాలను ఆకట్టుకుంది. 2010 వరకు పది ముద్రణలు పొందింది ఈ నవల. అంతేకాదు, ఆంగ్ల, ఫ్రెంచ్, హిందీ, తమిళ, కన్నడ భాషల్లోకి అనువదింపబడి ఆయా భాషా పాటకుల మన్ననలు కూడా పొందింది. కేరళ సాహిత్య అకాడెమీ అవార్డ్ తో పాటు మరికొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు కూడా పొందిన ఈ నవలను తెలుగు పాటకలోకానికి అందించగలగడం నా అదృష్టం.
గుడియైనా, మసీదుయైనా మానవుని ఆధ్యాత్మిక అవసరాలను తీర్చే మార్గమనే స్పృహ కలుగుతుంది. విగ్రహారాధనను గౌరవించని వారు కూడా విగ్రహారాధన పట్ల వున్న వైమనస్యపు పట్టు సడలిస్తున్నారు. తెలియని ఒక సత్యం గురించిన ఆలోచన మనసులో ఒక వెలుగురేఖగా కదులుతుంది. కత్తులు నూరి గొడవపడడానికి సిద్దంగా నిలిచిన రెండు మతాల మధ్య అతిప్రాచీనమైన సహవర్తిత్వం ఉండేదని ఈ సూఫీ చెప్పేటప్పుడు ఏవేవో అడ్డుగోడలు కూలిపోతున్నాయి. ఈ సూక్ష్మ స్వరాన్ని మనకు వినబడే విధంగా వినిపించగలిగింది అనేదే ఈ నవల తాలూకు ధార్మిక ప్రసక్తి.
1993 లో వెలువడిన సూఫీ చెప్పిన కధ అనే ఈ నవల మలయాళ సాహిత్యంలో గొప్ప సంచలనం రేపింది. వస్తుపరంగానూ, భాషాపరంగానూ కొత్త పోకడలతో కూడిన ఈ నవల పాటకుల హృదయాలను ఆకట్టుకుంది. 2010 వరకు పది ముద్రణలు పొందింది ఈ నవల. అంతేకాదు, ఆంగ్ల, ఫ్రెంచ్, హిందీ, తమిళ, కన్నడ భాషల్లోకి అనువదింపబడి ఆయా భాషా పాటకుల మన్ననలు కూడా పొందింది. కేరళ సాహిత్య అకాడెమీ అవార్డ్ తో పాటు మరికొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు కూడా పొందిన ఈ నవలను తెలుగు పాటకలోకానికి అందించగలగడం నా అదృష్టం. గుడియైనా, మసీదుయైనా మానవుని ఆధ్యాత్మిక అవసరాలను తీర్చే మార్గమనే స్పృహ కలుగుతుంది. విగ్రహారాధనను గౌరవించని వారు కూడా విగ్రహారాధన పట్ల వున్న వైమనస్యపు పట్టు సడలిస్తున్నారు. తెలియని ఒక సత్యం గురించిన ఆలోచన మనసులో ఒక వెలుగురేఖగా కదులుతుంది. కత్తులు నూరి గొడవపడడానికి సిద్దంగా నిలిచిన రెండు మతాల మధ్య అతిప్రాచీనమైన సహవర్తిత్వం ఉండేదని ఈ సూఫీ చెప్పేటప్పుడు ఏవేవో అడ్డుగోడలు కూలిపోతున్నాయి. ఈ సూక్ష్మ స్వరాన్ని మనకు వినబడే విధంగా వినిపించగలిగింది అనేదే ఈ నవల తాలూకు ధార్మిక ప్రసక్తి.
© 2017,www.logili.com All Rights Reserved.