అనాదిగా చేపలు మానవుని ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. ఇటీవల చేపలకు ఎంతో ప్రాముఖ్యత పెరిగింది. చేపలలో పుష్కలంగా ఉండే పోషక విలువలు, హానికరమైన కొలెస్టరాల్ లేని ఆహారమవటం చేత, ఆరోగ్యరీత్యా అనేకమంది చేపలను ఆహారంగా తీసుకోవడం వలన నేడు మత్స్య పరిశ్రమకు ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది. దేశంలోని ఆహార కొరతను వ్యవసాయ అభివృద్ధితో పాటు, అందుబాటులో ఉన్న అన్ని జలవనరులను, నిరుపయోగ నేలలను ఉపయోగించి మత్స్య పరిశ్రమను మరింత ప్రోత్సాహించి 'నీలి విప్లవాన్ని' సాధించటం కూడా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందితే చేపల పెంపకందార్లే కాక దీనికి సంబంధించిన అనేక అనుబంధ రంగాల్లో ఉద్యోగ, వ్యాపార అవకాశాలు కూడా గణనీయంగా పెరగడం జరుగుతుంది.
రైతులను, విద్యార్థులను ముఖ్యంగా నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని ఈ పుస్తకాన్ని ప్రామాణికంగా వ్రాయడం జరిగింది. ఇది అందరికీ ఉపయోగపడే అనువైన మొదటి తెలుగు మల్టికలర్ పుస్తకంగా చెప్పుకోవచ్చు. ఈ పుస్తకాన్ని ఇంత కన్నా సమగ్రంగా తీర్చిదిద్దడానికి సహృదయంతో పాఠకులు సూచనలిస్తే కృతజ్ఞతతో స్వీకరించి పునర్ముద్రణలో వాటిని పరిగణనలోకి తీసుకోగలం. ఈ పుస్తక రచనకు అనుమతిచ్చిన తెలంగాణా రాష్ట మత్స్యశాఖ అదనపు సంచాలకులు గారికి నా కృతఙ్ఞతలు. అలాగే ప్రోత్సాహించిన మత్స్యశాఖ సిబ్బంది,పుస్తకాన్ని మల్టి కలర్ లో ముద్రించాలని ప్రత్యేక శ్రద్ధవహించిన "రైతునేస్తం పబ్లికేషన్స్" వెంకటేశ్వరరావు గారికి నా ప్రత్యేక కృతఙ్ఞతలు. ఈ పుస్తకం మంచినీటి చేపల రైతులు, ఈ పరిశ్రమను ఎంచుకునే ఔత్సాహికులు మత్స్యశాఖ సిబ్బంది, విస్తరాణాధికారులు, విద్యార్థులకు ఉపకరించగలదని ఆశిస్తున్నాను.
- బి లక్ష్మప్ప
అనాదిగా చేపలు మానవుని ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. ఇటీవల చేపలకు ఎంతో ప్రాముఖ్యత పెరిగింది. చేపలలో పుష్కలంగా ఉండే పోషక విలువలు, హానికరమైన కొలెస్టరాల్ లేని ఆహారమవటం చేత, ఆరోగ్యరీత్యా అనేకమంది చేపలను ఆహారంగా తీసుకోవడం వలన నేడు మత్స్య పరిశ్రమకు ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది. దేశంలోని ఆహార కొరతను వ్యవసాయ అభివృద్ధితో పాటు, అందుబాటులో ఉన్న అన్ని జలవనరులను, నిరుపయోగ నేలలను ఉపయోగించి మత్స్య పరిశ్రమను మరింత ప్రోత్సాహించి 'నీలి విప్లవాన్ని' సాధించటం కూడా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందితే చేపల పెంపకందార్లే కాక దీనికి సంబంధించిన అనేక అనుబంధ రంగాల్లో ఉద్యోగ, వ్యాపార అవకాశాలు కూడా గణనీయంగా పెరగడం జరుగుతుంది. రైతులను, విద్యార్థులను ముఖ్యంగా నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని ఈ పుస్తకాన్ని ప్రామాణికంగా వ్రాయడం జరిగింది. ఇది అందరికీ ఉపయోగపడే అనువైన మొదటి తెలుగు మల్టికలర్ పుస్తకంగా చెప్పుకోవచ్చు. ఈ పుస్తకాన్ని ఇంత కన్నా సమగ్రంగా తీర్చిదిద్దడానికి సహృదయంతో పాఠకులు సూచనలిస్తే కృతజ్ఞతతో స్వీకరించి పునర్ముద్రణలో వాటిని పరిగణనలోకి తీసుకోగలం. ఈ పుస్తక రచనకు అనుమతిచ్చిన తెలంగాణా రాష్ట మత్స్యశాఖ అదనపు సంచాలకులు గారికి నా కృతఙ్ఞతలు. అలాగే ప్రోత్సాహించిన మత్స్యశాఖ సిబ్బంది,పుస్తకాన్ని మల్టి కలర్ లో ముద్రించాలని ప్రత్యేక శ్రద్ధవహించిన "రైతునేస్తం పబ్లికేషన్స్" వెంకటేశ్వరరావు గారికి నా ప్రత్యేక కృతఙ్ఞతలు. ఈ పుస్తకం మంచినీటి చేపల రైతులు, ఈ పరిశ్రమను ఎంచుకునే ఔత్సాహికులు మత్స్యశాఖ సిబ్బంది, విస్తరాణాధికారులు, విద్యార్థులకు ఉపకరించగలదని ఆశిస్తున్నాను. - బి లక్ష్మప్ప© 2017,www.logili.com All Rights Reserved.