చెన్నపట్నం, చెరుకుముక్క
నీకోముక్క, నాకో ముక్క
భీమునిపట్నం, బిందేలజోడు
నీకో బిందె, నాకో బిందె:
కాళీపట్నం కాసుల జోడు
నీకో కాసు, నాకో కాసు
ఏడవకు ఏడవకు వెర్రి అమ్మాయి
ఏడిస్తే నీకళ్ళు నీలాలు కారు
నీలాలు కారితే నే చూడలేను
పాలైన కారవే బంగారు కనుల
పిల్లి రావే పిల్లి పిల్లల తల్లి
పల్లేరు ముళ్ళల్లో పడవేసి పోవే
బాలలలో ఉల్లాసాన్ని, ఆనందాన్ని, భాషా జ్ఞానాన్ని, జ్ఞాపకశక్తిని పెంచే వెయ్యి గేయాల కదంబమాల.
- బిడ్డల మనసెరిగిన కన్నతల్లులు, అమ్మమ్మలు, నాయనమ్మలు పాపాలను అడించేప్పుడు అలవోకగా పాడే ఉగ్గు పాటలు, జోల పాటలు, లాలి పాటల వలన మన తోలి బాల సాహిత్యానికి సాకారం ఈ గ్రంధం.
- ఆటల పాటలు, పండుగ పాటలు, ఎగతాళి పాటలు, తొక్కు పలుకులు - ఇలా పలు రీతులలో, బాణీలలో ఉండే ఆణిముత్యాల సమాహారం ఈ సంపుటం.
- ఇవి బాలల్లో జ్ఞాపకశక్తినీ, సృజనాత్మక శక్తినీ, భాషా నైపుణ్యాన్ని పెంచి చదువు పట్ల ఆసక్తి కలిగిస్తాయి. ఆనందంతో మనసును ఊయల లుగిస్తాయి.
- ఇవి తెలుగు వారి సంస్కృతీ విజయ పరంపరకు తరతరాలుగా, ప్రతీకలుగా నిలుస్తున్నాయి.
రచయిత గురించి
- బాల సాహిత్యంపై పరిశోధన చేసి ఆంధ్ర విశ్వకళా పరిషత్ నుంచి డాక్టరేట్ డిగ్రీ, స్వర్ణ పతక స్వీకరణ.
- బాలల కోసం 50 గ్రంధాల రచన, సుమారు 200 గ్రంధాలకు సంపాదకత్వం. 300 చార్టుల తయారీ.
- బాలల అకాడమీ(ప్రభుత్వ సంస్థ) నుంచి బాలబంధు పురస్కార స్వీకారం.
- సమాచార విజ్ఞాన నిపుణులు, బహు విషయ పరిజ్ఞాని.
- వీరి కృషికి గుర్తింపుగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ, మద్రాసు తెలుగు
అకాడమీ, ఢిల్లీ తెలుగు అకాడమీల పురస్కారాలను అందుకున్న విదగ్దులు.
చెన్నపట్నం, చెరుకుముక్క నీకోముక్క, నాకో ముక్క భీమునిపట్నం, బిందేలజోడు నీకో బిందె, నాకో బిందె: కాళీపట్నం కాసుల జోడు నీకో కాసు, నాకో కాసు ఏడవకు ఏడవకు వెర్రి అమ్మాయి ఏడిస్తే నీకళ్ళు నీలాలు కారు నీలాలు కారితే నే చూడలేను పాలైన కారవే బంగారు కనుల పిల్లి రావే పిల్లి పిల్లల తల్లి పల్లేరు ముళ్ళల్లో పడవేసి పోవే బాలలలో ఉల్లాసాన్ని, ఆనందాన్ని, భాషా జ్ఞానాన్ని, జ్ఞాపకశక్తిని పెంచే వెయ్యి గేయాల కదంబమాల. - బిడ్డల మనసెరిగిన కన్నతల్లులు, అమ్మమ్మలు, నాయనమ్మలు పాపాలను అడించేప్పుడు అలవోకగా పాడే ఉగ్గు పాటలు, జోల పాటలు, లాలి పాటల వలన మన తోలి బాల సాహిత్యానికి సాకారం ఈ గ్రంధం. - ఆటల పాటలు, పండుగ పాటలు, ఎగతాళి పాటలు, తొక్కు పలుకులు - ఇలా పలు రీతులలో, బాణీలలో ఉండే ఆణిముత్యాల సమాహారం ఈ సంపుటం. - ఇవి బాలల్లో జ్ఞాపకశక్తినీ, సృజనాత్మక శక్తినీ, భాషా నైపుణ్యాన్ని పెంచి చదువు పట్ల ఆసక్తి కలిగిస్తాయి. ఆనందంతో మనసును ఊయల లుగిస్తాయి. - ఇవి తెలుగు వారి సంస్కృతీ విజయ పరంపరకు తరతరాలుగా, ప్రతీకలుగా నిలుస్తున్నాయి. రచయిత గురించి - బాల సాహిత్యంపై పరిశోధన చేసి ఆంధ్ర విశ్వకళా పరిషత్ నుంచి డాక్టరేట్ డిగ్రీ, స్వర్ణ పతక స్వీకరణ. - బాలల కోసం 50 గ్రంధాల రచన, సుమారు 200 గ్రంధాలకు సంపాదకత్వం. 300 చార్టుల తయారీ. - బాలల అకాడమీ(ప్రభుత్వ సంస్థ) నుంచి బాలబంధు పురస్కార స్వీకారం. - సమాచార విజ్ఞాన నిపుణులు, బహు విషయ పరిజ్ఞాని. - వీరి కృషికి గుర్తింపుగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ, మద్రాసు తెలుగు అకాడమీ, ఢిల్లీ తెలుగు అకాడమీల పురస్కారాలను అందుకున్న విదగ్దులు.© 2017,www.logili.com All Rights Reserved.