కొందరు ఒరవడి పెడతారు. ఎందరో వారిని అనుసరిస్తారు. ఒరవడి పెట్టిన వారిది బడి. అనుసరించిన వారికా బడే గుడి. అలా కవిత్వంలో విశ్వనాధ వారిదో బడి, శ్రీశ్రీదో బడి. కధా రచనలో మల్లాది వారిదో బడి, కొడవటిగంటి వారిదో బడి. అలాగే నేర పరిశోధనల్లో డిటెక్టివ్ వెంకన్నదో బడి.
నేర విదానానికి సంబంధించిన డిటెక్టివ్ వెంకన్న ప్రత్యేకత ఏమిటో ఈ కధలలో తెలుస్తుంది. వెంకన్న కుటుంబ సంవిధానం, వృత్తి విధానం, నేర నిదానం పట్ల లోతైన అవగాహన కలిగించే ఈ పరిశోధనలు ఎక్కువగా మధ్యతరగతి జీవితాల చుట్టూ తిరుగుతాయి.
ఈ భూమ్మీద జీవులకి అనుకూలమైన వాతావరణం ఉన్నట్లే, మన సమాజంలో నేరాల్ని ప్రోత్సహించే వాతావరణముంది. మనకి ఉన్న చట్టలేమో - నేరస్తుల్ని శిక్షించడమే నేరాల్ని అరికట్టడమనుకుంటాయి. మన సమాజంలో ఉన్న రెండు ప్రపంచాలకీ ఉన్న అంతరం కొంతయినా తగ్గేదాకా, మనమీ పద్దతి మార్చాలి. నేరాల్ని అరికట్టడం మనకి ప్రధానం కావాలి. నేరస్తుణ్ణి సంస్కరించి మనిషిని చెయ్యడానికి ప్రయత్నించాలి.
అలా స్పురించిన పాత్ర డిటెక్టివ్ వెంకన్న. కానీ రూపు దిద్దుకుందుకు, ఆ తరహ సాహిత్యాన్ని పోత్సహించే ప్రముఖ పత్రికలు లేవప్పుడు.అపన(అపరాధ పరిశోధన) మాసపత్రికలో 1975 నుంచి మా రచనలు వరుసగా రాసాగేక - కాస్త దైర్యం చేసి 1979లో వెంకన్న పాత్రను కొన్ని మా రచనలు ప్రవేశపెడితే లభించిన పాటకుల స్పందన అనూహ్యం.
మా 'అపన' కధలు కొన్నింటికి మలి సంపుటీకరణ ఇది. ఇందులో 1982 నుంచి 1988 వరకు ప్రచురించిన 8 కధలున్న సంపుటి.
-వసుంధర
కొందరు ఒరవడి పెడతారు. ఎందరో వారిని అనుసరిస్తారు. ఒరవడి పెట్టిన వారిది బడి. అనుసరించిన వారికా బడే గుడి. అలా కవిత్వంలో విశ్వనాధ వారిదో బడి, శ్రీశ్రీదో బడి. కధా రచనలో మల్లాది వారిదో బడి, కొడవటిగంటి వారిదో బడి. అలాగే నేర పరిశోధనల్లో డిటెక్టివ్ వెంకన్నదో బడి. నేర విదానానికి సంబంధించిన డిటెక్టివ్ వెంకన్న ప్రత్యేకత ఏమిటో ఈ కధలలో తెలుస్తుంది. వెంకన్న కుటుంబ సంవిధానం, వృత్తి విధానం, నేర నిదానం పట్ల లోతైన అవగాహన కలిగించే ఈ పరిశోధనలు ఎక్కువగా మధ్యతరగతి జీవితాల చుట్టూ తిరుగుతాయి. ఈ భూమ్మీద జీవులకి అనుకూలమైన వాతావరణం ఉన్నట్లే, మన సమాజంలో నేరాల్ని ప్రోత్సహించే వాతావరణముంది. మనకి ఉన్న చట్టలేమో - నేరస్తుల్ని శిక్షించడమే నేరాల్ని అరికట్టడమనుకుంటాయి. మన సమాజంలో ఉన్న రెండు ప్రపంచాలకీ ఉన్న అంతరం కొంతయినా తగ్గేదాకా, మనమీ పద్దతి మార్చాలి. నేరాల్ని అరికట్టడం మనకి ప్రధానం కావాలి. నేరస్తుణ్ణి సంస్కరించి మనిషిని చెయ్యడానికి ప్రయత్నించాలి. అలా స్పురించిన పాత్ర డిటెక్టివ్ వెంకన్న. కానీ రూపు దిద్దుకుందుకు, ఆ తరహ సాహిత్యాన్ని పోత్సహించే ప్రముఖ పత్రికలు లేవప్పుడు.అపన(అపరాధ పరిశోధన) మాసపత్రికలో 1975 నుంచి మా రచనలు వరుసగా రాసాగేక - కాస్త దైర్యం చేసి 1979లో వెంకన్న పాత్రను కొన్ని మా రచనలు ప్రవేశపెడితే లభించిన పాటకుల స్పందన అనూహ్యం. మా 'అపన' కధలు కొన్నింటికి మలి సంపుటీకరణ ఇది. ఇందులో 1982 నుంచి 1988 వరకు ప్రచురించిన 8 కధలున్న సంపుటి. -వసుంధర© 2017,www.logili.com All Rights Reserved.