ఎగిరే క్లాసు రూమ్
- ఎరిక్ కాస్ట్ నర్
సుప్రసిద్ధ జర్మన్ రచయిత ఎరిక్ కాస్ట్ నర్ 1933 లో పిల్లల కోసం రాసిన నవల దాస్ ఫ్లేయిజేండే క్లాసెస్ (ఫ్లయింగ్ క్లాస్ రూమ్ ) కు తెలుగు అనువాదమిది. బోర్డింగ్ పాటశాలలో చదువుకొనే పిల్లల జీవన చిత్రాన్ని ఆవిష్కరించే ఈ నవలలో క్రిస్టమస్ డ్రామా, పిల్లల , ఉపాధ్యాయుల అనుభవాలు,అనుభూతులు హృదయానికి హత్తుకొనేలా చిత్రించబడ్డాయి. మధ్య మధ్య పెద్దలు చేసే యుద్దాల మీదా,జాతీయవాదం మీద, దేశభక్తి మీదా చేసిన వ్యాఖ్యానాలు చెణుకులూ పాటకులను తీవ్రంగా ఆలోచింపజేస్తాయి. జర్మనీలో నాజీలు ఇంకా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోక ముందు ఎరిక్ కాస్ట్ నర్ రాసిన చివరి రచన యిది. అయితే ఇందులో నాజీల గురించిన ప్రస్తావన ఎక్కడా స్పష్టంగా లేకపోయినప్పటికీ నవల నేపద్యంలో కనిపించే ఆర్ధిక సంక్షోభ పరిస్థితులు,తీవ్ర నిరుద్యోగ సమస్య వంటివి జర్మన్ ఓటర్లు హిట్లర్ వైపు గంపగుత్తగా మొగ్గు చూపడానికి ఏవిధంగా దోహదం చేశాయో చాటి చెబుతాయి.
నాజీలనుంచి అడుగడుగునా ఇబ్బందులు ఎదురయ్యే రోజుల్లో ఎరిక్ కాస్ట్ నర్ (౧౮౯౯ –౧౯౭౪ ) పిల్లల కోసం ఇలాంటి నవలలు రాయడం విశేషం. నాజీలు అధికారంలోకి వచ్చీ రాగానే ఈ పుస్తక ప్రతులను తగులబెట్టారు. కాస్ట్ నర్ అనేక విధాలుగా వేధింపులకు గురిచేసారు.
సునిశితమైన హాస్యం, బోర్డింగ్ పాటశాల జీవితం, గొడవలు, ఉద్రేకాలు, ఉద్వేగాలు, నాటకీయత, పాటశాల విద్యార్థుల మధ్య కనిపించే స్నేహమాధుర్యం ..... అన్నింటి మించి “ బాల్యాన్ని మరచిపోకండి” అనే ఉదాత్తమైన సందేశం పాటకుల మనసుపై చెరగని ముద్ర వేస్తాయి. పిల్లలు, తల్లితండ్రులు, విద్యారంగంలో పనిచేసేవాళ్ళు ఈ పుస్తకాన్ని అందరి కంటే మిన్నగా ఆస్వాదించగలుగుతారు.
ఎగిరే క్లాసు రూమ్ - ఎరిక్ కాస్ట్ నర్ సుప్రసిద్ధ జర్మన్ రచయిత ఎరిక్ కాస్ట్ నర్ 1933 లో పిల్లల కోసం రాసిన నవల దాస్ ఫ్లేయిజేండే క్లాసెస్ (ఫ్లయింగ్ క్లాస్ రూమ్ ) కు తెలుగు అనువాదమిది. బోర్డింగ్ పాటశాలలో చదువుకొనే పిల్లల జీవన చిత్రాన్ని ఆవిష్కరించే ఈ నవలలో క్రిస్టమస్ డ్రామా, పిల్లల , ఉపాధ్యాయుల అనుభవాలు,అనుభూతులు హృదయానికి హత్తుకొనేలా చిత్రించబడ్డాయి. మధ్య మధ్య పెద్దలు చేసే యుద్దాల మీదా,జాతీయవాదం మీద, దేశభక్తి మీదా చేసిన వ్యాఖ్యానాలు చెణుకులూ పాటకులను తీవ్రంగా ఆలోచింపజేస్తాయి. జర్మనీలో నాజీలు ఇంకా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోక ముందు ఎరిక్ కాస్ట్ నర్ రాసిన చివరి రచన యిది. అయితే ఇందులో నాజీల గురించిన ప్రస్తావన ఎక్కడా స్పష్టంగా లేకపోయినప్పటికీ నవల నేపద్యంలో కనిపించే ఆర్ధిక సంక్షోభ పరిస్థితులు,తీవ్ర నిరుద్యోగ సమస్య వంటివి జర్మన్ ఓటర్లు హిట్లర్ వైపు గంపగుత్తగా మొగ్గు చూపడానికి ఏవిధంగా దోహదం చేశాయో చాటి చెబుతాయి. నాజీలనుంచి అడుగడుగునా ఇబ్బందులు ఎదురయ్యే రోజుల్లో ఎరిక్ కాస్ట్ నర్ (౧౮౯౯ –౧౯౭౪ ) పిల్లల కోసం ఇలాంటి నవలలు రాయడం విశేషం. నాజీలు అధికారంలోకి వచ్చీ రాగానే ఈ పుస్తక ప్రతులను తగులబెట్టారు. కాస్ట్ నర్ అనేక విధాలుగా వేధింపులకు గురిచేసారు. సునిశితమైన హాస్యం, బోర్డింగ్ పాటశాల జీవితం, గొడవలు, ఉద్రేకాలు, ఉద్వేగాలు, నాటకీయత, పాటశాల విద్యార్థుల మధ్య కనిపించే స్నేహమాధుర్యం ..... అన్నింటి మించి “ బాల్యాన్ని మరచిపోకండి” అనే ఉదాత్తమైన సందేశం పాటకుల మనసుపై చెరగని ముద్ర వేస్తాయి. పిల్లలు, తల్లితండ్రులు, విద్యారంగంలో పనిచేసేవాళ్ళు ఈ పుస్తకాన్ని అందరి కంటే మిన్నగా ఆస్వాదించగలుగుతారు.© 2017,www.logili.com All Rights Reserved.