నవల అన్న ప్రక్రియ నుంచి ‘సినిమా’ ప్రక్రియలోకి ‘ఏకవీర’ను తేవడానికి ముందే మరికొన్ని నవలలు సినీరచయితలు
తెచ్చారు. గొల్లపూడి మారుతీరావు, యద్దనపూడి సులోచనారాణిగారలను రవీంద్రభారతి మెట్ల మీద (అప్పటికి నిర్మాణం
పూర్తికాలేదు) కూర్చుండబెట్టుకొని, మధుసూదనరావుగారు (ప్రఖ్యాత దర్శకుడు) చక్రభ్రమణం అన్న కోడూరి కౌసల్యాదేవి
నవలలోని మర్మాలను తెలుపుతూ ఒకరిచేత డా.చక్రవర్తి సినిమాకు చిత్రకథను (స్క్రీన్‌ప్లే), మరొకరితో సంభాషణలను
రాయించిన వైనం మారుతీరావుగారే నాకు స్వయంగా చెప్పారు. (అప్పుడు (1964) వారి ఇంటికి చాలా దగ్గరలోనే నేనూ
ఉండడం తటస్థించింది.) ఆ రకంగా రెండు అంతరాలుగా ఒక నవల తెరమీదకు ఎక్కించడంలో ఉన్న కష్టనష్టాలు కొంత
తెలిసాయి.