పరమ పవిత్రమైన ఈ భారతదేశమందే కాక ఇతర దేశములందుకూడా ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు దేవతాప్రతిష్ఠలు నేడు విశేషముగా జరుగుచున్నవి. ఇట్టి క్రతువులు అనేక శతములు చేయించిన పుణ్యపురుషులు మపరమపూజ్యగురు దేవులు వేదమూర్తులైన బ్రహ్మశ్రీ మేడిచర్ల పాపాధాన్లుగారు. వారు ఆంధ్ర దేశముననే కాక యావద్భారత దేశములోగల అనేక పుణ్యక్షేత్రములలో వివిధ దేవతాప్రతిష్ఠలు, యాగములు నిర్వహించి ఆనాటి విద్వాంసులు మన్ననలు పొందిన మహనీయులు.
వారు 1910 వ సంవత్సరములో జన్మించి 1926 నుండి ఈ దేవతాప్రతిష్ఠా యాగాదులు నిర్వహించుచూ 96 సంవత్సరములు జీవించిన పవిత్ర చరిత్రులు. పరమ పవిత్రమైన పిఠాపురము పాదగయా క్షేత్రములో 1916 వ సంవత్సరములో కోటి రుద్రయాగము వివిధ దేవతా ప్రతిష్ఠలు జరుగగా అపుడు వేదమూర్తులైన మా పరమ గురువులు శ్రీ పెండ్యాల మహాదేవ అవధాని గారు, ఆ క్రతువులకు ఆధ్వర్యము వహించి ప్రాచీన తాళపత్ర గ్రంథములలోగల ఈ కల్పముతో క్రతు నిర్వహణ గావించి అప్పటి పిఠాపురం సంస్థానములో గల మహామహులైన ఎందరో పండితుల నుంచి ప్రశంసలు పొందినట్లు మాగురుదేవులు శ్రీ రావూరి లక్ష్మీ నారాయణ అవధాన్లు గారు తెలిపినారు.
- శ్రీ కళా సత్యనారాయణ శర్మ అవధాని