ఇందులో మూడు పుస్తకాలు కలవు. అవి రంగురంగుల కోడిపుంజు, నేను కూడా.., కోపదారి పిల్లి.
రంగు రంగుల కోడిపుంజు లో మిషా ఒక పుంజు బొమ్మను వేశాడు. కానీ దానికి రంగులు వేయటం మరిచిపోయాడు. పుంజు షికారుకు బయలుదేరగా అక్కడ ఒక కుక్క దానికి చూసి, "చూడు, ఎలా ఉన్నావో? నీకసలు రంగులే లేవు!" అని అంది. పుంజు చెరువు దగ్గరకు వెళ్లి నీళ్ళల్లో తనను తాను చూసుకుంది. నిజంగానే తనకు రంగులు లేవని తెలుసుకుంది. ఇక కుక్క ఆశ్చర్యపోవటంలో వింత ఏమీలేదు.
నేను కూడా... లో ఒక బాతుపిల్ల గుడ్డు నుంచి పొదిగింది. "నేను గుడ్డు నుంచి బయటకి వచ్చాను" అంది బాతు పిల్ల. "నేను కూడా!" అంది కోడి పిల్ల. "నేను అలా షికారుకు వెళుతున్నాను" అంది బాతుపిల్ల. "నేను కూడా" అంది కోడిపిల్ల.
కోపదారి పిల్లి లో ఒక పాప దగ్గర కూర్చుని బొమ్మలు గీస్తోంది. అటుగా వచ్చిన చారలపిల్లి ఒకటి ఆమెను గమనిస్తూ ఉంది. "నీకోసం ఒక ఇల్లు తయారు చేస్తున్నాను. ఇదిగో! ఇది పై కప్పు, ఇదేమో పొగ గొట్టం, మరి ఇదేమో తలుపు", అంది ఆ అమ్మాయి. "నేను అక్కడ ఏం చేయాలి?". "నువ్వు ఒక పొయ్యి పెట్టుకుని జావ కాయాలి," అని ఆ అమ్మాయి చెప్పింది. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకాలలోని కథలను చదవండి.
ఇందులో మూడు పుస్తకాలు కలవు. అవి రంగురంగుల కోడిపుంజు, నేను కూడా.., కోపదారి పిల్లి. రంగు రంగుల కోడిపుంజు లో మిషా ఒక పుంజు బొమ్మను వేశాడు. కానీ దానికి రంగులు వేయటం మరిచిపోయాడు. పుంజు షికారుకు బయలుదేరగా అక్కడ ఒక కుక్క దానికి చూసి, "చూడు, ఎలా ఉన్నావో? నీకసలు రంగులే లేవు!" అని అంది. పుంజు చెరువు దగ్గరకు వెళ్లి నీళ్ళల్లో తనను తాను చూసుకుంది. నిజంగానే తనకు రంగులు లేవని తెలుసుకుంది. ఇక కుక్క ఆశ్చర్యపోవటంలో వింత ఏమీలేదు. నేను కూడా... లో ఒక బాతుపిల్ల గుడ్డు నుంచి పొదిగింది. "నేను గుడ్డు నుంచి బయటకి వచ్చాను" అంది బాతు పిల్ల. "నేను కూడా!" అంది కోడి పిల్ల. "నేను అలా షికారుకు వెళుతున్నాను" అంది బాతుపిల్ల. "నేను కూడా" అంది కోడిపిల్ల. కోపదారి పిల్లి లో ఒక పాప దగ్గర కూర్చుని బొమ్మలు గీస్తోంది. అటుగా వచ్చిన చారలపిల్లి ఒకటి ఆమెను గమనిస్తూ ఉంది. "నీకోసం ఒక ఇల్లు తయారు చేస్తున్నాను. ఇదిగో! ఇది పై కప్పు, ఇదేమో పొగ గొట్టం, మరి ఇదేమో తలుపు", అంది ఆ అమ్మాయి. "నేను అక్కడ ఏం చేయాలి?". "నువ్వు ఒక పొయ్యి పెట్టుకుని జావ కాయాలి," అని ఆ అమ్మాయి చెప్పింది. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకాలలోని కథలను చదవండి.© 2017,www.logili.com All Rights Reserved.