పాత్రికేయుడు ఒక చరిత్రకారుడు. అతడు ఆయా సంఘటనలకు ప్రత్యక్ష సాక్షి. కాలాన్ని బంధించి తన రచనల్లో ఇమిడ్చి జనాలకు అందించే వరకు అతడిలో ఒక ఆర్తి వెంటాడుతుంది. పాఠకుల స్పందనతో పాత్రికేయుని దాహార్తి తీరుతుంది. ఈ నేపథ్యంలో మూడున్నర దశాబ్దాల అనుభవ సారమే ఈ వ్యాస సంపుటి. ఒక్కో సంఘటనపై విశ్లేషణలు, తెరవెనుక ఉండే వెలుగు రేకలు ఇందులో ఆవిష్కృతమవుతాయి. ఎవివి ప్రసాద్ వృత్తి, ప్రవృత్తి రెండూ రచనా వ్యాసంగమే. మూడున్నర దశాబ్దాల పాత్రికేయంలో రచించిన వ్యాసాలు ఐదువేలు పైనే. సాహిత్యం, రాజకీయం, సామాజికం.. ఇలా అన్ని విభిన్న రంగాలలో విస్తృతంగా గల అధ్యయనం.
అవగాహనలను రంగరించి చేసిన విశ్లేషణలలో కొన్ని ఈ వ్యాసాలు. ప్రసాద్ విశ్లేషణాత్మక వ్యాసాలు దాదాపుగా అన్ని ప్రముఖ దినపత్రికలూ. డెక్కన్ క్రానికల్ వంటి ఇంగ్లీషు దినపత్రికల్లో 1980 నుంచి ప్రచురితమవుతూనే ఉన్నాయి. వారి సంపాదకత్వంలో కొన్ని గ్రంథాలు కూడా పాఠకులకు పరిచయం అయ్యాయి. సమకాలీన అంశాలను నిశితంగా పరిశీలించడం, సందర్భానుగుణంగా విశ్లేషించడం ఆయన రచనల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఆయన రచించిన కొన్ని వేల రచనల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాలతో కూర్చిన సంపుటి ఇది.