ఒక సాధారణమైన పల్లెటూళ్ళో, నాలుగు ఎకరాల ముప్పై, సెంట్లు వున్న సామాన్యమైన రైతు ఇంట్లో మేము పుట్టాం. మా తల్లిదండ్రులకి చదువు లేదు. అయినా వాళ్ళ కడుపున పుట్టిన మేము ఈ రోజు ఇంతవాళ్ళమయ్యామంటే అది వారి చలవే. అంటే వాళ్ళకి లేని చదువు మాకు వుండాలనే జిజ్ఞాసతో వాళ్ళు కష్టపడి చదివించారు. ఒకసారి మా అమ్మ గురించిన వ్యాసంలో 'ఈ తల్లే లేకపోతే అక్షరాలే రాకపోను' అని రాశాను. నాన్న - అమ్మల్లో, తన బిడ్డలు బాగా చదువుకోవాలి అనే బలీయమైన కోరిక అమ్మకి బాగా వుండేది. ఎన్నో ఒడిదుడుకుల్ని కష్టనష్టాలని ఎదుర్కొని ఆవిడ మమ్మల్ని చదివించింది. మా అమ్మ ఎప్పుడూ ఒక విషయం బాధపడుతూ చెప్పేవారు.
ఒకసారి మా బంధువులకు చెందిన ఒకావిడ మా ఇంటికి వచ్చి, మా అన్నయ్యలిద్దర్నీ ఉయ్యాలలో పడుకున్న పరుచూరి గోపాలకృష్ణ అనే నన్ను చూసి 'చక్కగా నీకు ముగ్గురు మగపిల్లలు. ముగ్గురు కూలికి వెళ్ళి మూడు కుంచాల బియ్యం తెస్తే ఒక కుంచం వండుకోవచ్చు. రెండు కుంచాలు దాచుకోవచ్చు' అందట. ఆ మాటలు అమ్మని బాగా కలిచివేశాయి. అందుకే ఎప్పుడు సందర్భం వచ్చినా ఆ విషయం గుర్తు చేసుకుని 'మిమ్మల్ని కూలివాళ్ళన్నారు. మీరు చదువుకుని ప్రయోజకులవ్వాలి' అంటూ వుండేది.
- పరుచూరి సోదరుల హృదయ లేఖనం