ఈ పుస్తకం 1954లో ఏర్పడిన భారత జాతీయ మహిళా సమాఖ్య అంటే నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమన్ (ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యు.) ప్రారంభ చరిత్రను వివరిస్తుంది. మహిళల సమానత్వానికి కట్టుబడి ఉన్న అనేక మంది ప్రగతిశీల వ్యక్తులను, సంస్థలను ఎలా ఒకచోట చేర్చి సమైక్యం చేసిందో తెలియచేస్తుంది. ఆ తరువాతి సంవత్సరాల్లో, ఇది అతిపెద్ద, దేశవ్యాప్త విస్తృత స్థాయి సామూహిక మహిళా వేదికగా ఉద్భవించింది, ఇది భారతదేశ స్వాతంత్ర్యం తరువాత దశాబ్దాలలో గణనీయ స్థాయిలో మహిళా ఉద్యమాన్ని నిర్మించింది.
ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యు. ఏర్పడిన చరిత్ర స్వాతంత్య్రానికి పూర్వం నాటిది. జాతీయ, అంతర్జాతీయ పరిణామాల ఫలితంగా రూపుదిద్దుకొన్నది. ప్రత్యేకించి, 1940ల ప్రారంభంలో అనేక ప్రాంతీయ సామూహిక మహిళా సంస్థల పుట్టుకను గుర్తించవచ్చు. ముఖ్యంగా బెంగాల్లోని మహిళా ఆత్మరక్షణ సమితి (MARS), పంజాబ్లోని లోక్ స్త్రీ సభతో పాటు ఆంధ్ర మహిళా సంఘం, ఢిల్లీ మహిళా సంఘం, కేరళ మహిళా సంఘం. ఈ సంస్థలు ఎక్కువగా కమ్యూనిస్టు మహిళల చొరవతో ఏర్పాటయ్యాయి. తరువాత భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యు. ) గా ఏర్పడిన ప్రధాన సంస్థకు అనుబంధ యూనిట్లుగా మారాయి. ఈ ప్రాంతీయ సంస్థలు రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో భారతదేశంలోని తూర్పు ప్రాంతాలపై జరిగిన జపాన్ బాంబు దాడి, అదే సమయంలో వచ్చిన కరువు, ఆహార సంక్షోభానికి ప్రతిస్పందనగా ఉద్భవించాయి. బెంగాల్లో మహిళా ఆత్మరక్షణ సమితి మొట్టమొదటగా స్థాపించబడిన సంస్థ. దీని సభ్యులు బెంగాల్ కరువుతో బాధపడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించడానికి పనిచేశారు, సరసమైన ధరల దుకాణాలను తెరవడం, సరుకుల నిల్వదార్ల నుండి ఆహార నిల్వలను విడుదల చేయడం, వంటశాలల ఏర్పాటు కోసం నిరంతర ఆందోళనలు నిర్వహించడం, వైద్య సహాయం, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం మొదలైన కార్యక్రమాలను చేపట్టారు. మహిళా ఆత్మరక్షణ సమితి సంస్థను అనుసరిస్తూ ఇతర రాష్ట్రాల్లోని కమ్యూనిస్టు మహిళలు కరువు, ఆహార కొరతపై రాజకీయ ప్రచారం చేయడం..................
ఈ పుస్తకం 1954లో ఏర్పడిన భారత జాతీయ మహిళా సమాఖ్య అంటే నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమన్ (ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యు.) ప్రారంభ చరిత్రను వివరిస్తుంది. మహిళల సమానత్వానికి కట్టుబడి ఉన్న అనేక మంది ప్రగతిశీల వ్యక్తులను, సంస్థలను ఎలా ఒకచోట చేర్చి సమైక్యం చేసిందో తెలియచేస్తుంది. ఆ తరువాతి సంవత్సరాల్లో, ఇది అతిపెద్ద, దేశవ్యాప్త విస్తృత స్థాయి సామూహిక మహిళా వేదికగా ఉద్భవించింది, ఇది భారతదేశ స్వాతంత్ర్యం తరువాత దశాబ్దాలలో గణనీయ స్థాయిలో మహిళా ఉద్యమాన్ని నిర్మించింది. ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యు. ఏర్పడిన చరిత్ర స్వాతంత్య్రానికి పూర్వం నాటిది. జాతీయ, అంతర్జాతీయ పరిణామాల ఫలితంగా రూపుదిద్దుకొన్నది. ప్రత్యేకించి, 1940ల ప్రారంభంలో అనేక ప్రాంతీయ సామూహిక మహిళా సంస్థల పుట్టుకను గుర్తించవచ్చు. ముఖ్యంగా బెంగాల్లోని మహిళా ఆత్మరక్షణ సమితి (MARS), పంజాబ్లోని లోక్ స్త్రీ సభతో పాటు ఆంధ్ర మహిళా సంఘం, ఢిల్లీ మహిళా సంఘం, కేరళ మహిళా సంఘం. ఈ సంస్థలు ఎక్కువగా కమ్యూనిస్టు మహిళల చొరవతో ఏర్పాటయ్యాయి. తరువాత భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యు. ) గా ఏర్పడిన ప్రధాన సంస్థకు అనుబంధ యూనిట్లుగా మారాయి. ఈ ప్రాంతీయ సంస్థలు రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో భారతదేశంలోని తూర్పు ప్రాంతాలపై జరిగిన జపాన్ బాంబు దాడి, అదే సమయంలో వచ్చిన కరువు, ఆహార సంక్షోభానికి ప్రతిస్పందనగా ఉద్భవించాయి. బెంగాల్లో మహిళా ఆత్మరక్షణ సమితి మొట్టమొదటగా స్థాపించబడిన సంస్థ. దీని సభ్యులు బెంగాల్ కరువుతో బాధపడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించడానికి పనిచేశారు, సరసమైన ధరల దుకాణాలను తెరవడం, సరుకుల నిల్వదార్ల నుండి ఆహార నిల్వలను విడుదల చేయడం, వంటశాలల ఏర్పాటు కోసం నిరంతర ఆందోళనలు నిర్వహించడం, వైద్య సహాయం, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం మొదలైన కార్యక్రమాలను చేపట్టారు. మహిళా ఆత్మరక్షణ సమితి సంస్థను అనుసరిస్తూ ఇతర రాష్ట్రాల్లోని కమ్యూనిస్టు మహిళలు కరువు, ఆహార కొరతపై రాజకీయ ప్రచారం చేయడం..................© 2017,www.logili.com All Rights Reserved.