కవి, కథకుడు, నాటకకర్త, నవలా రచయిత, విమర్శకుడు కవిసమ్రాట్ నోరి నరసింహశాస్త్రి. సృజనాత్మక రచయితలు విమర్శకులు కూడా అయిన సందర్భాలు తక్కువే. అందునా ప్రాచీన. ఆధునిక సాహిత్యాలు రెండింటినీ విశ్లేషించి, విమర్శించగలిగిన కొద్దిమంది గొప్ప విమర్శకులలో నరసింహశాస్త్రి గారొకరు.
శాస్త్రి గారికి కవిత్రయ సాహితిపై అపారమైన అభిమానం. నన్నయ, తిక్కన, ఎర్రనలు ఆయన విమర్శలో అధికభాగాన్ని ఆక్రమించారు.
ఆధునిక కవిత్వ వికాసానికి శాస్త్రిగారు సాక్షి, సాహితీ సమితి, నవ్యసాహిత్య పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలలో క్రియాశీలంగా కృషి చేసినందువల్ల సమకాలిక కవులనూ, కవిత్వాన్నీ అతిసన్నిహితంగా ఆయన చూశారు. వాస్తవానికి ఆయన ఆ కవుల్లో ఒకడు. అందువల్ల అయన విమర్శలో ఆధునిక కవిత్వం సింహభాగాన్ని ఆక్రమించింది.
ఆర్షధర్మ దృష్టి, సంప్రదాయాభిరుచి, జాతీయాభిమానం పెనవేసుకున్న నోరి నరసింహశాస్త్రి గారి వ్యాస సర్వస్వం ఇది.
- డా. డి. చంద్రశేఖర రెడ్డి