అదొక లోకం.
జాబిల్లి తారల చుక్కలు పెట్టి వెన్నెల ముగ్గులు వేస్తోంది. పారిజాతాల ఘుమఘుమలు పరిమళాలు నింపుతున్నాయి. పక్షుల కువకువలు నేపధ్య సంగీతం సమకూర్చుతున్నాయి.
ఆ సంగీతానికి సరిధీటుగా అలసిపోయేదాకా నాట్యం చేసిన అందాలరాణి సిండ్రెల్లా - తన పొడవాటి గులాబిగౌను కుచ్చిళ్ళు జాగ్రత్తగా ఎత్తిపట్టుకొని, తన కుడిచేతిని రాకుమారుడికి సుతారంగా అందించింది. ఆవిడ గాజుజోళ్ళు ఛమక్మంటోంటే వయ్యారంగా ముందుకు కదిలింది. సన్నగా వీస్తోన్న గాలిలోని పలుచని సువాసనకు పరవశమవుతూ వారు సెలయేటి ఒడ్డుకు వచ్చి కూర్చున్నారు.
అప్పటికే స్నోవైట్, గోల్డీలాక్, స్లీపింగ్ బ్బ్యూటీ, రాకుమారులు, రాకుమార్తెలు మరుగుజ్జు మిత్రులు... అంతా వచ్చేసారు. తమ జెన్నీ భూతంలో సహా అల్లావుద్దీన్ - జాస్మిన్ వచ్చేసారు.
ఇంతలో సిందాబాద్-గలీవర్ రావడంతో - అప్పటిదాకా కబుర్లు చెప్పుకుంటోన్న వాళ్ళంతా - ఆ సాహసవీరుల వైపు దృష్టి సారించారు. ఆశ్చర్యంతో పెద్దవుతోన్న కుసుమకోమలుల కళ్ళ మెరుపులకు మురిసిపోయి.. ఆ సాహసవీరులు ఛాతీలు విరుచుకొన్నారు. గొంతులు సవరించుకొన్నారు. పోటీలు పడుతూ ఉత్సాహంగా తమతమ సాహసాలు ఏకరువు పెట్టసాగారు. అయితే, ఈ విషయాల్లో వీరందరికన్నా అదృష్టవంతుణ్ణి తనేనన్నాడు అప్పుడే వచ్చిన మారుఫ్.
ఇంతలో సరిమువ్వ గజ్జెలు ఘల్లుఘల్లు మన్నాయి. చేత వెన్న ముద్దతో చిన్ని వేణువుతో బుడిబుడి నడకల బుజ్జికృష్ణుడు - అతని వెనకనే ఓ చిట్టి గట్టి గదను మోస్తూ బాలభీముడు రానే వచ్చారు.
వీళ్ళందరినీ ఒక్కసారిగా చూసిన సంతోషంలో బోసినవ్వులు నవ్వుతూ వెన్నెల చెట్టు కింద ముసలమ్మ వడివడిగా రాట్నం వడుకుతోంది. ఆవిడ పెంపుడు కుందేలు అటూ ఇటూ గెంతులు పెడుతోంది....................
అదొక లోకం. జాబిల్లి తారల చుక్కలు పెట్టి వెన్నెల ముగ్గులు వేస్తోంది. పారిజాతాల ఘుమఘుమలు పరిమళాలు నింపుతున్నాయి. పక్షుల కువకువలు నేపధ్య సంగీతం సమకూర్చుతున్నాయి. ఆ సంగీతానికి సరిధీటుగా అలసిపోయేదాకా నాట్యం చేసిన అందాలరాణి సిండ్రెల్లా - తన పొడవాటి గులాబిగౌను కుచ్చిళ్ళు జాగ్రత్తగా ఎత్తిపట్టుకొని, తన కుడిచేతిని రాకుమారుడికి సుతారంగా అందించింది. ఆవిడ గాజుజోళ్ళు ఛమక్మంటోంటే వయ్యారంగా ముందుకు కదిలింది. సన్నగా వీస్తోన్న గాలిలోని పలుచని సువాసనకు పరవశమవుతూ వారు సెలయేటి ఒడ్డుకు వచ్చి కూర్చున్నారు. అప్పటికే స్నోవైట్, గోల్డీలాక్, స్లీపింగ్ బ్బ్యూటీ, రాకుమారులు, రాకుమార్తెలు మరుగుజ్జు మిత్రులు... అంతా వచ్చేసారు. తమ జెన్నీ భూతంలో సహా అల్లావుద్దీన్ - జాస్మిన్ వచ్చేసారు. ఇంతలో సిందాబాద్-గలీవర్ రావడంతో - అప్పటిదాకా కబుర్లు చెప్పుకుంటోన్న వాళ్ళంతా - ఆ సాహసవీరుల వైపు దృష్టి సారించారు. ఆశ్చర్యంతో పెద్దవుతోన్న కుసుమకోమలుల కళ్ళ మెరుపులకు మురిసిపోయి.. ఆ సాహసవీరులు ఛాతీలు విరుచుకొన్నారు. గొంతులు సవరించుకొన్నారు. పోటీలు పడుతూ ఉత్సాహంగా తమతమ సాహసాలు ఏకరువు పెట్టసాగారు. అయితే, ఈ విషయాల్లో వీరందరికన్నా అదృష్టవంతుణ్ణి తనేనన్నాడు అప్పుడే వచ్చిన మారుఫ్. ఇంతలో సరిమువ్వ గజ్జెలు ఘల్లుఘల్లు మన్నాయి. చేత వెన్న ముద్దతో చిన్ని వేణువుతో బుడిబుడి నడకల బుజ్జికృష్ణుడు - అతని వెనకనే ఓ చిట్టి గట్టి గదను మోస్తూ బాలభీముడు రానే వచ్చారు. వీళ్ళందరినీ ఒక్కసారిగా చూసిన సంతోషంలో బోసినవ్వులు నవ్వుతూ వెన్నెల చెట్టు కింద ముసలమ్మ వడివడిగా రాట్నం వడుకుతోంది. ఆవిడ పెంపుడు కుందేలు అటూ ఇటూ గెంతులు పెడుతోంది....................© 2017,www.logili.com All Rights Reserved.