పచాస్ సాల్ బాద్
(యాభై ఏళ్ళ తరువాత)
కొన్ని జ్ఞాపకాలు మరిచిపోలేం. జీవితంపైన చెరగని సంతకంలా నిలిచిపోతాయి. అవి ఎన్నటికీ చెరిగిపోవు. బతికినంత కాలం వెంటాడుతూనే ఉంటాయి. కొన్ని వేటాడుతూనూ ఉంటాయి. ముఖ్యంగా బాల్యపు జ్ఞాపకాలు.
'బార్ బార్ ఆతీహై ముజ్కో మధుర్ యాద్
బచన్.. గయా గయాతో జీవన్, సబ్సీ మస్త్ కుషీ మస్త్'
'మేరా నయాబచ్చన్' గీతంలోని తొలి చరణాలు. కవయిత్రి సుభద్రకుమారీ చౌహాన్ రాసిన గీతం ఇది. హైస్కూల్ పాఠ్యాంశంగా చదువుకున్న ఈ హిందీ గీతాన్నీ ఎలా మర్చిపోలేనో, బాల్యాన్ని కూడా అలానే మర్చిపోలేను.
నిజమే!
అది ఎన్నటికీ మరచిపోలేని మందహాసం.
వనపర్తి వదిలేసి (2023 జులై 25 నాటికి) యాభై ఏళ్ళు పూర్తైంది. వనపర్తి ఇప్పుడెలా ఉందో!? పదేళ్ళ క్రితం తిరుపతిలో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కాను. రైలు ఎక్కినప్పటి నుంచి ఒకటే ఉత్కంఠ! ఎన్ని ఆలోచనలో! బెర్త్ పైన పడుకున్నానే కానీ, ఒక పట్టాన నిద్ర పట్టలేదు. ఏ అర్ధరాత్రి నిద్రలోకి జారుకున్నాను.
నిద్రలోంచి ఉలిక్కి పడి లేచి చూస్తే తెల్లవారు జామున మూడైంది. గబగబా దిగి తలుపు దగ్గరకు వెళుతుంటే రైల్వే పోలీస్ ఎదురు పడ్డాడు. తెల్లగా, కాస్త పొట్టిగా ఉన్నాడు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన మంగోలాయిడ్ ముఖం.
"కిదర్ ఉతర్నేకా హై సాబ్' అడిగాడు.............
పచాస్ సాల్ బాద్ (యాభై ఏళ్ళ తరువాత) కొన్ని జ్ఞాపకాలు మరిచిపోలేం. జీవితంపైన చెరగని సంతకంలా నిలిచిపోతాయి. అవి ఎన్నటికీ చెరిగిపోవు. బతికినంత కాలం వెంటాడుతూనే ఉంటాయి. కొన్ని వేటాడుతూనూ ఉంటాయి. ముఖ్యంగా బాల్యపు జ్ఞాపకాలు. 'బార్ బార్ ఆతీహై ముజ్కో మధుర్ యాద్ బచన్.. గయా గయాతో జీవన్, సబ్సీ మస్త్ కుషీ మస్త్' 'మేరా నయాబచ్చన్' గీతంలోని తొలి చరణాలు. కవయిత్రి సుభద్రకుమారీ చౌహాన్ రాసిన గీతం ఇది. హైస్కూల్ పాఠ్యాంశంగా చదువుకున్న ఈ హిందీ గీతాన్నీ ఎలా మర్చిపోలేనో, బాల్యాన్ని కూడా అలానే మర్చిపోలేను. నిజమే! అది ఎన్నటికీ మరచిపోలేని మందహాసం. వనపర్తి వదిలేసి (2023 జులై 25 నాటికి) యాభై ఏళ్ళు పూర్తైంది. వనపర్తి ఇప్పుడెలా ఉందో!? పదేళ్ళ క్రితం తిరుపతిలో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కాను. రైలు ఎక్కినప్పటి నుంచి ఒకటే ఉత్కంఠ! ఎన్ని ఆలోచనలో! బెర్త్ పైన పడుకున్నానే కానీ, ఒక పట్టాన నిద్ర పట్టలేదు. ఏ అర్ధరాత్రి నిద్రలోకి జారుకున్నాను. నిద్రలోంచి ఉలిక్కి పడి లేచి చూస్తే తెల్లవారు జామున మూడైంది. గబగబా దిగి తలుపు దగ్గరకు వెళుతుంటే రైల్వే పోలీస్ ఎదురు పడ్డాడు. తెల్లగా, కాస్త పొట్టిగా ఉన్నాడు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన మంగోలాయిడ్ ముఖం. "కిదర్ ఉతర్నేకా హై సాబ్' అడిగాడు.............© 2017,www.logili.com All Rights Reserved.