వినాయకుని అజీర్తి
వినాయకుని కడుపు ఆనందంతో పొంగిపోయింది. ఎందుకంటే చవితి వచ్చేస్తోంది. పాపం ఉండ్రాళ్ళు, కుడుములు తిని ఏడాది అవుతోంది. ఈ కైలాసం కొండలపై మంచుబెడ్డలు తప్పించి వేడి కుడుములు లభించవు. సరైన వాయిద్యాలు లేని డాడీ డ్యాన్స్ తప్పించి రికార్డింగ్ డ్యాన్స్లు కన్పించవు. బోర్ బోర్. మరి భూలోకంలో అయితే నవరాత్రులైనా ఘనరాత్రులే. సంవత్సరానికి సరిపడా ఆహారాన్ని, ఆనందాన్ని ఇచ్చే అద్భుత రాత్రులే. ఏదిఏమైనా భూలోక వైభవం ఆ స్వర్గానికి రాదు. ఈ కైలాసానికి రాదు. ఎప్పుడూ వెరైటీ మారని అమృతం. ఇక్కడ నిత్యమూ నంది అరుపులు, మంచి పాట తలపే ఉండదు. భూలోకంలో ఎన్ని వంటకాలని ... ఏ సంవత్సరానికా సంవత్సరం కొత్తవంటలు కూడా పుట్టిస్తున్నారు. అక్కడి ఫైవ్ స్టార్ కుక్స్. వాటి పేర్లు వారికే గుర్తుంటాయో లేదో. ఆలూ వడ, గుండెల్లో దడ.. ఇలా ఎన్నో వంటలు. అక్కడ సినీకవులు పాటలు అక్షరాల్లో ఏమి పెట్టి రాస్తారోగానీ ఆ పాటలకు కదలలేని నేనూ స్టెప్ వేయవలసిందే. ఇక్కడ బృహస్పతికి అయినా అంత బుర్రేది ?
ఇలా ఊహల్లో ఉండగానే వినాయక చవితి వచ్చేసింది. ముందురోజు ఎలక్కి బాగా మేపి తను మాత్రం ఉపవాసం ఉన్నాడు. అందుకు కారణం ఉంది. గత చవితికి మమ్మీ, డాడీ దారిలో తినమని చెరుకుగడలు, వెలక్కాయలు ఇచ్చారు. ఆ నాటుసరుకు ఆకలి తగ్గించటం వలన తను సరిగ్గా తినలేకపోయాడు. ఇప్పుడు ఏమీ తినకుండా ఆకలితో వెళితే అక్కడి రకాలు అన్నీ ఆరగించవచ్చు..............
వినాయకుని అజీర్తి వినాయకుని కడుపు ఆనందంతో పొంగిపోయింది. ఎందుకంటే చవితి వచ్చేస్తోంది. పాపం ఉండ్రాళ్ళు, కుడుములు తిని ఏడాది అవుతోంది. ఈ కైలాసం కొండలపై మంచుబెడ్డలు తప్పించి వేడి కుడుములు లభించవు. సరైన వాయిద్యాలు లేని డాడీ డ్యాన్స్ తప్పించి రికార్డింగ్ డ్యాన్స్లు కన్పించవు. బోర్ బోర్. మరి భూలోకంలో అయితే నవరాత్రులైనా ఘనరాత్రులే. సంవత్సరానికి సరిపడా ఆహారాన్ని, ఆనందాన్ని ఇచ్చే అద్భుత రాత్రులే. ఏదిఏమైనా భూలోక వైభవం ఆ స్వర్గానికి రాదు. ఈ కైలాసానికి రాదు. ఎప్పుడూ వెరైటీ మారని అమృతం. ఇక్కడ నిత్యమూ నంది అరుపులు, మంచి పాట తలపే ఉండదు. భూలోకంలో ఎన్ని వంటకాలని ... ఏ సంవత్సరానికా సంవత్సరం కొత్తవంటలు కూడా పుట్టిస్తున్నారు. అక్కడి ఫైవ్ స్టార్ కుక్స్. వాటి పేర్లు వారికే గుర్తుంటాయో లేదో. ఆలూ వడ, గుండెల్లో దడ.. ఇలా ఎన్నో వంటలు. అక్కడ సినీకవులు పాటలు అక్షరాల్లో ఏమి పెట్టి రాస్తారోగానీ ఆ పాటలకు కదలలేని నేనూ స్టెప్ వేయవలసిందే. ఇక్కడ బృహస్పతికి అయినా అంత బుర్రేది ? ఇలా ఊహల్లో ఉండగానే వినాయక చవితి వచ్చేసింది. ముందురోజు ఎలక్కి బాగా మేపి తను మాత్రం ఉపవాసం ఉన్నాడు. అందుకు కారణం ఉంది. గత చవితికి మమ్మీ, డాడీ దారిలో తినమని చెరుకుగడలు, వెలక్కాయలు ఇచ్చారు. ఆ నాటుసరుకు ఆకలి తగ్గించటం వలన తను సరిగ్గా తినలేకపోయాడు. ఇప్పుడు ఏమీ తినకుండా ఆకలితో వెళితే అక్కడి రకాలు అన్నీ ఆరగించవచ్చు..............© 2017,www.logili.com All Rights Reserved.