పిల్లల పై భారాన్ని తగ్గించడం నాణ్యమైన విద్యను అందించడం అనే విషయం ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. స్వాతంత్ర్యానంతరం దేశంలో విద్యారంగంలో సంస్కరణలు సూచించటానికి ఏర్పాటయిన పలు కమిటీలు ఈ దిశగా అనేక ప్రతిపాదనలు చేశాయి. ప్రత్యేకించి గత నాలుగు దశాబ్దాల కాలాన్ని పరిగణలోకి తీసుకొని చూసిన ఈశ్వభాయ్ పటేల్ కమిటీ మొదలు జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం వరకు పిల్లలపై భారాన్ని తగ్గించే అంశం పై రకరకాల సూచనలు, సలహాలు చేశాయి. ఇందులో యశ్ పాల్ కమిటీ ఒక మైలురాయిగా చెప్పవచ్చు. పిల్లలపై భారాన్ని తగ్గించటం, నాణ్యమైన విద్యను అందించటం అనే అంశాల పై ఎంతో విలువైన సమాచారం ఈ రిపోర్ట్ లో పొందుపరిచారు. - డా. దేశినేని వెంకటేశ్వర రావు