సాహితీ సమరాంగణ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు భారతదేశ చక్రవర్తులలో మేటి ప్రభువు. సువిశాల కర్ణాటక సామ్రాజ్యాన్ని సుస్థిరంగా ఏలాడమేగాక ఆముక్త మర్యాద, జాంబవతీ కల్యాణాదులు రాసి ఒక మహాకవిగా తెలుగు సాహిత్యంలో శాశ్వతమైన కీర్తిని ప్రతిష్ఠించుకొన్నాడు. తెలుగు సాహిత్య చరిత్రలో ఈ ప్రభువు కాలాన్ని స్వర్ణయుగమని నిర్ధరించారు.
గ్రంథ రచయిత కీ. శే. అడపా రామకృష్ణారావు గారు తెలుగు సాహిత్యం క్షుణ్ణంగా తెలిసినవారు. ఆంగ్లంలో రచయితగా రాణించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంగ్ల శాఖలో ఆచార్యులుగా పని చేసినారు.
అనువాదకులు డా. సంగనభట్ల నరసయ్యగారు సంస్కృతాంధ్రాoగ్ల హిందీ భాషల్లో విద్వాంసులు. ఛందో వ్యాకరణాలంకార శాస్త్రాల్లో, ప్రాచీన సంస్కృతాంధ్ర సాహిత్యాల్లో, చరిత్ర రచనలో నిష్ణాతులు. ధర్మపురి సంస్కృతాంధ్ర కళాశాలలో ప్రచార్యులుగా పనిచేసి, ప్రస్తుతం పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో సందర్శనాచార్యులుగా పనిచేస్తున్నారు.
- అడపా రామకృష్ణారావు