శ్రీపతిగారి కథల గూర్చి కొత్తగా ఎవరూ పరిచయం చేయనక్కరలేదు. ఆ అవసరం కూడా లేదు. ఈ సంకలనంలో చివరి కథ ప్రచురణ సంవత్సరం గమనించండి. 1956 అంటే ఏమన్నమాట! అరవై ఏళ్ళనాటి నుంచి ఈ నా సన్మిత్రులు కథలు రాస్తూనే ఉన్నారు. అంటే ఆయన కథారచనకు వెరసి ఇది వజ్రోత్సవ సంవత్సరమన్నమాట. ఉరఫ్ కథా శ్రీపతిత్వానికి షష్టిపూర్తి జరుపుకోవచ్చు నన్నమాట! వచ్చునేమిటి?! జరపవలసిన సందర్భమని చెప్పాలన్నమాట. శ్రీపతిగారు ఆర్ద్రమతి. భావుకచిత్తుడు. అన్నిటా కళాత్మక దృష్టి ప్రసవింపచేయగల హృదయమార్దవం పుష్కలంగా ఈయన కథలలో కనపడుతుంది. తక్కిన మన తరం కథా రచయితలలో ఇది అరుదుగా పొడకడుతుందనే చెప్పాలి. ఒక రకంగా చుస్తే నూరుగురిలో ఆయన ఒకడు. ఇంకొకరకంగా బేరీజు వేస్తే వందమందిలో ఆయన ఒక్కడే. సంగీతం, చిత్రలేఖనం, వర్ణచిత్రకళాకృతి రామణీయాస్వాదన ప్రవృత్తి, ప్రకృతి సౌందర్య తాదాత్మ్యత శ్రీపతి కథలలో ప్రస్తావితమైనట్లు, ఆయన సమకాలీన కథారచయితలలో ఇంతగా ప్రముఖ స్థానం వహించవు. - శ్రీపతి