చరిత్ర పునర్నిర్మాణానికి జీవిత చరిత్రలెంతగానో తోడ్పడతాయి. గతకాలపు ఘనతలను ఒక చారిత్రిక వ్యక్తి జీవిత గమనం ద్వారా గ్రహించి కొత్త తరానికి అందచేయటం వీటి ప్రధాన ధ్యేయం. కేవలం సమాచార సంపన్నతతో కూడినవే గాకుండా ఇప్పటి సమాజానికి స్పూర్తిదాయకంగానూ ఉంటాయి. స్వీయ జీవిత చరిత్రల సందర్భం వేరు. అవి ఆయా వ్యక్తిమాత్రుల దృక్కోణం నుండి వివరించిన వారి జీవిత సందర్భాలు. వాటిలో వ్యక్తిగత పక్షపాతానికి అవకాశమెక్కువ. వాటి దృష్టి, దృక్కోణాలు వేర్వేరుగా ఉంటాయి. జీవిత చరిత్రలు కొన్ని సందర్భాల్లో వాస్తవికత, సమతూకపు స్థాయిని దాటి, మహాత్ముల జీవిత చరిత్రల స్థాయిని సంతరించుకుంటాయి. దీంతో చరిత్ర వక్రీకరించబడుతుంది. నిజానిజాలు బయల్పడవు. అలాగే ఈ పుస్తకం వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడి గారి జీవిత చరిత్ర.
- పొత్తూరి వెంకటేశ్వరరావు
చరిత్ర పునర్నిర్మాణానికి జీవిత చరిత్రలెంతగానో తోడ్పడతాయి. గతకాలపు ఘనతలను ఒక చారిత్రిక వ్యక్తి జీవిత గమనం ద్వారా గ్రహించి కొత్త తరానికి అందచేయటం వీటి ప్రధాన ధ్యేయం. కేవలం సమాచార సంపన్నతతో కూడినవే గాకుండా ఇప్పటి సమాజానికి స్పూర్తిదాయకంగానూ ఉంటాయి. స్వీయ జీవిత చరిత్రల సందర్భం వేరు. అవి ఆయా వ్యక్తిమాత్రుల దృక్కోణం నుండి వివరించిన వారి జీవిత సందర్భాలు. వాటిలో వ్యక్తిగత పక్షపాతానికి అవకాశమెక్కువ. వాటి దృష్టి, దృక్కోణాలు వేర్వేరుగా ఉంటాయి. జీవిత చరిత్రలు కొన్ని సందర్భాల్లో వాస్తవికత, సమతూకపు స్థాయిని దాటి, మహాత్ముల జీవిత చరిత్రల స్థాయిని సంతరించుకుంటాయి. దీంతో చరిత్ర వక్రీకరించబడుతుంది. నిజానిజాలు బయల్పడవు. అలాగే ఈ పుస్తకం వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడి గారి జీవిత చరిత్ర. - పొత్తూరి వెంకటేశ్వరరావు© 2017,www.logili.com All Rights Reserved.