ఈ పుస్తకంలోని కథలు ఆధ్యాత్మికతను వెల్లడి చేస్తూ, సందేశాత్మకంగా ఉండటం విశేషం. ఎన్ని తరాలు మారినా ఏమాత్రం మారనిది... ఇప్పుడే వికసించిన పువ్వులా తాజాదనం చిందిస్తూ ఉండేది ప్రేమ. కులాలు,మతాలు, ఆస్తులు, అంతస్తులు, పేద ధనిక తేడాలు లేనిది ప్రేమ. ఎన్ని కథలొచ్చినా, ఎన్ని నవలలొచ్చినా, ఎన్ని సినిమాలొచ్చినా ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తుంది...పాఠకుణ్ణి లేదా ప్రేక్షకుణ్ణి మైమరిపింపజేస్తుంది ప్రేమ కథాంశం. 'శబరి' గేయనాటిక డా. భాస్కరాచార్య త్రిపాఠి గారి రచనకు తెలుగు అనువాదం.
'రాధిక వసంతమాసం' - ఒక స్త్రీ విషాద గాధ. 'ఇది కథ కాదు' - పురుషాహంకార దుష్ఫలితాల మీద చెప్పిన కథ. మహిళలు ఎప్పుడూ సహనశీలురే. అమృత హృదయులే. మారవలసింది మగవారు. 'జీవనది', 'సారీ అమ్మా', 'రామచరిత మానస్' ఇవన్నీ ప్రేమ తీరాలలో విహరింపజేసే చక్కటి కథలు. వీటితోపాటు ఆధ్యాత్మిక కథలు కూడా ఉన్నాయి - 'మాతృప్రేమ', 'త్యాగనిరతికి సంకేతం - స్త్రీ', 'కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు', 'జ్ఞాననిధులు-మన గ్రంథాలు', 'ఆనందానుభూతి', 'యశోద స్వగతం' మొదలగు కథలను సంబోధకంగా, సందేశాత్మకంగా, దృశ్యమానంగా చెప్పటం వసుమతి గారిలోని విలక్షణ లక్షణం.
ఎనిమిది పదుల వయసులో సాహితి యాగానికి ఆధ్వర్యం వహిస్తూ...
జీవదీపాలు వెలిగించాలనే తపన తీరక గ్రంధ రచనానుబంధాలు పెంచుకుంటూ...
సిఖరోన్నత ధీర సమాన లక్ష్యాలను ఎంచుకుంటూ..
వాత్సల్యానురాగ రాగాలను పంచుకుంటూ
ఆమె... సాహితీ సుమతి చలసాని వసుమతి!
- చలసాని వసుమతి
ఈ పుస్తకంలోని కథలు ఆధ్యాత్మికతను వెల్లడి చేస్తూ, సందేశాత్మకంగా ఉండటం విశేషం. ఎన్ని తరాలు మారినా ఏమాత్రం మారనిది... ఇప్పుడే వికసించిన పువ్వులా తాజాదనం చిందిస్తూ ఉండేది ప్రేమ. కులాలు,మతాలు, ఆస్తులు, అంతస్తులు, పేద ధనిక తేడాలు లేనిది ప్రేమ. ఎన్ని కథలొచ్చినా, ఎన్ని నవలలొచ్చినా, ఎన్ని సినిమాలొచ్చినా ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తుంది...పాఠకుణ్ణి లేదా ప్రేక్షకుణ్ణి మైమరిపింపజేస్తుంది ప్రేమ కథాంశం. 'శబరి' గేయనాటిక డా. భాస్కరాచార్య త్రిపాఠి గారి రచనకు తెలుగు అనువాదం. 'రాధిక వసంతమాసం' - ఒక స్త్రీ విషాద గాధ. 'ఇది కథ కాదు' - పురుషాహంకార దుష్ఫలితాల మీద చెప్పిన కథ. మహిళలు ఎప్పుడూ సహనశీలురే. అమృత హృదయులే. మారవలసింది మగవారు. 'జీవనది', 'సారీ అమ్మా', 'రామచరిత మానస్' ఇవన్నీ ప్రేమ తీరాలలో విహరింపజేసే చక్కటి కథలు. వీటితోపాటు ఆధ్యాత్మిక కథలు కూడా ఉన్నాయి - 'మాతృప్రేమ', 'త్యాగనిరతికి సంకేతం - స్త్రీ', 'కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు', 'జ్ఞాననిధులు-మన గ్రంథాలు', 'ఆనందానుభూతి', 'యశోద స్వగతం' మొదలగు కథలను సంబోధకంగా, సందేశాత్మకంగా, దృశ్యమానంగా చెప్పటం వసుమతి గారిలోని విలక్షణ లక్షణం. ఎనిమిది పదుల వయసులో సాహితి యాగానికి ఆధ్వర్యం వహిస్తూ... జీవదీపాలు వెలిగించాలనే తపన తీరక గ్రంధ రచనానుబంధాలు పెంచుకుంటూ... సిఖరోన్నత ధీర సమాన లక్ష్యాలను ఎంచుకుంటూ.. వాత్సల్యానురాగ రాగాలను పంచుకుంటూ ఆమె... సాహితీ సుమతి చలసాని వసుమతి! - చలసాని వసుమతి© 2017,www.logili.com All Rights Reserved.