"మా విద్యార్థులకు సిస్టమ్ ఆపరేట్ ఎలా చేయాలో నేర్పుతాము, కానీ అదే సిస్టం వాళ్ళను ఆపరేట్ చేయడాన్నుండి ఎలా తప్పించుకోవాలో నేర్పే బోధనా పద్ధతుల వ్యవస్థ మా వద్ద ఉండటం లేదు. నేను పనిచేసిన కాలేజ్ లకు భావ్యమయిన బిల్డింగ్స్ ఉండేవి, బాగా విశాలమైన ఆటల మైదానాలుండేవి, ఇండోర్ - అవుట్ డోర్ అన్ని రకాల ఆటలు ఆడుకోవడానికి అవసరమైన సౌకర్యాలు ఉంటాయి. అయినప్పటికీ ఆట మైదానాలన్నీ బోసిగానే ఉంటుంటాయి. స్టూడెంట్స్ అందరూ భారీ కర్టెన్స్ తో మూయబడి ఉండే కంప్యూటర్ ల్యాబ్స్ లోనే తమ సమయాన్నంతా గడిపేవారు. ఆ ల్యాబ్స్ లో ఉండే వాళ్ళకు బయట ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడు పొద్దుపోయిందో, ఎప్పుడు వర్షం పడిందో, ఎప్పుడు అందమైన సాయంత్రం గడిచిందో తెలుసుకోవాలని కూడా అస్సలు అనుకోరు. ల్యాబ్స్ లో స్టూడెంట్స్ అంతా తమ ప్రపంచంలో ఏమురుపాటుతో మునిగిపోయి ఉంటారు. వాళ్ళకు తమ చుట్టు పక్కల ఏమి జరుగుతోందనేది అవసరమే లేదు. రోబోలను మనుషుల్లాగా చేసేస్తున్నారు, కానీ మనుషులు రోబోలయిపోతున్నారు.
- ఆకాంక్ష పారేశివ్, ఎస్. కలందర్ బాషా